- Home
- Entertainment
- 700 సినిమాల్లో నటించిన హీరోయిన్, 40 ఏళ్లలో రెండు పెళ్లిళ్లు, తాగుడికి బానిసైన స్టార్ నటి ఎవరు?
700 సినిమాల్లో నటించిన హీరోయిన్, 40 ఏళ్లలో రెండు పెళ్లిళ్లు, తాగుడికి బానిసైన స్టార్ నటి ఎవరు?
హీరోయిన్ల జీవితం ఎప్పుుడ ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. వందల సినిమాల్లో నటించిన హీరోయిన్ తాగుడికి బానిసైంది. 44 ఏళ్ళలోరెండు పెళ్లిళ్లు చేసుకున్న ఆ స్టార్ ఎవరోతెలుసా..?
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. కమల్ హాసన్, మోహన్ లాల్, తెలుగులో జగపతిబాబు లాంటి స్టార్ హీల సరసన నటించి మెప్పించింది. హీరోయిన్ గా ఫేయిడ్ అవుట్ అయిన తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన ఈ తార కమెడియన్ గా కూడా నవ్వించింది. సౌత్ భాషల్లో ఆమె దాదాపు 700 సినిమాల్లో నటించింది. ఇన్ని సినిమాల్లో నటించిన ఈ తార తాగుడికి బానిసై తన లైఫ్ ను ఇబ్బందుల్లో నెట్టుకుంది. ఇంతకీ ఎవరామె.
ఇంతకీ ఆమె ఎవరో కాదు ఊర్వశి, పుట్టుకతో ఆమె మలయాళీ అయినప్పటికీ.. ఎక్కువగా తమిళ సినిమాల్లో ఫేమస్ అయ్యింది. తమిళనటిగా చెన్నైలో సెటిల్ అయ్యింది. అంతే కాదు తెలుగు, కన్నడ, సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించని ఊర్వశి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం సౌత్ మొత్తాన్ని శాసించింది. హీరోయిన్ గా కూడా ఊర్వశి చిన్నాచితకా హీరోలతో కాడు.. స్టార్ హీరోల సరసన జతకట్టింది.
మరీ ముఖ్యంగా మన తెలుగులో చిరంజీవి రుస్తుం సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. బాలకృష్ణతో బలే తమ్ముడు, జగపతి బాబుతో సందడే సందడి లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. కాకపోతే తెలుగులో హీరోయిన్ గా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె ఎక్కువ సినిమాలు చేసింది.
ఇక ఊర్వశి తమిళంలో కమల్ హాసన్, రజినీకాంత్, విజయ్ కాంత్, మలయాళంలో మోహన్ లాల్, మమ్ముట్టి, కన్నడాలో విష్షువర్దన్, రాజ్ కుమార్ లాంటి స్టార్ హీరోల సరసన మెరిసింది. ఇక హిందీలో కూడా ఓ సినిమా చేసిన ఊర్వశీ..ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది.
యంగ్ స్టార్స్ కు వదిన, అక్క, అమ్మ పాత్రలకు షిప్ట్ అయ్యింది. చాలా తక్కువ కాలంలోనే హీరోయిన్‌గా. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగిన ఊర్వశి, కెరీర్ పీక్‌లో ఉన్న టైమ్ లోనే చాలా సమస్యలతో సతమతం అయ్యింది. వ్యక్తిగత సమస్యలతో మద్యానికి అలవాటు పడి సినీ కెరీర్ నాశనం చేసుకుంది. మరీ ముఖ్యంగా ఆమె వివాహజీవితంలో చాలాసమస్యలు ఆమెను చుట్టుముట్టాయి.
2000లో మనోజ్ కె జయన్‌ను వివాహం చేసుకుంది ఊర్వశి. పెళ్లి తరువాత జీవితం బాగుుంటుంది అనుకుంటే.. భర్త కారణంగా ఆమెకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని తెలుస్తోంది. దాంతో అతనికి విడాకులు ఇచ్చింది ఊర్వశి. అయితే అప్పటికే ఆమెకు ఓ కూతురు ఉంది. ఆతరువాత 2016లో, 44 ఏళ్ల వయసులో చెన్నైకి చెందిన వ్యాపారవేత్త శివప్రసాద్‌ను రెండో పెళ్లి చేసుకుంది ఊర్వశి. ఈ దంపతులకు ఇహాన్ ప్రజాపతి అనే కుమారుడు కూడా పుట్టాడు. సెకండ్ మ్యారేజ్ తరువాత తన జీవితం ప్రస్తుతం హ్యాపీగా ఉంది.