- Home
- Astrology
- Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారికి పిచ్చి ప్రేమ.. అబద్ధాలు సహించరు, పొసెసివ్‌నెస్ ఎక్కువ
Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారికి పిచ్చి ప్రేమ.. అబద్ధాలు సహించరు, పొసెసివ్‌నెస్ ఎక్కువ
Numerology: మనిషి పుట్టిన తేదీ ప్రకారం భవిష్యత్తును అంచనా వేయొచ్చని సంఖ్యా శాస్త్రం చెబుతోంది. న్యూమరాలజీ ప్రకారం రాడిక్స్ నెంబర్ 4 ఉన్న వారు వ్యక్తిత్వం, ప్రేమ జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

న్యూమరాలజీ ఏమి చెబుతుంది?
ఆస్ట్రాలజీలా న్యూమరాలజీ కూడా వ్యక్తి స్వభావాన్ని అర్థం చేసుకునే ఒక పద్ధతి. పుట్టిన తేదీ ఆధారంగా వచ్చే రాడిక్స్ నంబర్ వ్యక్తి ఆలోచన విధానం, నిర్ణయాలు తీసుకునే తీరు, సంబంధాలపై ప్రభావం చూపుతుందని నిపుణుల అభిప్రాయం. కొన్ని నంబర్ల ప్రభావంలో ఉన్నవారు తమ నిర్ణయాల విషయంలో చాలా గట్టిగా ఉంటారని చెబుతారు.
రాడిక్స్ నంబర్ 4 ఉన్నవారు ఎవరు?
4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వారికి రాడిక్స్ నంబర్ 4 వస్తుంది. పుట్టిన తేదీలోని అంకెలను కలిపినా ఇదే సంఖ్య వస్తుంది. ఈ నంబర్ ప్రభావంలో ఉన్నవారు సాధారణంగా తమదైన ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఇతరుల మాటలు వెంటనే అంగీకరించరు. నిర్ణయం తీసుకున్న తర్వాత దానిపై నిలబడే స్వభావం ఉంటుంది.
వీరి ప్రేమ స్వభావం ఎలా ఉంటుంది?
రాడిక్స్ నంబర్ 4 ఉన్నవారు ప్రేమను చాలా సీరియస్‌గా తీసుకుంటారు. సరదాగా రిలేషన్‌లోకి వచ్చి బయటకు వెళ్లే టైప్ కాదు. ఒకసారి ప్రేమలో పడితే దానిని నిలబెట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. మాటల కంటే పనుల ద్వారా ప్రేమ చూపడం వీరి ప్రత్యేకత. పార్ట్‌నర్ అవసరాలు, భద్రత, సంతోషం మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు
పొసెసివ్ స్వభావం వల్ల వచ్చే సమస్యలు
అతి శ్రద్ధ కొన్నిసార్లు సమస్యలకు కారణమవుతుంది. పార్ట్‌నర్ ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇది కంట్రోల్ చేస్తున్నట్లుగా అవతలి వ్యక్తికి అనిపించవచ్చు. అప్పుడు చిన్న విషయాలే పెద్ద విభేదాలకు దారి తీస్తాయి. ప్రేమను కోల్పోతామన్న భయమే ఈ ప్రవర్తన వెనుక కారణమని నిపుణులు చెబుతున్నారు.
నమ్మకం ఉంటే బలమైన బంధం
ఈ నంబర్ ప్రభావంలో ఉన్నవారు అబద్ధాలను అస్సలు సహించరు. స్పష్టత కావాలనుకుంటారు. ఒకసారి నమ్మకం ఏర్పడితే ఆ బంధాన్ని జీవితాంతం గౌరవిస్తారు. కష్టకాలంలో కూడా పార్ట్‌నర్ చేయి విడవరు. కుటుంబం మొదటి ప్రాధాన్యంగా భావిస్తారు. అయితే తమ అభిప్రాయాలను కొంచెం సాఫీగా వ్యక్తపరిస్తే జీవితంలో చాలా సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి.
గమనిక: పైన తెలిపిన వివరాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించడమైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గమనించాలి.

