- Home
- Entertainment
- Beast Movie FDFS : థియేటర్ లో పూజా హెగ్దే, అనిరుధ్, నెల్సన్ సందడి.. కిక్ ఫీల్ అయిన ఆడియెన్స్..
Beast Movie FDFS : థియేటర్ లో పూజా హెగ్దే, అనిరుధ్, నెల్సన్ సందడి.. కిక్ ఫీల్ అయిన ఆడియెన్స్..
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘బీస్ట్’ Beast. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ అయ్యింది. అయితే మొదటిరోజు స్టార్ కాస్ట్ ఆడియెన్స్ తో కలిసి సినిమా చూశారు. దీంతో థియేటర్లలో సందడి నెలకొంది.

Beast Movie FDFS
దళపతి విజయ్ (Vijay) నటించిన ‘బీస్ట్’ కోసం ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. ఈ చిత్రం ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. ప్రకటన వెలువడినప్పటి నుండి పట్టణంలో చర్చనీయాంశంగా మారిన ఈ చిత్రానికి FDFS నుండి అద్భుతమైన స్పందన వస్తోంది.
Beast Movie FDFS
ప్రపంచవ్యాప్తంగా ఈ పాన్ ఇండియా చిత్ర ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. ఈ యాక్షన్ చిత్రానికి వేల సంఖ్యలో అభిమానులతో పాటు ప్రేక్షకులు థియేటర్‌లకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో బీస్ట్ స్టార్ కాస్ట్ కూడా థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూడటం ప్రత్యేకంగా నిలిచింది.
Beast Movie FDFS
‘బీస్ట్’ హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde), అపర్ణా దాస్, అనిరుధ్ రవిచందర్ (Anirudh), నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilip Kumar) వంటి బీస్ట్ టీమ్ పలువురు ప్రముఖులు, ప్రేక్షకులతో FDFSని వీక్షించారు.
Beast Movie FDFS
హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh), ప్రియాంక అరుల్ మోహన్, వక్కంతం వంశీ మరియు ఇతర ప్రముఖులు కూడా విజయ్ సినిమాను అర్ధరాత్రి థియేటర్లలో వీక్షించారు. సినీ ప్రముఖులు చెన్నైలోని ఫేమస్ వెట్రి థియేటర్ లో సినిమాలను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Beast Movie FDFS
విజయ్ సినిమా రిలీజ్ తో థియేటర్లు భారీ కటౌట్ పోస్టర్లు, లైట్లతో నిండిపోయాయి. సినిమాకు అభిమానుల నుండి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. మరోవైపు ఫస్ట్ డే ఫస్ట్ షోను స్టార్ కాస్ట్ తో కలిసి వీక్షించడం పట్ల అభిమానులు కిక్ ఫీల్ అవుతున్నారు. ఇప్పటికే చార్ట్‌బస్టర్‌లుగా నిలిచిన పాటలు, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్ర అందించి మాస్ బీట్ ను ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
Beast Movie FDFS
ఈ చిత్రంలో విజయ్ హీరోగా నటించారు. ఆయన సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించింది. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సెల్వరాఘవన్, రెడిన్ కింగ్స్లీ, బ్జోర్న్ సుర్రావ్, VTV గణేష్, అపర్ణా దాస్, షైన్ టామ్ చాకోలు చిత్రంలో సహాయక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ అదిపోయే సంగీతం అందించారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు.