- Home
- Entertainment
- Krithi Shetty Pics : మినీ డ్రెస్ లో బార్బీబొమ్మలా ‘ఉప్పెన’ బ్యూటీ.. కృతి శెట్టి అందాలకు కుర్రాళ్లు ఫిదా..
Krithi Shetty Pics : మినీ డ్రెస్ లో బార్బీబొమ్మలా ‘ఉప్పెన’ బ్యూటీ.. కృతి శెట్టి అందాలకు కుర్రాళ్లు ఫిదా..
యంగ్ హీరోయిన్ కృతి శెట్టి (Kriti Shetty). ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోషూట్లతో తన అభిమానులను ఖుషీ చేస్తోంది. తాజాగా తను పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లతో పోటీపడుతోంది ‘ఉప్పెన’ హీరోయిన్ కృతి శెట్టి. తొలిసినిమాతోనే తన సత్తా చాటిందీ కుర్ర భామా. ప్రస్తుతుం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కృతి శెట్టి పేరు హాట్ టాపిక్ గా వినిపిస్తోంది.
హీరోయిన్ కు ఉండాల్సిన అన్ని అర్హతలు కృతి శెట్టికి పరిమితికి మించి ఉందనే చెప్పాలి. గ్లామర్ లోనూ కట్టిపడేస్తోందీ సొట్టబుగ్గల హీరోయిన్. అలాగే నటన పరంగానూ సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తూ వస్తోంది. విభిన్న పాత్రల్లో నటిస్తూ అలరిస్తోంది.
ఉప్పెన హిట్ తో కృతి శెట్టికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఏకంగా స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేంది. అతి తక్కువ కాలంలోనే ఇంత ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. అందుకు తగ్గట్టుగానే సినిమా అవకాశాలను ఎంచుకుంటూ వస్తోంది.
మరోవైపు సోషల్ మీడియాలోన తన క్రేజ్ పెంచేస్తోందీ గ్లామర్ బ్యూటీ. ఇటీవల 3 మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. అదే జోష్ లో నెటిజన్లకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు లేటెస్ట్ ఫొటోషూట్లతో దర్శనమిస్తోంది.
ఇప్పటికే ఈ కుర్రా భామ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతుండగా.. తన అందానికి మరింత మెరుపులు దిద్దుతూ లేటెస్ట్ ఫొటోలతో మెస్మరైజ్ చేస్తోంది. ఈ ఫొటోల్లో కృతి శెట్టి స్కీవ్ లెస్ మినీ డ్రెస్ లో మతిపోగొడుతోంది. అచ్చు బార్బీ బొమ్మ ఫోజులతో మైండ్ బ్లాక్ చేస్తోంది. స్కిన్ షోకు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఫొటోలు షేర్ చేస్తూ అదిరిపోయే క్యాప్షన్ ఇస్తూ.. ‘ధైర్యం ఉంటేనే మన కలలన్నీ సాకారమవుతాయి’ అని అంటోందీ బ్యూటీ. ఇక చివరిగా ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ లో సినిమాలో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం హీరో రామ్ పోతినేని (Ram Pothineni) సరసన The Warrior చిత్రంలో నటిస్తోంది. అలాగే ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజకవర్గం’లోనూ కనిపించనుంది.