Samantha: చేతిలో జపమాల, తెల్లని వస్త్రాలు... సమంత ఏం సంకేతం ఇస్తున్నట్లు!
సమంత చేతిలో జపమాల అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చివరకు ప్రెస్ మీట్లో సైతం పక్కన పెట్టకుండా సమంత దాన్ని చేతికి చుట్టుకోవడం పలు సందేహాలకు కారణం అవుతుంది.
Samantha
అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ అంటే సమంతనే. దశాబ్దకాలంగా ఆమె తిరుగులేని హీరోయిన్. లక్ కి టాలెంట్ తోడవడంతో సక్సెస్ఫుల్ కెరీర్ సొంతమైంది. ఇన్నేళ్ళలో ఆమెకు తిరోగమనం లేదు. అటు వ్యక్తిగత జీవితం కూడా చక్కగా కుదిరింది. నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకొని అక్కినేని వారింటి కోడలు అయ్యింది.
Samantha
అయితే 2021లో సమంత పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయ్యింది. నాగ చైతన్యతో సమంతకు మనస్పర్థలు తలెత్తాయి. చైతూ-సమంత విడిపోయారు. సమంత-చైతూ విడాకుల వార్తలు తెరపైకి వచ్చాయి. అదే ఏడాది అక్టోబర్ నెలలో చైతూ, సమంత అధికారికంగా విడాకులు ప్రకటించారు. అప్పటికే చాలా రోజులుగా ఆ న్యూస్ మీడియాలో చక్కర్లుకొడుతుండగా... జనాలు పెద్దగా షాక్ కాలేదు.
విడాకులకు మించిన వేదన పుకార్లతో సమంత ఎదుర్కొన్నారు. కారణం సమంతనే అంటూ ఆమెపై నిందలు వేశారు. సమంతకు అఫైర్స్ అంటగట్టారు. సమంతకు పిల్లలు కనడం ఇష్టం లేదని ఆరోపణలు చేశారు. మీడియా సంస్థల ఆరోపణలు శృతిమించగా సమంత మొదట రిక్వెస్ట్ చేశారు. వినకపోవడంతో చట్టపరమైన చర్యలు చేపట్టారు.
విడాకుల డిప్రెషన్ నుండి బయటపడేందుకు సమంత(Samantha)కు నెలల సమయం పట్టింది. వెంటనే ఆమెను మరో సమస్య చిక్కుకున్నారు. అరుదైన మయోసైటిస్ బారినపడ్డారు. వృద్ధులకు, చిన్న పిల్లలకు మాత్రమే వచ్చే ఈ వ్యాధి సమంతకు రావడం ఆశ్చర్యపరిచింది. కొన్ని నెలలుగా సమంత ఇంటిలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.
Samantha
కాగా సమంత ట్రీట్మెంట్ తో పాటు మానసిక ప్రశాంత కోసం ఆధ్యాత్మిక గురువులు, స్వామీజీలు చెప్పిన విషయాలు పాటిస్తున్నారని తెలుస్తుంది. సమంత ఎక్కడకు వెళ్లినా ఆమె చేతిలో జపమాల ఉంటుంది. సందర్భం ఏదైనా సమంత దాన్ని వదలడం లేదు. నేడు శాకుంతలం ట్రైలర్ విడుదల ఈవెంట్లో పాల్గొన్న సమంత జపమాల చేతిలో పెట్టుకొనే మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ఇటీవల సమంత ముంబై వెళ్లారు. ఎయిర్ పోర్టులో ఆమె కెమెరా కంటికి చిక్కారు. చేతిలో జపమాల ఉంది. ప్రయాణాలలో కూడా సమంత జపమాలను తోడుగా తీసుకెళ్తున్నారని తెలిసింది. మరో విషయం ఏమిటంటే ఆమె తెల్లని వస్త్రాలు ధరిస్తున్నారు.
ఈ క్రమంలో ఆరోగ్యం కోసం, కెరీర్ కోసం, మానసిక ప్రశాంత కోసం కొన్ని పద్ధతులు ఫాలో అవుతున్నారుపిస్తుంది. ఆధ్యాత్మిక గురువులు చెప్పిన మాటలు ఆమె అనుసరిస్తున్నారని తెలుస్తుంది. అది మూఢనమ్మకమైనప్పటికీ గట్టిగా నమ్మే వారికి ఉపశమనం కలిగిస్తుంది.
ఇక జపం చేయడం అనేది యోగాలో ఒక భాగం అని చెప్పొచ్చు. కాగా నేడు విడుదలైన శాకుంతలం ట్రైలర్(Shaakuntalam Trailer) ఆకట్టుకుంది. దర్శకుడు గుణశేఖర్ ఈ పౌరాణికగాథను తెరకెక్కించారు. దిల్ రాజు నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు.