రష్మిక మందన్న హవా: 3 సినిమాలతో IMDb రికార్డ్!
రష్మిక మందన్న తన మూడు చిత్రాలతో IMDb 2025లో అత్యధికంగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాల జాబితాలో చోటు సంపాదించుకుంది. సికిందర్, ఛావా, థమ చిత్రాలతో ఆమె అభిమానులను అలరించనుంది.

Rashmika Mandanna
పుష్ప 3 చిత్రంతో రష్మిక మరోసారి దేశ వ్యాప్తంగా హాట్ ప్రాపర్టీగా మారిపోయింది. కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్‌లోనూ వరుస సినిమాలు చేస్తూ కెరీర్‌లో దూసుకెళ్తోంది . లాస్ట్ ఇయిర్ యానిమల్ చిత్రంతో భారీ సక్సెస్ ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మళ్లీ పుష్ప 2 తో దుమ్మురేపింది.
ఎక్కడా ఆమె గ్యాప్ తీసుకోకుండా పరుగెడుతోంది. ప్రస్తుతం ఈ భామ చేతినిండా చిత్రాలతో వరుస షూటింగ్స్‌తో గ్యాప్ లేకుండానే గడుపుతోంది. ఈ సారి ఏకంగా అరడజను సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంతేకాదు ఇప్పుడు IMDb లోనూ రికార్డ్ క్రియేట్ చేసింది.
పుష్ప 2 ది రూల్ చిత్రంతో శ్రీ వల్లిగా మరోసారి డిసెంబర్, జనవరిలలో థియేటర్లలో సందడి చేస్తోంది. మొదటి భాగం కన్నా రెండో భాగంలో ఎక్కువగా రష్మిక పాత్రను దర్శకుడు సుకుమార్ తీర్చిదిద్దారు. ఆమె క్యారెక్టరైజేషన్ సినిమాలో కీలకమై అద్భుతంగా ఉందని అందరూ మెచ్చుకున్నారు. రష్మిక మందన్న పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.
ఒక సాధారణ హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన రష్మిక, బ్యాక్ టు బ్యాక్ హిట్లతో నేషనల్ క్రష్‌గా మారారు. తెలుగు, కన్నడ, బాలీవుడ్ వంటి వివిధ భాషల్లో నటిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. రష్మిక ఇప్పుడు తను ప్రధాన పాత్రలో నటించిన మూడు చిత్రాలతో IMDb లిస్ట్ లో టాప్ లోకి చేరుకుంది.
IMDb 2025లో అత్యధికంగా ఎదురుచూస్తున్న భారతీయ సినిమాల లిస్ట్ (IMDb’s list of the Most Anticipated Indian Movies of 2025 ) లో 3 సినిమాలు రష్మికవే ఉండటం మామూలు విషయం కాదు.
IMDb లిస్ట్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది, A.R దర్శకత్వం వహించిన యాక్షన్ డ్రామా సికందర్ (నం. 1). మురుగదాస్, సల్మాన్ ఖాన్ సరసన రష్మిక నటిస్తున్నారు. ఈ సినిమాను నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా తెరకెక్కిస్తున్నారు.
పాపులర్ యాక్టర్ సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మురుగదాస్ సమాజంలోని అవినీతి, నేరాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి కథ నేపథ్యంలో సికిందర్ తెరకెక్కిస్తున్నాడని బీటౌన్ సర్కిల్ సమాచారం. సికిందర్‌లో ఓ వైపు ఎమోషన్స్‌ను హైలెట్ చేస్తూనే.. మరోవైపు హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నాయని ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్ చెబుతున్నాయి.
విక్కీ కౌశల్ మరియు రష్మిక నటించిన హిస్టారికల్ డ్రామా ఛావా (నెం. 10) ఫిబ్రవరిలో విడుదలకు షెడ్యూల్ చేయబడింది. విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఛావా'. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకుడు. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో శంభాజీ భార్య ఏసుబాయి పాత్రలో రష్మిక నటిస్తోంది. ఇప్పటికే ఛావా టీజర్ రిలీజ్ అయ్యి మంచి క్రేజ్ తెచ్చుకుంది.
దీపావళికి విడుదల కానున్న ఆయుష్మాన్ ఖురానాతో కలిసి రష్మిక చేస్తున్న హారర్-కామెడీ థమ (నెం. 17)లో కూడా నటిస్తుంది. ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేశ్ రావల్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారట. ‘ముంజ్య’ దర్శకుడు ఆదిత్య సర్పోత్థార్ ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించనున్నారు. బేడియా, స్త్రీ నిర్మాత దినేష్ విజన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది 2025 దీపావళి కానుకగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.
రష్మిక మాట్లాడుతూ, "IMDb 2025లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాల లిస్ట్ లో నా చిత్రాలను చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే భగవంతుడు ఆశీర్వాదంగా, కృతజ్ఞతగా భావిస్తున్నాను. 2024 పుష్ప 2కి వచ్చిన అఖండమైన రెస్పాన్స్‌తో గొప్పగా ముగిసింది. 2025 కూడా గొప్పగా ప్రారంభమవుతోంది. నా రాబోయే మూడు టైటిల్స్ మంచి సక్సెస్ అవుతాయి. ఇలాంటి సినిమాలే చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది.
ఇంతకీ IMDb 2025లో అత్యధికంగా ఎదురుచూస్తున్న మోస్ట్ ఏంటిసిపేటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్ లో ఏ సినిమాలు చోటు చేసుకున్నాయంటే..
1. Sikandar
2. Toxic
3. Coolie
4. Housefull 5
5. Baaghi 4
6. The Raja Saab
7. War 2
8. L2: Empuraan
9. Deva
10. Chhaava
11. Kannappa
12. Retro
13. Thug Life
14. Jaat
15. Sky Force
16. Sitaare Zameen Par
17. Thama
18. Kantara A Legend: Chapter 1
19. Alpha
20. Thandel