MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఏఎన్నార్ బయోపిక్ ఎప్పుడు? నాగార్జున, నాగచైతన్య లలో హీరోగా నటించబోయేది ఎవరు?

ఏఎన్నార్ బయోపిక్ ఎప్పుడు? నాగార్జున, నాగచైతన్య లలో హీరోగా నటించబోయేది ఎవరు?

ఇప్పటికే అలనాటి తారల బయోపిక్ లు ఎన్నో సందడి చేశాయి. కాగా ప్రస్తుతం ఏఎన్నార్ బయోపిక్ మూవీ కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుంది. ఎవరు నటిస్తారు? నిజమెంత? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 11 2026, 08:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రారాజు..
Image Credit : Asianet News

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రారాజు..

టాలీవుడ్ మొదటి తరం హీరోలలో ఎన్టీఆర్ తో పాటు ఏఎన్నార్ కూడా ఉన్నారు. ఇండస్ట్రీలో తన మార్క్ చూపించి, స్టార్ హీరోగా ఎదిగాడు ఏఎన్నార్. ఎన్టీఆర్ తో పోటీ ఉన్నా.. ఆయన జానర్ల జోలికి వెళ్లకుండా.. తనకంటూ సెపరేట్ పాత్ ను క్రియేట్ చేసుకున్నాడు అక్కినేని. టాలీవుడ్ కు వెస్ట్రన్ స్టెప్పులు నేర్పిన హీరో, తనకు నప్పని పాత్రల జోలికి వెళ్లకుండా.. తాను ఎందులో స్ట్రాంగ్ గా ఉంటాడో తెలుసుకుని సినిమాలు చేసుకుంటూ వెళ్లిన హీరో అక్కినేని.

26
క్రమశిక్షణ కలిగిన లైఫ్ స్టైల్..
Image Credit : Facebook/Allu Arjun

క్రమశిక్షణ కలిగిన లైఫ్ స్టైల్..

అక్కినేని చాలా స్ట్రిక్ట్ లైఫ్ స్టైల్ మెయింటేన్ చేసేవారు. డాక్టర్లు మూడేళ్లు కూడా బ్రతకడు అని తేల్చేసినా కూడా.. తన విల్ పవర్ తో 30 ఏళ్లు బ్రతికి చూపించారు. ఫుడ్ హ్యాబిడ్స్ కానీ.. వ్యాయామాల విషయంలో స్ట్రిక్ట్ గా ఉండేవారు. చెడు అలవాట్లు వైపుకు కూడా ఏఎన్నార్ వెళ్లలేదు. 

కాని డాక్టర్ల సలహామేరకు అక్కినేని రోజుకు ఒకటీ.. రెండు పెగ్గులు ఆల్కాహాల్ మాత్రం తీసుకునేవారు. అన్నింటికి మించి ఆయన ఏది మనసులోకి తీసుకునేవారు కాదు. సమస్య ఏదైనా.. చేయాల్సిన పని చేసేవారు, దాని ఫలితం పై ఎక్కువ హోప్స్ పెట్టుకోవడం, నష్టమొస్తే కుంగిపోవడం, లాభం వస్తే పొంగిపోవడం లాంటివి చేసేవారు కాదు. అదే ఆయన ఆరోగ్య రహస్యం.

Related Articles

Related image1
నాగార్జున, కృష్ణ అభిమానుల మధ్య అతి పెద్ద వార్... ఎప్పుడు జరిగిందో తెలసా? కారణం ఏంటి ?
Related image2
క్లైమాక్స్ రాయడానికే 18 ఏళ్లు.. 138 నిమిషాల ప్రభాస్ డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా?
36
అక్కినేని బయోపిక్ ఎప్పుడు..
Image Credit : Asianet News

అక్కినేని బయోపిక్ ఎప్పుడు..

