MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • క్లైమాక్స్ రాయడానికే 18 ఏళ్లు.. 138 నిమిషాల ప్రభాస్ డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా?

క్లైమాక్స్ రాయడానికే 18 ఏళ్లు.. 138 నిమిషాల ప్రభాస్ డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా?

ప్రభాస్-పూజా హెగ్డే నటించిన 'రాధే శ్యామ్' విడుదలై నాలుగేళ్లు పూర్తయింది. ఈ సినిమా 2022 మార్చి 11న రిలీజైంది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన సాధించింది.  ఆడియన్స్ మాత్రం ఈ సినిమాపై పెదవి విరిచారు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 11 2026, 08:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రాధే శ్యామ్ రిలీజ్ అయ్యి 4 ఏళ్లు..
Image Credit : instagram

రాధే శ్యామ్ రిలీజ్ అయ్యి 4 ఏళ్లు..

పాన్ ఇండిచా  స్టార్ హీరో  ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' 2022లో విడుదలైంది. రిలీజ్‌కు ముందు మార్కెట్లో విపరీతమైన బజ్ క్రియేట్ చేసిన ఈసినిమా  అనుకున్న అంచనాలను  మాత్రం  అందుకోలేకపోయింది. కథలో దమ్ము లేకపోవడంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కాని ప్రేమికుల మనసుల్లో మాత్రం అద్భుతమైన దృశ్య కావ్యంగా మిగిలిపోయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కరోనా కారణంగా ఆగిపోయిన రిలీజ్..
Image Credit : instagram

కరోనా కారణంగా ఆగిపోయిన రిలీజ్..

 కేకే రాధాకృష్ణ కుమార్ డైరెక్టర్ చేసిన 'రాధే శ్యామ్' రిలీజ్ డేట్ చాలాసార్లు వాయిదా పడింది. ఈ సైన్స్-ఫిక్షన్ పీరియడ్ డ్రామాను నిజానికి 2021లోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా సినిమా విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది.

Related Articles

Related image1
100 ఎకరాల పొలం, వంట కూడా రావాలి.. కాబోయే భర్తపై రవితేజ హీరోయిన్ కండిషన్స్
Related image2
2026 లో టాలీవుడ్ టాప్ స్టార్స్ .. అల్లు అర్జున్, రష్మిక రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే
36
వీఎఫ్ఎక్స్ కోసం 60 కోట్లు
Image Credit : instagram

వీఎఫ్ఎక్స్ కోసం 60 కోట్లు

ప్రభాస్ 'రాధే శ్యామ్' సినిమా వీఎఫ్ఎక్స్ కోసం దాదాపు రూ.60 కోట్లు ఖర్చు చేశారు. అప్పటివరకు వచ్చిన సినిమాల్లోకెల్లా అత్యంత అధునాతన వీఎఫ్ఎక్స్ ఈ చిత్రంలో వాడారని ప్రచారం జరిగింది. ఈ సినిమా షూటింగ్‌ను హైదరాబాద్, ఇటలీ, జార్జియాలలో జరిపారు.

46
బాహుబలి షూటింగ్‌లో ఉండగా..
Image Credit : instagram

బాహుబలి షూటింగ్‌లో ఉండగా..

ప్రభాస్ 'బాహుబలి' షూటింగ్‌లో ఉన్నప్పుడే డైరెక్టర్ ఈ కథను ఆయనకు వినిపించారట. కథ నచ్చడంతో ప్రభాస్ వెంటనే ఓకే చెప్పారు. మొదట ఈ సినిమాను చంద్రశేఖర్ యేలేటి, రాధాకృష్ణ కుమార్‌తో కలిసి రాయడం ప్రారంభించారు. కానీ, చాలా ఏళ్లయినా చంద్రశేఖర్ క్లైమాక్స్ రాయలేకపోవడంతో ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశారు. ఆ తర్వాత రాధాకృష్ణ కుమార్ 18 ఏళ్లు కష్టపడి ఈ సినిమా క్లైమాక్స్‌ను రాశారు.

56
జ్యోతిష్యుడి పాత్రలో ప్రభాస్..
Image Credit : instagram

జ్యోతిష్యుడి పాత్రలో ప్రభాస్..

'రాధే శ్యామ్'లో ప్రభాస్ జ్యోతిష్యుడి పాత్ర పోషించారు. ఈ క్యారెక్టర్‌కు యూరప్‌కు చెందిన నిజమైన హస్తసాముద్రికుడు కీరో (Cheiro) స్ఫూర్తి అని డైరెక్టర్ వెల్లడించారు. ఇక పూజా హెగ్డే మ్యూజిక్ టీచర్‌గా నటించింది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ, సత్యరాజ్, కృష్ణంరాజు, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శిని, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్ కూడా నటించారు.

66
రాధే శ్యామ్ బాక్సాఫీస్ వసూళ్లు..?
Image Credit : instagram

రాధే శ్యామ్ బాక్సాఫీస్ వసూళ్లు..?

'రాధే శ్యామ్' సినిమాను రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కేవలం రూ.140 కోట్లు మాత్రమే వసూలు చేసి డిజాస్టర్‌గా నిలిచింది. వంశీ-ప్రమోద్, ప్రసీద, భూషణ్ కుమార్ ఈ సినిమాకు నిర్మాతలు. యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్
తెలుగు సినిమా
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు ద్రోహం చేసిన సురేఖ, పవర్ స్టార్ జీవితాన్ని మలుపు తిప్పిన చిరంజీవి భార్య
Recommended image2
Pawan Kalyan: పవన్‌ వల్లే ఉదయ్‌ కిరణ్‌ ఫోటోలు లీక్‌.. సుస్మిత ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ వెనుక జరిగింది ఇదే
Recommended image3
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Related Stories
Recommended image1
100 ఎకరాల పొలం, వంట కూడా రావాలి.. కాబోయే భర్తపై రవితేజ హీరోయిన్ కండిషన్స్
Recommended image2
2026 లో టాలీవుడ్ టాప్ స్టార్స్ .. అల్లు అర్జున్, రష్మిక రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved