- Home
- Entertainment
- Intinti gruhalakshmi: తులసికి సర్ ప్రైజ్ ఇచ్చిన సామ్రాట్.. కుళ్లిపోతున్న నందు, లాస్య!
Intinti gruhalakshmi: తులసికి సర్ ప్రైజ్ ఇచ్చిన సామ్రాట్.. కుళ్లిపోతున్న నందు, లాస్య!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఆగస్ట్ 5వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం...

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... లాస్య సామ్రాట్ ని,బాస్ అయి ఉండి కూడా ఎంప్లాయి తో ఆడుతున్నారంటే మామూలు విషయం కాదు అని పొగుడుతూ ఉంటుంది. అప్పుడు సామ్రాట్ నేను గెలుస్తానని నాకు నమ్మకం ఉంది అంటాడు. లాస్య మనసులో మీరు అలాగే నమ్మకం పెంచుకోండి.అప్పుడే ఓడిపోతే బాధ ఎక్కువగా ఉంటుంది అని అనుకుంటుంది. తులసి ఇదంతా చూసి ప్రశాంతంగా ఉన్న వాతావరణంని లాస్య కావాలని చెడగొడుతుంది అనుకుంటుంది.
ఈలోగా ఇద్దరు ఆట మొదలుపెడతారు. చాలాసేపు ఇద్దరు మధ్య పోటీ జరుగుతూ ఉంటుంది.సామ్రాట్ గెలిచే స్థితిలో ఉండగా తులసి సామ్రాట్ని గెలవొద్దు అని నమ్మదిగా చెబుతుంది. సామ్రాట్ తులసి మాట విని కావాలని ఓడిపోతాడు. అందరూ నందుకి శుభాకాంక్షలు చెప్తారు. తులసి అప్పుడు బయటకు వచ్చేస్తుంది. సామ్రాట్ కూడా బయటకి వస్తాడు. గెలిచే మనిషిని ఓడిపించేలా చేసాను నన్ను క్షమించండి అని తులసి అనగా, మర్యాదగా ఓడిపోవడం అంటే ఏంటో తెలుసుకునేలా చేశారు అని అంటాడు సామ్రాట్.
తర్వాత సామ్రాట్, తులసిని పొగుడుతూ ఉంటాడు. పక్కనున్న రోజా పువ్వుని తెంపి తనతో తులసిని పోల్చుతూ ఉంటాడు. వాళ్ళిద్దరూ ఎంతో నవ్వుతూ మాట్లాడుకుంటారు. దాన్ని తులసి వాళ్ళ అత్తయ్య,మావయ్య చూస్తూ వీళ్ళకి ఎవరి దిష్టి తగలకుండా ఉంటే బాగుండు అనుకుంటారు. అదే సమయంలో నందు అక్కడికి వస్తాడు.అప్పుడే తులసి,సామ్రాట్ దగ్గర నుంచి ఆ పువ్వుని తీసుకుంటుంది. దాన్ని హనికి పెడతాను అంటుంది. ఈ లోగ సామ్రాట్, మీకొక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను తులసి గారు అంటాడు.
ఆ మాటలకు నందు కుల్లుకొని లోపలికి వెళ్ళిపోతాడు. ఇంట్లో అందరూ ఎంతో సంతోషంగా సమయం గడుపుతారు. అప్పుడు సామ్రాట్ అందరి మధ్యకి వెళ్లి, హనీ ని గెలిపించినందుకు తులసి గారికి ఒక బహుమతి ఇవ్వాలి అనుకుంటున్నాను అని చెప్తాడు. నాకెందుకు బహుమతి? అని తులసి అనగా, మీరు కచ్చితంగా ఈ బహుమతి తీసుకోవాల్సిందే అని చెప్పి పని వాళ్ళ చేత ఆ బహుమతిని లోపల పెట్టిస్తాడు. అదేంటో అని అందరూ ఆసక్తిగా చూస్తారు. తులసి ఆ బహుమతిని విప్పుతుంది. ఆ బహుమతిని విప్పి చూస్తే అది వీణ. అందరూ ఎంతో ఆనందపడతారు. తులసి సామ్రాట్ కి ధన్యవాదాలు చెబుతుంది.
నేను మీకు గిఫ్ట్ ఇచ్చాను కదా అలాగే మీరు కూడా నాకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి. ఈ వీణతో మొదటి పాట మీరు ఇక్కడే మా అందరి ముందు పాడాలి అని అనగా తులసి పాట పాడుతుంది. ఆ పాటకి అక్కడున్న వాళ్ళందరూ మైమరిచిపోతారు. పాట పూర్తవగానే అందరూ చప్పట్లు కొడతారు. నందు చప్పట్లు కొట్టక పోయేసరికి నీకు పాట నచ్చలేదా? అని సామ్రాట్ అడుగుతాడు.పాట వింటూ మైమరిచిపోయి చప్పట్లు కొట్టడం మర్చిపోయాడు.అని లాస్య నందుని కవర్ చేస్తుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే.