MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Director Teja: టాలీవుడ్ లో తీసేది ఆ రెండు కథలే, నన్ను మాత్రం జయం పేరు చెప్పి తిడతారు.. డైరెక్టర్ తేజ

Director Teja: టాలీవుడ్ లో తీసేది ఆ రెండు కథలే, నన్ను మాత్రం జయం పేరు చెప్పి తిడతారు.. డైరెక్టర్ తేజ

డైరెక్టర్ తేజ టాలీవుడ్ లో తెరకెక్కించిన ఒకే తరహా సినిమా కథలపై సెటైర్లు వేశారు. సినిమా కథలు అయితే బాషా ఫార్ములా లేదా గుండమ్మ కథ ఫార్ములాతోనే ఉంటాయి అని అన్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 29 2026, 07:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Director Teja
Image Credit : Asianet News

Director Teja

డైరెక్టర్ తేజ దర్శకుడిగా 'చిత్రం' మూవీతో పరిచయమయ్యారు.ప్రేమ కథా చిత్రాలతో వరుస హిట్లు కొడుతూ టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా మారారు. జయం లాంటి సంచలన బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత తేజ ట్రాక్ తప్పారు. వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి. 15 ఏళ్ళ తర్వాత నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో తేజ హిట్ కొట్టారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రెండు కథలు మాత్రమే ఉంటాయి
Image Credit : Twitter

రెండు కథలు మాత్రమే ఉంటాయి

ఓ ఈవెంట్ లో డైరెక్టర్ తేజ మాట్లాడుతూ తనపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చే క్రమంలో తెలుగు సినిమాల కథలపై సెటైర్లు వేశారు. ఆయన ఏమన్నారంటే.. నాకు ఫ్లాపులు ఎదురవుతున్న టైంలో పదేళ్లకు పైగా తెలుగు సినిమా కథలని బాగా అబ్జెర్వ్ చేశాను. అన్ని సినిమాల్లో 2 కథలు మాత్రమే ఉన్నాయి. నేను ఆ కథలు ఏంటో చెబుతాను.. మీరు టైటిల్స్ ఊహించుకోండి.

35
బాషా ఫార్ములా
Image Credit : Director Teja\Twitter

బాషా ఫార్ములా

ఒక హీరో ఉంటాడు.. వేరే ఊళ్లోకి వెళతాడు. అక్కడ అందరిలో కలసిపోయి సామాన్యుడిలా బతుకుతుంటాడు. ఆటో తోలడమో, కారు డ్రైవర్ గానో పనిచేస్తుంటాడు. చిన్న చిన్న సహాయాలు చేస్తుంటాడు. ఇంటర్వెల్ లో బాబు గారు అంటూ ఒక వ్యక్తి అతడిని గుర్తు పడతాడు. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్.. ఫ్లాష్ బ్యాక్ లో హీరో కానీ హీరో త్రండ్రి కానీ పెద్ద తోపు అయి ఉంటాడు. బాషా నుంచే ఇవే సినిమాలు చేస్తున్నారు.

45
గుండమ్మ కథ తరహా సినిమాలు
Image Credit : Asianet News

గుండమ్మ కథ తరహా సినిమాలు

రెండవ కథ వచ్చేసి హీరో విలన్ ఇంటికి పనోడిగా వెళతాడు. విలన్ కూతురినే ప్రేమిస్తాడు. ఆ విషయం ఎవ్వరికీ తెలియదు. ఒక్కడికి మాత్రం తెలిసి ఉంటుంది. కానీ వాడికి నోరో చెయ్యో పడిపోయి ఉంటుంది. లేదా హీరో అతడిని బెదిరిస్తాడు. ఇది గుండమ్మ కథ ఫార్ములా. ఇవే కథలని తిప్పి తిప్పి తీస్తున్నారు. కానీ అందరూ తిట్టేది మాత్రం నన్నే. నేను ఏ సినిమా చేసినా జయం లాగే ఉంది అని తిడతారు. కానీ వాళ్ళు మాత్రం ఒకే కథతో ఏళ్ల తరబడి అవే సినిమాలు చేయొచ్చు. అదేంటో నాకు అర్థం కాదు అంటూ తేజ సెటైర్లు వేశారు.

55
తేజ చివరి సినిమా
Image Credit : Asianet News

తేజ చివరి సినిమా

ప్రేక్షకులు కూడా ఆ సినిమాలనే మళ్ళీ మళ్ళీ చూస్తూ సూపర్ హిట్స్ చేస్తున్నారు. ఇదేమి న్యాయం అని తేజ ప్రశ్నించారు. డైరెక్టర్ తేజ చివరగా రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ దగ్గుబాటి హీరోగా అహింస అనే మూవీ తెరకెక్కించారు. ఆ మూవీ డిజాస్టర్ అయింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Charan Remuneration: నాలుగు వారాలున్న చరణ్‌కి బిగ్‌ బాస్‌ తెలుగు 10 నుంచి దక్కిన పారితోషికం ఇంతేనా?
Recommended image2
Bigg Boss 10: హౌస్ నుంచి అపూర్వ, చరణ్ ఇద్దరూ అవుట్.. షాలినికి చుక్కలు చూపించిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్
Recommended image3
Ramakrishna: ఖాకీ యూనిఫామ్ వేసుకోవాలనే కల, కానీ క్యాటరింగ్ యూనిఫామ్ తో జీవితం.. బిగ్ బాస్ లోకి రామకృష్ణ
Related Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవిని ఎందుకు తొక్కలేకపోయారు.. అదే రక్షణ కవచం, ఇన్నేళ్లకు బయటపెట్టిన పున్నమినాగు నటుడు
Recommended image2
Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved