MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • TV
  • Karthika Deepam 2 Today Episode: జ్యో మాస్టర్ ప్లాన్- ఇరుక్కున్న దీప, కార్తీక్- నిజం బయటపడుతుందా?

Karthika Deepam 2 Today Episode: జ్యో మాస్టర్ ప్లాన్- ఇరుక్కున్న దీప, కార్తీక్- నిజం బయటపడుతుందా?

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (మార్చి 11వ తేదీ)లో జ్యోత్స్న ట్రాప్ లో పడ్డ ఫ్యామిలీ. శౌర్య కిందపడిందని దీపకు అబద్ధం చెప్పి మరో హాస్పిటల్ కి రప్పించిన జ్యోత్స్న. టెన్షన్ లో కార్తీక్. టెస్టులకు వెళ్లిన దీప. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..  

3 Min read
Author : Kavitha G
Published : Mar 11 2026, 08:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ బుధవారం ఎపిసోడ్ లో డల్ గా ఉన్న దీపను నవ్వించే ప్రయత్నం చేస్తాడు కార్తీక్. అంతలో శివన్నారాయణ కార్తీక్ కి ఫోన్ చేస్తాడు. ఒకసారి నిన్ను కలవాలి. మాట్లాడే పని ఉంది. రేపు కాల్ చేస్తాను. ఎక్కడికి రావాలో చెప్తాను అంటాడు. సరే అంటాడు కార్తీక్. తాత ఊరికే ఎందుకు ఫోన్ చేస్తాడు. ఏదో కారణం ఉండే ఉంటుంది అంటుంది దీప.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఒక్క ఛాన్స్ ఇవ్వండి
Image Credit : Jiohotstar

ఒక్క ఛాన్స్ ఇవ్వండి

మీరు చెప్పమన్నట్లే చెప్పాను, కార్తీక్ రేపు నాతోపాటు వస్తాడు. అయినా కార్తీక్, దీపలకు కడుపులో బిడ్డ గురించి అబద్దాలు చెప్పాల్సిన అవసరం ఏముంది ? అని జ్యోత్స్నను అడుగుతాడు శివన్నారాయణ. అది నిరూపించేందుకే కదా.. నాకో అవకాశం ఇవ్వమని అడుగుతున్నాను అంటుంది జ్యోత్స్న. దీప, కార్తీక్ కలిసి మిమ్మల్ని, ముఖ్యంగా కాంచన అత్తను మోసం చేస్తున్నారు అంటుంది జ్యోత్స్న. నువ్వు వాళ్లపై పెద్ద నింద వేస్తున్నావు. నువ్వు చెప్పేది అబద్ధం అని తెలిస్తే నిన్ను ఎలా శిక్షిస్తానో కూడా చెప్పను అని వెళ్లిపోతాడు శివన్నారాయణ.

37
జ్యోతో చేతులు కలిపిన కాంచన
Image Credit : Jiohotstar

జ్యోతో చేతులు కలిపిన కాంచన

ఏదో అనుమానం వచ్చింది అన్నారు తెలుసుకున్నారా అని శ్రీధర్ ని అడుగుతుంది కాంచన. ఎలా తెలుసుకోవాలో అర్థం కావడం లేదు అంటాడు శ్రీధర్. నాకు తెలుసు అనుకుంటూ ఎంట్రీ ఇస్తుంది జ్యోత్స్న. నువ్వెందుకు వచ్చావ్? అంటుంది కాంచన. మేనకోడలు మేనత్త ఇంటికి రాకూడదా అని అడుగుతుంది జ్యోత్స్న. మనసు నిండా విషం పెట్టుకుని మాటల్లో అమృతం నింపుకొనే వాళ్లకు దూరంగా ఉండటమే మంచిది అని చెప్తుంది కాంచన. 

నీకు నచ్చే క్వాలిటీస్ నా దగ్గర ఏం ఉండవు అత్త. అదే నేను పని మనిషి స్థానంలో ఉంటే, నీ కొడుకు తాళి కట్టేవాడు. నువ్వు గుడి కట్టేదానివి. వచ్చే జన్మలో అయినా పనిమనిషిగా పుట్టి నీ ఇంటి కోడలు అవుతానులే అని దీపను ఉద్దేశించి మాట్లాడుతుంది జ్యోత్స్న. చూశారా అండి.. అంది ఎంత వెటకారంగా మాట్లాడుతుందో, ముందు నువ్వు బయటకు వెళ్లవే అంటుంది కాంచన. బావ, దీపలమీద నాలాంటి దానికి అనుమానం వస్తే ఓకే.. కానీ మీకు కూడా అనుమానం వచ్చిందంటే వాళ్లు ఏదో దాస్తున్నారనే కదా.. నేను దాన్ని బయటపెడతాను. మీరు ఓకే అంటే అందరికీ నిజం నీకు తెలిసేలా చేస్తాను అంటుంది జ్యోత్స్న. ఏం చేస్తావో చెయ్. కానీ నా కొడుకు, కోడలు బాధపడితే మాత్రం నేను ఊరుకోను అని చెప్తుంది కాంచన.

47
దీప కంగారు
Image Credit : Jiohotstar

దీప కంగారు

హాస్పిటల్లో ఉన్న దీపకు తెలియని నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. మీరు శౌర్య వాళ్ల అమ్మగారా.. తను స్కూల్లో మెట్లపై నుంచి పడిపోయిందని చెప్పి ఫోన్ కట్ చేస్తారు. మరోవైపు కార్తీక్ ని ప్లాన్డ్ గా శివన్నారాయణ బయటకు తీసుకెళ్తాడు. దీప, కార్తీక్ కి ఫోన్ చేసినా, శివన్నారాయణ లిఫ్ట్ చేయనివ్వడు. దీప కంగారుగా హాస్పిటల్ నుంచి బయటకు వస్తుంటే ఏమైందమ్మా అని అడుగుతాడు శ్రీధర్. శౌర్య గురించి చెప్పగానే, నేను తీసుకెళ్తాను అని మరొక హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. అక్కడ కార్తీక్, శివన్నారాయణ, కాంచన, జ్యోత్స్న, పారిజాతం ఉంటారు.

57
కార్తీక్ సీరియస్
Image Credit : Jiohotstar

కార్తీక్ సీరియస్

అబద్ధం చెప్పి దీపను ఇక్కడికి రప్పించాల్సిన అవసరం ఏముందని కార్తీక్ అందరిపై మండిపడతాడు. జ్యోత్స్న డాక్టర్ ని పిలిచి దీపకు టెస్టులు చేయమని చెప్తుంది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్న మనిషిని తీసుకొచ్చి టెస్ట్ లు అంటారేంటీ అని సీరియస్ అవుతాడు కార్తీక్. చేస్తే తప్పేంటి అంటుంది కాంచన. కార్తీక్, దీపలు దొరికిపోయారని లోలోపల సంతోషిస్తుంది జ్యోత్స్న. కాంచన డాక్టర్ ని పిలిచి, దీప కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఏదో సమస్య ఉందటా, దానివల్ల తల్లికి సమస్య ఉందటా.. అదేంటో టెస్ట్ చేసి చెప్పండి డాక్టర్ అని చెప్తుంది. దీపకు ఇక్కడ టెస్టులు చేయాల్సిన అవసరం లేదని కార్తీక్ అన్న, వాళ్లు వినిపించుకోరు.

67
కార్తీక్ ని ఇరికించిన జ్యో
Image Credit : Jiohotstar

కార్తీక్ ని ఇరికించిన జ్యో

బావ కంగారు చూస్తుంటే టెస్టులు చేస్తే ఏదో నిజం బయటపుడుతుందేమో అన్నట్లుగా ఉంది. ఏం దాచారు. అత్తకు అబద్ధం చెప్పారా అని అడుగుతుంది జ్యోత్స్న. నా భార్య గురించి మీరు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు నేను చూసుకోగలను అంటాడు కార్తీక్. ఈ మాట నన్ను అంటున్నావా, లేక అత్తను అంటున్నావా బావ అని కార్తీక్ ని ఇరికించే ప్రయత్నం చేస్తుంది జ్యోత్స్న. సెకండ్ ఒపినీయన్ తీసుకోవడంలో తప్పులేదు కదా కార్తీక్ అంటాడు శ్రీధర్. నువ్వు కూడా వీళ్లతో కలిసిపోయావా అంటాడు కార్తీక్.

77
అబద్ధం అని ఒప్పుకో..
Image Credit : Jiohotstar

అబద్ధం అని ఒప్పుకో..

అయితే దీప గురించి నువ్వు చెప్పింది అబద్ధం అని ఒప్పుకో అంటుంది కాంచన. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటాడు కార్తీక్. నువ్వు చెప్పింది అబద్ధం అని ఒప్పుకుంటావా? లేదా టెస్టులకు ఒప్పుకుంటావా? అని గట్టిగా అడుగుతుంది కాంచన. నువ్వు చెప్పింది నిజం అయితే నేను టెస్టులు చేయించినా అదే రిపోర్ట్స్ వస్తాయి కదా ఇక భయమెందుకు అంటుంది కాంచన. దీపను టెస్టులకు తీసుకెళ్తుంది డాక్టర్.

శౌర్య కిందపడిందని అబద్ధం చెప్పింది ఎవరు.. కొంచెమైనా బుద్ధి ఉందా? కంగారులో దీప ఎక్కడైనా కిందపడితే పరిస్థితి ఏంటి.. అని సీరియస్ అవుతాడు కార్తీక్. నిజం బయటపడే రోజు వచ్చింది దీప. ఇక ఏం చేయలేము అని మనసులో అనుకుంటాడు కార్తీక్. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Krishnudu Remueration: రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా? కూర్చొని లక్షలు సంపాదించాడు
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:కాంచన, కార్తీక్ ఏడుపు-జ్యోతో దీపను పోల్చొద్దన్న సుమిత్ర-జ్యో ఛాలెంజ్
Recommended image2
Karthika Deepam 2 Today Episode: దీపను ఊహించని విధంగా చంపుతానన్న జ్యో- దాసు, దశరథ షాక్-శ్రీధర్ డౌట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved