- Home
- Entertainment
- Rajamouli on Ntr Role: ఎన్టీఆర్‌కి జరిగిన అన్యాయంపై ఫస్ట్ టైమ్ జక్కన్న వివరణ.. బ్రిలియంట్ ఆన్సర్
Rajamouli on Ntr Role: ఎన్టీఆర్‌కి జరిగిన అన్యాయంపై ఫస్ట్ టైమ్ జక్కన్న వివరణ.. బ్రిలియంట్ ఆన్సర్
`ఆర్‌ఆర్‌ఆర్` చిత్రంలో ఎన్టీఆర్‌కి అన్యాయం జరిగిందనే వాదన సినిమా విడుదల నుంచి వినిపిస్తూనే ఉంది. తాజాగా దీనిపై ఫస్ట్ టైమ్ దర్శకుడు రాజమౌళి వివరణ ఇచ్చారు. బ్రిలియంట్ ఆన్సర్ ఇచ్చారు. ఇంతకి ఏమన్నారంటే..

రాజమౌళి బుర్రలోనుంచి పుట్టిన కల్పితమైన అద్భుతం `ఆర్‌ఆర్‌ఆర్` సినిమా అనేది ఈ చిత్రం నచ్చిన వారినుంచి వినిపిస్తున్న మాట. కానీ రాజమౌళి ఈ సినిమాలో హడావుడి చేశాడు తప్ప అసలు మ్యాటర్ ఏం లేదనేది సినిమా నచ్చని వారి మాట. ఏదేమైనా సినిమా సాధారణ ఆడియెన్స్ కి నచ్చింది. అన్ని కలిసొచ్చి సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వెయ్యికోట్ల గ్రాస్‌ని కలెక్ట్ చేసింది. `బాహుబలి` తర్వాత బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.
తెలంగాణలో నైజాంకి వ్యతిరేకంగా పోరాడిన కొమురంభీమ్, బ్రిటీష్‌కి వ్యతిరేకంగా పోరాడిన అల్లూరి సీతారామరాజు పాత్రలను ఆధారంగా చేసుకుని, వారు ఉద్యమంలో పాల్గొనడానికి ముందు యువకులుగా ఉన్నప్పుడు ఏం చేశారనే ఫిక్షన్ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు రాజమౌళి. కొమురంభీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరిగా రామ్‌చరణ్ నటించారు. ఇద్దరు తమ పాత్రలకు ప్రాణం పోశారు. వెండితెరపై విశ్వరూపం చూపించారు. అయితే రామ్‌చరణ్ పాత్రతో పోల్చితే తారక్ రోల్ తగ్గిందని, ఎలివేషన్ తగ్గిందని, నిడివి తగ్గిందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. జక్కన్నపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ముంబయిలో ప్రెస్‌మీట్‌లో రామ్‌చరణ్‌కి ఇదే ప్రశ్న ఎదురైంది. ఎన్టీఆర్ పాత్రని మీరు డామినేట్ చేశారనే కామెంట్లపై ఆయన స్పందించారు. తాను ఒక్కశాతం కూడా అలా ఆలోచించడం లేదని, డామినేషన్, నిడివిని పట్టించుకోనని, అసలు అలాంటి తేడానే లేదని, ఇద్దరు పాత్రలు సమ ప్రాధాన్యత కలిగి ఉంటాయని, ఈ వాదనలో నిజం లేదని కొట్టిపడేశారు. అయితే తాజాగా రాజమౌళికి ఈ ప్రశ్న ఎదురైంది. ఎన్టీఆర్‌కి అన్యాయం చేశారనే ప్రశ్న ఆయనకు ఓ ఇంటర్వ్యూలో ఎదురు కాగా, జక్కన్న స్పందించారు. బ్రిలియంట్‌గా అన్సర్ ఇచ్చారు.
`ఆర్‌ఆర్‌ఆర్`లో ఎవరి డామినేషన్ లేదని చెప్పారు. చరణ్ డామినేట్ చేశాడనేదాంట్లో నిజం లేదన్నారు. ఏదైనా మనం చూసే దృష్టిలోనే ఉంటుందని, క్లైమాక్స్ లో రామ్‌చరణ్‌కి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండటం వల్ల అది చూసి బయటకు వచ్చిన ఆడియెన్స్ కి చరణ్ డామినేట్ చేసినట్టుగా అనిపిస్తుందని, అదే కొమురంభీముడో పాట క్లైమాక్స్ ఉండి ఉంటే ఎన్టీఆర్ డామినేట్ చేశాడని అనే వారని వివరణ ఇచ్చారు.
ఇంకా వీరి పాత్రలను ఆయన వివరిస్తూ, సినిమాలో చరణ్‌ని తారక్ రెండు సార్లు సేవ్ చేశాడని, కానీ తారక్‌ని చరణ్ ఒక్కసారే కాపాడాడని తెలిపారు. అంతేకాదు పదిహేనేళ్లుగా స్పష్టత లేని నా గోల్‌కి తారక్ దారి చూపించాడని, ఆయుధం ఒక్కటే ధైర్యం అనుకున్న నాకు అతడు ఎమోషన్ కూడా ఓ ఆయుధంగా చూపించాడని ఓ చోట చరణ్ చెబుతూ ఎన్టీఆర్‌ని ప్రశంసిస్తాడు. అక్కడ తారక్ హీరో అయ్యాడు, చరణ్ ఫాలోవర్ అయ్యాడని అనుకోవచ్చు కదా. ఇలా చూస్తే తారక్ డామినేషన్ కూడా కనిపిస్తుందని అద్భుతమైన వివరణ ఇచ్చారు. ఏదేమైనా జక్కన్న మ్యాజిక్ వెండితెరపైనే కాదు, సమాధానం చెప్పడంలోనూ వర్కౌట్ అయ్యిందంటున్నారు నెటిజన్లు.