- Home
- Entertainment
- Acharya: అలా చెప్పి ఇలా చేశారేంటి, ఆచార్య ట్రైలర్ పై కామెంట్స్.. భీమ్లా నాయక్ తో పోల్చుతూ..
Acharya: అలా చెప్పి ఇలా చేశారేంటి, ఆచార్య ట్రైలర్ పై కామెంట్స్.. భీమ్లా నాయక్ తో పోల్చుతూ..
ఆచార్య ట్రైలర్ విషయంలో అభిమానుల నుంచి, నెటిజన్ల నుంచి కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ట్రైలర్ లో లోపాలని ఎత్తి చూపుతున్నారు.

Acharya Trailer
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల సినిమాలు బలమైన కథతో ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల కలయికలో వస్తున్న తొలి చిత్రం కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నిన్ననే ఆచార్య ట్రైలర్ కూడా విడుదల చేశారు. మెగా ఫ్యాన్స్ కోరుకునే అంశాలతో ట్రైలర్ అదిరిపోయింది.
Acharya Trailer
అద్భుతమైన ఎలివేషన్స్, చిరంజీవి మార్క్ వార్నింగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ బాగా హైలైట్ అయ్యాయి. కానీ ఆచార్య ట్రైలర్ విషయంలో అభిమానుల నుంచి, నెటిజన్ల నుంచి కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ట్రైలర్ లో లోపాలని ఎత్తి చూపుతున్నారు.
Acharya
ట్రైలర్ గురించి జరుగుతున్న చర్చలో రాంచరణ్ పాత్ర కూడా ఒకటి. ఈ చిత్రంలో చరణ్ సిద్ద అనే కామ్రేడ్ గా నటిస్తున్నాడు. అలాగే ధర్మస్థలిలో అమ్మవారి సేవలో ఉండే వ్యక్తిగా కూడా కనిపిస్తున్నాడు. సో రాంచరణ్ పాత్ర చిన్న కామియో రోల్ అని భావించడానికి లేదు. రాంచరణ్ ది కామియో రోల్ మాత్రమే అంటూ ఇప్పటి వరకు చెబుతూ వచ్చారు.
Acharya
కానీ ట్రైలర్ చాలా చోట్ల రాంచరణ్ డామినేషన్ కనిపించింది. ట్రైలర్ బిగినింగ్, ఎండింగ్ లో రాంచరణ్ యాక్షన్ సీన్స్ తో నింపేశారు. ట్రైలర్ చూసిన వారంతా ఇది రాంచరణ్, చిరంజీవి మల్టీస్టారర్ మూవీనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో రాంచరణ్ కి పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది కాబట్టి దానిని క్యాష్ చేసుకునేందుకే ట్రైలర్ లో రాంచరణ్ కట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అనే వాదన కూడా వినిపిస్తోంది.
Acharya
దీనివల్ల ట్రైలర్ చిరంజీవి పూర్త స్థాయిలో ఎలివేట్ కాలేదు. చూపించిన సన్నివేశాల వరకు బావున్నాయి. హీరోయిజం ఎలివేషన్స్ లో ట్రైలర్ లో రాంచరణ్ కే కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనిపించింది. అలాగే ఆచార్య ట్రైలర్ కి అఖండ చిత్రంతో పోలిక పెడుతున్నారు. రెండూ దేవాలయాల బ్యాక్ డ్రాప్ లో ఉన్న చిత్రాలే.
Acharya
ఇక ట్రైలర్ లో ఒకటి రెండు మినహా చిరంజీవికి కొరటాల మార్క్ పవర్ ఫుల్ డైలాగ్ పడలేదు. ఈ అంశాల నేపథ్యంలో కొత్త వాదన తెరపైకి వచ్చింది. మెగాస్టార్ హైలైట్ అయ్యేలా కొత్త ట్రైలర్ కావాలని కొందరు ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ట్రైలర్ విషయంలో కూడా అదే జరిగింది. ముందుగా రిలీజ్ చేసిన ట్రైలర్ అంతగా పేలలేదు. దీనితో కొత్త ట్రైలర్ వదిలారు. అది వర్కౌట్ అయింది.
Acharya
అదే తరహాలో ఆచార్య సెకండ్ ట్రైలర్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆచార్య కంటెంట్ పరంగా ఎవరికీ అనుమానాలు లేనప్పటికీ ఇలా చిన్న చిన్న విషయాలు వైరల్ అవుతున్నాయి.