మహేష్ బాబుకు రాజమౌళి బిగ్ ట్విస్ట్ , సూపర్ స్టార్ కు టార్చర్ తప్పదా?
సూపర్ స్టార్ మహేష్ బాబుకు ట్విస్ట్ ల మీద ట్వీస్ట్ లు ఇస్తున్నాడట రాజమౌళి. అసలే పాన్ వరల్డ్ మూవీ కావడంతో.. మహేష్ బాబుకు టార్చర్ తప్పదంటున్నారు అభిమానులు.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ మూవీకి సబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈసినిమా స్టార్ట్ అయ్యిందా లేదా అనేది కూడా తెలియడంలేదు.
కొంత మంది మాత్రం సినిమా షూటింగ్ జరుగుతుంది సీక్రేట్ గా అంటున్నారు. మరికొంత మంది నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్స్ వేస్తున్నారు. త్వరలో స్టార్ట్ అవుతుంది అంటున్నారు. మరి అప్ డేట్ ఎప్పుడు ఇస్తారో తెలియదు.
Also Read: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కు ముహూర్తం ఫిక్స్, ఈసారి రెండు నెలలు ముందే సందడి
Mahesh Babu-Rajamouli film in telugu
కాని..మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం అప్ డేట్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో రాజమౌళి, మహేష్ బాబు సినిమాపై రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. రోజుకో రూమర్ వినిపిస్తుంది. జక్కన్న సినిమా అంటే అంత ఆశా మాషీ వ్యవహారం కాదు. ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. సినిమా కోసం ప్రాణం పెడతాడు రాజమౌళి.
Rajamouli
నిద్రహారాలు మాని మరీ సినిమాకోసం పనిచేస్తాడు.తనుచేస్తూ..తన టీమ్ ను కూడా పరుగులు పెట్టిస్తాడు జక్కన్న. ఒకరకంగా తారక్ సరదాగా చెప్పిన భాషలో చెప్పాలంటే.. రాజమౌళి టార్చర్ మామూలుగా ఉండదు. హీరో కూడా చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. అదంతా తెలిసే మహేష్ బాబు అంతా ఫిక్స్ అయ్యే రాజమౌళి సినిమాలోకి దూకాడు. సో మహేష్ బాబుకు ట్విస్ట్ ల మీద ట్వీస్ట్ లు ఇస్తున్నాడట జక్కన్న.
Also Read: చిరంజీవి కొరియోగ్రఫీ చేసిన ఏకైక సాంగ్ ఏ సినిమాలో తెలుసా?
లుక్ చేంజ్ దగ్గర నుంచి, స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ లు నేర్చుకోవడం వరకూ.. 50 ఏళ్ళ వయన్సులో మహేష్ ను పరుగులు పెట్టిస్తున్నాడట జక్కన్న. ఈసినిమా పాన్ వరల్డ్ మూవీ కావడం, అమెజాన్ అడవుల్లో సాగే అడ్వెంచర్ మూవీ కావడం, అక్కడి ట్రైబ్స్ ను బేస్ చేసుకుని చేస్తున్న సినిమా కావడంతో మహేష్ బాబు అనుకున్నదానికంటే ఎక్కువగా కష్టపడాల్సి వస్తుందట. షూటింగ్ స్టార్ట్ కాకముందే ఇంత ఉంటే.. షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఎంత ఉంటుంది అని ఆయన అభిమానులు అనుకుంటున్నారట.
Also Read: విజయ్ దళపతి, సూర్య ఇద్దరు రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఏదో తెలుసా?
జక్కన్న ఏదైనా అనుకుంటే అది పర్పెక్ట్ గా వచ్చేవరకూ వదిలిపెట్టడు. అందుకే ఆయన సినిమాలు గురితప్పవు. మహేష్ బాబు కాస్త ఓపికగా రాజమౌళికి సింక్ అయితే కనుకు.. సూపర్ స్టార్ కు ఆస్కార్ గ్యారెంటీ అనే చెప్పాలి. అభిమానులు దిల్ ఖుష్ అయ్యే సినిమాతో పాటు, పాన్ వరల్డ్ ఇమేజ్ ను తమ అభిమాన నటుడికి ఇచ్చి తీరుతాడు రాజమౌళి. కాని మహేష్ ఫ్యాన్స్ కు మాత్రం ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్ డేట్ ఇస్తే చాలు.
Also Read: సమంత ఆస్తి ఎన్ని కోట్లు, నెలకు ఆమె ఎంత సంపాదిస్తుందో తెలుసా?
మరి జక్కన్న ఏం చేస్తాడో.. సూపర్ స్టార్ కు ఇంకా ఎన్ని ట్విస్ట్ లు ఇస్తాడో చూడాలి. ఈసినిమాకోసం రెండు మూడేళ్ళు తీసుకుంటాడు అనడంలో ఎటువంటి సదేహం లేదు. ఇప్పటికే మహేష్ బాబు నుంచి సినిమావచ్చి ఏడాది పైనే అయ్యింది. మళ్ళీ మహేష్ ను స్క్రీన్ మీద చూడాలంటే టోటల్ గా నాలుగేళ్లు గ్యాప్ తప్పదు.
Also Read: 700 సినిమాల్లో నటించిన హీరోయిన్, 40 ఏళ్లలో రెండు పెళ్లిళ్లు, తాగుడికి బానిసైన స్టార్ నటి ఎవరు?