90 ఏళ్లు హ్యాపీ లైఫ్ ను లీడ్ చేశారు అక్కినేని నాగేశ్వరరావు. 2014 లో ఆయన కన్నుమూశారు. తెలుగు పరిశ్రమలో మకుటం లేని మహారాజుగా వెలుగు వెలిగిన నాగేశ్వరావు మరణించి 12 ఏళ్లు అవుతోంది. అయన బయోపిక్ మూవీ గురించి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్లుగా వెలిగిన ఎన్టీఆర్, సావిత్రి లాంటి మహానటుల జీవిత కథలు సినిమాలుగా రూపొందాయి. ఆ తరంలో.. అంతటి స్థాయి ఉన్న అక్కినేని బయోపిక్ కూడా వస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

46
బయోపిక్ పై నాగార్జున ఆలోచన ఏంటి?
Image Credit : Asianet News

బయోపిక్ పై నాగార్జున ఆలోచన ఏంటి?

ఏఎన్నార్ జీవితం ఆధారంగా సినిమా చేయాలని నాగార్జున కూడా ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నారట. అఫీషియల్ గా ఈ విషయం ఎక్కడా చెప్పకపోయినా.. ఏఎన్నార్ బయోపిక్ పై చాలా కాలం నుంచి వర్క్ జరుగుతోందని సమాచారం. సినిమా చేస్తే.. పర్ఫెక్ట్ గా చేయాలి.. రిజల్ట్ తేడా రాకుండా జాగ్రత్తపడాలని నాగ్ అనుకుంటున్నట్టు సమాచారం. గతంలో ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో ఫలితాలతో ఇబ్బంది ఎదురైన సంగతి తెలిసిందే. అటువంటివి లేకుండా జాగ్రత్తగా అడుగులు వేయాలని చూస్తున్నారట.

56
నాగార్జున ‌- నాగచైతన్య లలో అక్కినేని పాత్ర ఎవరిది?
Image Credit : Asianet News

నాగార్జున ‌- నాగచైతన్య లలో అక్కినేని పాత్ర ఎవరిది?

ఏఎన్నార్ బయోపిక్ చేస్తారు సరే.. అందులో అక్కినేని నాగేశ్వరావు పాత్ర ఎవరు చేయబోతున్నారు అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. నాగచైతన్య, నాగార్జున ఇద్దరిలో ఎవరు నటిస్తారనేది సస్పెన్స్ గా మారింది. మరో వాదన ఏంటంటే.. అక్కినేని యంగ్ ఏజ్ లో ఉన్న పాత్రను నాగచైతన్య చేస్తారని.. కాస్త ఏజ్ వచ్చిన తరువాత నుంచి నాగార్జున ఆ పాత్రలో కనిపిస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మహానటి సినిమాలో యంగ్ నాగేశ్వరావు గా చైతూ నటించి మెప్పించారు. దాంతో చైతూనే నటిచే అవకాశం ఉన్నట్టు సమాచారం.

66
నటీనటులు, దర్శకుడు ఎవరు?
Image Credit : our own

నటీనటులు, దర్శకుడు ఎవరు?

ఈసినిమాపై ఇంత వరకూ నాగార్జున టీమ్ నుంచి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. అక్కినేని బయోపిక్ వస్తే ఎలా ఉంటుంది అన్న టాక్ మాత్రం సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. ఈ సినిమాపై అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నాగార్జున ఈ సినిమాను ఎప్పుడు ప్రకటిస్తారు..? కాంట్రవర్సీలకు తావులేకుండా ఈసినిమా కథను ఎవరు రాస్తారు, ఎవరు డైరెక్ట్ చేస్తారన్నది తెలియాల్సి ఉంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అక్కినేని నాగార్జున
నాగ చైతన్య
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: జ్యో మాస్టర్ ప్లాన్- ఇరుక్కున్న దీప, కార్తీక్- నిజం బయటపడుతుందా?
Recommended image2
క్లైమాక్స్ రాయడానికే 18 ఏళ్లు.. 138 నిమిషాల ప్రభాస్ డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా?
Recommended image3
Rashmika Mandanna: నో చెప్పి రష్మిక మందన్నాకి లైఫ్‌ ఇచ్చిన స్టార్‌ హీరో కూతురు.. బ్యాడ్‌ లక్‌ అంటే ఆమెదే
Related Stories
Recommended image1
నాగార్జున, కృష్ణ అభిమానుల మధ్య అతి పెద్ద వార్... ఎప్పుడు జరిగిందో తెలసా? కారణం ఏంటి ?
Recommended image2
క్లైమాక్స్ రాయడానికే 18 ఏళ్లు.. 138 నిమిషాల ప్రభాస్ డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved