49000 పెళ్లిళ్లు చేసుకోవాలి, మీడియాతో కమల్ హాసన్ కామెడీ పంచ్ లు
కమల్ హాసన్ కామెడీ పంచ్ లతో కాసేపు నవ్వించారు. థగ్ లైఫ్ సినిమా పాటల ఆవిష్కరణ కార్యక్రమంలో పెళ్లి గురించి మాట్లాడారు లోక నాయకుడు. ఆయన మాటలకు అంతా ఒక్క సారిగా నవ్వారు. ఇంతకీ అంతలా కమల్ హాసన్ ఏమన్నారు?

కమల్ హాసన్ బహుముఖ ప్రజ్ఞాశాలి. సినిమా కోసం ఆయన ఏం చేయడానికైనా ఆలోచించరు. ఎంత కష్టమైన పని అయినా కమల్ సాధించి తీరుతారు. ఇక తాజాగా ఆయన నటించిన థగ్ లైఫ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకి మణిరత్నం దర్శకత్వం వహించారు. వీళ్లిద్దరూ గతంలో నాయకుడు సినిమాలో కలిసి పనిచేశారు. 38 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ థగ్ లైఫ్ సినిమాతో మళ్ళీ కలుసుకుంది. ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్, రాజ్ కమల్ ఫిలిమ్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించాయి.
Also Read: 20 కేజీలు బరువు తగ్గడానికి ఖుష్బూ ఇంజెక్షన్ తీసుకున్నారా? నెటిజన్ ప్రశ్నకు నటి ఘాటు రిప్లై
కమల్ హాసన్ - మణిరత్నం
థగ్ లైఫ్ సినిమాలో కమల్ హాసన్ తో పాటు శింబు, త్రిష, అశోక్ సెల్వన్, సానియా మల్హోత్రా, జోజు జార్జ్ వంటి స్టార్స్ నటించారు. ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమా జూన్ 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, థగ్ లైఫ్ సినిమాలోని మొదటి పాట 'జింగుచా' ఇటీవల విడుదలైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమల్ హాసన్, మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
Also Read: 40,000 కు ఇంటిని తాకట్టు పెట్టి, ఎన్టీఆర్ తో సినిమా చేసిన స్టార్ కమెడియన్ ఎవరో తెలుసా?
కమల్ హాసన్
ఈ మీడియా మీట్ లో కమల్ హాసన్ రెండు పెళ్లిళ్ల ప్రస్తావణ వచ్చింది. దానికి ఆయన తన పాత ఇంటర్వ్యూని గుర్తుచేసుకుని సమాధానం ఇచ్చారు. ఎం.బి.జాన్ బ్రిటాస్ తనని ఇంటర్వ్యూ చేసినప్పుడు, బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన మీరు రెండు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నారు అని అడిగారట. దానికి కమల్ హాసన్, బ్రాహ్మణ కుటుంబం నుంచి రావడానికి, పెళ్లి చేసుకోవడానికి ఏమైనా సంబంధం ఉందా అని అడిగారట.
Also Read: 40 సినిమాలు ప్లాప్.. 33 రిలీజ్ కాలేదు.. అయినా ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరో ఎవరు?
కమల్ హాసన్ పెళ్లి గురించి
అప్పుడు బ్రిటాస్, మీరు కొలిచే దేవుడు రాముడు కదా, ఆయన్ని అనుసరించరా అని అడిగారట. దానికి కమల్ ఇచ్చిన సమాధానం సూపర్ అనే చెప్పాలి. నేను దేవుళ్ళని కొలవను. అలా చూసుకుంటే నేను రాముడి నాన్నలాంటి వాడిని, ఇంకా 49 వేల పెళ్లిళ్లు చేసుకోవాలి అని అన్నారట. కమల్ హాసన్ సమాధానం వైరల్ అవుతోంది. ఆయన వాణి గణపతి, సారికాలని పెళ్లి చేసుకున్నారు. ఈ రెండు పెళ్లిళ్ళు విడాకులతో ముగిసాయి. హీరోయిన్ గౌతమితో కొన్నాళ్ళు సహజీవనం చేశారు కమల్.
Also Read: 5 సార్లు రీ రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమా ఏదో తెలుసా? మరీ ఇంత తక్కువ కలెక్ట్ చేసిందా?
Also Read: మోహాన్ బాబు కాలర్ పట్టుకుని, గెట్ అవుట్ అన్న సీనియర్ హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?
Also Read: జూనియర్ ఎన్టీఆర్ మామ కి హైడ్రా షాక్, పిల్లాడి లేఖతో నార్నె గుట్టు రట్టు?