MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • నేను నిజాలు బయటపెడితే తూ అని ఊంచుతారు.. లావణ్య ఫైర్‌.. రాజ్‌ తరుణ్‌ రియాక్షన్‌ ఇదే..

నేను నిజాలు బయటపెడితే తూ అని ఊంచుతారు.. లావణ్య ఫైర్‌.. రాజ్‌ తరుణ్‌ రియాక్షన్‌ ఇదే..

హీరో రాజ్‌ తరుణ్‌, లావణ్యల వివాదం రోజు రోజుకి మరింత ముదురుతుంది. తాజాగా రాజ్‌ తరుణ్‌ కోసం లావణ్య ప్రసాద్‌ ల్యాబ్‌ వద్ద రచ్చ చేసింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 31 2024, 08:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, లావణ్యల మధ్య రిలేషన్‌ ఇప్పుడు పెద్ద రచ్చ అవుతుంది. తాము పెళ్లి చేసుకున్నామని, పదేళ్లు గా కలిసి ఉంటున్నామని లావణ్య చెబుతుంది. ఇటీవల తనని వదిలేసి హీరోయిన్‌ మాల్వి మల్హోత్రాతో రాజ్‌ తరుణ్‌ కలిసి ఉంటున్నాడు, ఆమె కోసం తనని దూరం పెడుతున్నాడని ఆమె చెబుతుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మస్తాన్‌ సాయి అనే వ్యక్తితో లావణ్య ఎఫైర్‌ పెట్టుకుందని, డబ్బుల కోసం తనని వాడుకుంటుందని, తన ఇంట్లోనే ఉంటూ తనని బెదిరిస్తుందని అంటున్నాడు రాజ్‌ తరుణ్‌. వీరిద్దరికి సంబంధించిన పలు వీడియోలు, ఆడియోలు లీక్‌ చేసింది లావణ్య. ఒకరిపై ఒకరు ఆరోపణలు పీక్‌ కి వెళ్లాయి. గత కొన్ని రోజులుగా ఈ వివాదం నడుస్తుంది. 
 

37

లావణ్య తన నిరసన వ్యక్తం చేస్తుంది. మీడియా ముఖంగా తన బాధని, ఆవేదన వ్యక్తం చేస్తుంది. తాజాగా లావణ్య.. రాజ్‌ తరుణ్‌ని నిలదీసేందుకు వెళ్లింది. హైదరాబాద్ లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో రాజ్‌ తరుణ్‌ హీరోగా నటించిన `తిరగబడరా సామీ` ప్రెస్‌ మీట్‌ జరుగుతున్న సమయంలో ఆయన్ని కలిసేందుకు వచ్చింది లావణ్య. లోపల ప్రెస్‌మీట్‌లో రాజ్‌ తరుణ్‌ ఉండగా, బయట ఆమె నిరసన వ్యక్తం చేసింది. అయితే లోపలికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో తన నిరసన వ్యక్తం చేసింది. 
 

47

నా రాజ్‌ తరుణ్‌ నాకు కావాలంటూ ఆమె వెల్లడించింది. రాజ్‌ తరుణ్‌ని కలిసి ఆయనతో మాట్లాడానికి వచ్చినట్టు తెలిపింది లావణ్య. ఫోన్‌ ఆఫ్‌ చేసుకుని తప్పించుకుని తిరుగుతున్నాడు. శేఖర్‌ అనే వ్యక్తిని పంపించి క్యారెక్టర్‌ అస్సాసినేషన్‌ చేస్తున్నాడు. ఏం తప్పు చేయని మనిషి ఎందుకు తప్పించుకుంటున్నాడు, ఎందుకు తప్పించుకుని వెళ్లిపోతున్నాడు. నా రాజ్‌ కోసం ఈ పోరాటం అని తెలిపారు. 
 

57

ఆవిడ(మాల్వి మల్హోత్రా) సినిమాల కోసమే వస్తే, సినిమాలే చేస్తేఈ రోజు నేను ఇక్కడికి వచ్చేదాన్నికాదు. వాళ్లు రోజూ రాత్రి ఎక్కడ గడుపుతున్నాడు, పగలు ఎక్కడ గడుపుతున్నాడు. నా భర్తతో సంసారం చేసినట్టుగా ఎందుకు ఉంటుంది ఆమె. నా రాజ్‌ నాకు కావాలి`అంటూ వెల్లడించింది లావణ్య. ఆయనకు సంబంధించిన నిజాలన్నీ ఇంకా బయటపెట్టడం లేదు. అవన్నీ బయటపెడితే నిజంగానే మీరంతా తూ అని ఊంచుతారు. మస్తాన్‌ సాయితో తనకు ఉన్న సంబంధాన్ని లీగల్‌గా తేల్చుకుంటానని వెల్లడించింది లావణ్య. 
 

67

లావణ్యతో ఇష్యూపై రాజ్‌ తరుణ్‌ స్పందిస్తూ, దీని వల్ల తాను చాలా డిస్టర్బ్ అయ్యానని, మా ఫ్యామిలీని కూడా వదల్లేదని, వాళ్లు కూడా సఫర్‌ అవుతున్నారని తెలిపాడు. ఈ కేసు కోర్ట్ లో ఉందని, ఈ విషయాన్ని న్యాయబద్దంగానే తేల్చుకుంటానని, తాను ఇప్పటి వరకు ఎలాంటి ఫోటోలు, వీడియోలు లీక్‌ చేయలేదని,తన వద్ద చాలా ఉన్నాయని, అవన్నీ కోర్ట్ లో సబ్‌మిట్‌ చేస్తానని తెలిపాడు రాజ్‌ తరుణ్‌. అబార్షన్‌ చేయించి ఉంటే ఆధారాలు ఎక్కడ ఉన్నాయని ఆ ఆధారాలుంటే పోలీసులకు సబ్‌మిట్‌ చేసేవాళ్లు కదా, కేసు ఫైల్‌ చేసేవారు కదా అంటూ ప్రశ్నించారు రాజ్‌ తరుణ్‌.
 

77

ఇన్ని రోజులు దీనిపై మీడియా ముందుకు ఎందుకు రాలేదు, ఎందుకు హైడ్‌ అయ్యారనేదానిపై రాజ్‌ తరుణ్‌ మాట్లాడుతూ, బాధ వేసినప్పుడు బయటకు రావడానికి అదోలా ఉంటుందన్నారు. నా సెలబ్రిటీ హోదా డ్యామేజ్‌ అవుతుందనే ఇన్నాళ్లు ఆగానని చెప్పారు. లావణ్య వెనకాల పెద్ద హస్తం ఉందని తాను అనుకోవడం లేదని తెలిపాడు రాజ్‌ తరుణ్‌. మరి ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Director Teja: టాలీవుడ్ లో తీసేది ఆ రెండు కథలే, నన్ను మాత్రం జయం పేరు చెప్పి తిడతారు.. డైరెక్టర్ తేజ
Recommended image2
Chiranjeevi: చిరంజీవిని ఎందుకు తొక్కలేకపోయారు.. అదే రక్షణ కవచం, ఇన్నేళ్లకు బయటపెట్టిన పున్నమినాగు నటుడు
Recommended image3
Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved