MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • డైరెక్టర్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు, అయినా అతడే కావాలి.. లేకుంటే నన్ను మర్చిపోండి అంటూ చిరు వార్నింగ్

డైరెక్టర్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు, అయినా అతడే కావాలి.. లేకుంటే నన్ను మర్చిపోండి అంటూ చిరు వార్నింగ్

మెగాస్టార్ చిరంజీవి 90వ దశకం ప్రథమార్థంలో అయితే బాక్సాఫీస్ వద్ద విజృంభణ చేసారు. కొండవీటి దొంగ, ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ లాంటి అద్భుతమైన చిత్రాలన్నీ 90వ దశకం ఆరంభంలోనే పడ్డాయి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jul 31 2024, 06:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగాస్టార్ చిరంజీవి 90వ దశకం ప్రథమార్థంలో అయితే బాక్సాఫీస్ వద్ద విజృంభణ చేసారు. కొండవీటి దొంగ, ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ లాంటి అద్భుతమైన చిత్రాలన్నీ 90వ దశకం ఆరంభంలోనే పడ్డాయి. ప్రతి చిత్రం దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అదే విధంగా చిరంజీవి నటించిన మరో అద్భుత చిత్రం కూడా 1990లోనే వచ్చింది. ఆ మూవీ ఏదో కాదు. చిరంజీవి కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే జగదేక వీరుడు అతిలోక సుందరి. చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన ఆ చిత్రం టాలీవుడ్ ఆల్ టైం హిట్స్ లో ఒకటిగా ఉంటుంది. 

 

36

రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అశ్విని దత్ నిర్మాత. ఈ చిత్రానికి కథ యండమూరి వీరేంద్రనాథ్ అందించారు. ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నప్పుడు ముందుగా చిరంజీవి హీరోగా ఫిక్స్ అయ్యారు. ఈ కథని అద్భుతంగా తెరకెక్కించే డైరెక్టర్ కోసం చూస్తున్నారు. 

 

46

అప్పుడే రాఘవేంద్ర రావు పేరు ప్రస్తావనకు వచ్చింది. అయితే ఈ చిత్రానికి ముందు రాఘవేంద్ర రావు కి హ్యాట్రిక్ ఫ్లాపులు ఎదురయ్యాయి. దీనితో కొంతమంది ఆయనకై సందేహం వ్యక్తం చేశారట. వేరే డైరెక్టర్ ట్రై చేద్దాం అని చెప్పినవాళ్లు కూడా ఉన్నారు. కానీ చిరంజీవి ససేమిరా అన్నారట. 

 

56

ఫ్లాప్ డైరెక్టర్ ఎందుకు అని బయ్యర్లు కూడా కొంతమంది వద్దని చెప్పారట. కానీ చిరంజీవి.. రాఘవేంద్ర రావు అయితేనే నేను ఈ సినిమా చేస్తాను. లేకుంటే ఈ చిత్రంలో మీరు చిరంజీవిని మర్చిపోండి అని వార్నింగ్ ఇచ్చారట. దీనితో రాఘవేంద్ర రావు నే డైరెక్టర్ గా ఫైనల్ చేశారు. 

 

66

మూడు ఫ్లాపులు తర్వాత నాపై నాకే అనుమానం ఏర్పడింది. నేను ఇక పనికి వస్తానా అని అనుకునేవాడిని. ఆ టైం లో నాపై నమ్మకం ఉంచిన చిరంజీవికి, అశ్విని దత్ కి నేను రుణపడి ఉంటాను అని రాఘవేంద్ర రావు అన్నారు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bhoot Bangla OTT: భూత్ బంగ్లా ఓటీటీ రిలీజ్ డేట్.. అక్షయ్ సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Recommended image2
Karuppu Collections: బాక్సాఫీసు వద్ద 'కరుప్పు సునామీ.. 13 రోజుల్లో రికార్డ్ కలెక్షన్లు.. సూర్య మరో ట్రీట్‌
Recommended image3
Suriya: ఎట్టకేలకు బ్లాక్ బస్టర్.. 'కరుప్పు' ఫీవర్ తగ్గకముందే సూర్య కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved