- Home
- Entertainment
- 40,000 కు ఇంటిని తాకట్టు పెట్టి, ఎన్టీఆర్ తో సినిమా చేసిన స్టార్ కమెడియన్ ఎవరో తెలుసా?
40,000 కు ఇంటిని తాకట్టు పెట్టి, ఎన్టీఆర్ తో సినిమా చేసిన స్టార్ కమెడియన్ ఎవరో తెలుసా?
ఆకాలంలో కాని.. ఈ కాలంలో కాని నటీనటులు నటనమీద మాత్రమే ఆధారపడలేదు. నిర్మాతలుగా, దర్శకులుగా ప్రతిభ చూపించిన వారు చాలా మంది ఉన్నారు. హీరోలు, హీరోయిన్లు, కమెడియన్లు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. అలాంటి ఓ స్టార్ కమెడియన్ పెద్దాయన ఎన్టీఆర్ తో సినిమా చేసి నిర్మాతగా అడుగు పెట్టాడు. డబ్బులు లేకపోయినా.. తన ఇంటిని 40 వేలకు తాకట్టు పెట్టి మరీ సినిమా చేసిన ఆ స్టార్ కమెడియన్ ఎవరో తెలుసా? మరి ఆసినిమా హిట్ అయ్యిందా లేదా?

నటీనటులు నిర్మాతలుగా మారిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే అందులో అందరూ సక్సెస్ కాలేదు. కొంత మంది డబుల్ సంపాదిస్తే.. మరికొంత మంది నటనలో సంపాదించిన ఆస్తులన్నీ.. నిర్మాతలుగా పొగోట్టుకుని రోడ్డున పడ్డారు. అయితే ఓ స్టార్ కమెడియన్ మాత్రం చాలా పెద్ద సాహసం చేసి.. ఎన్టీఆర్ తో సినిమా చేశాడు. తన ఇంటిని తాకట్టు పెట్టి మరీ ఎన్టీఆర్ తో మూవీ చేశాడు. చెన్నైలో ఉన్న తన ఇంటిని ఆకాలంలోనే 40 వేలకు తాకట్టు పెట్టాడు.
Also Read: మోహాన్ బాబు కాలర్ పట్టుకుని, గెట్ అవుట్ అన్న సీనియర్ హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?
padmanabham
ఇంతకీ ఆ కమెడియన్ ఎవరో కాదు పద్మనాభం, కమెడియన్ గా తెలుగువారి మనసుల్లో చెరగని ముద్ర వేశారు పద్మనాభం. కమేడియన్ గా మంచి పేరు తెచ్చుకొని, ఆర్థికంగా స్థిరపడిన తరువాత రామారావు, సావిత్రలా ప్రోత్సహంతో నిర్మాత అవతారం ఎత్తారు పద్మనాభం.రేఖా & మురళీ ఆర్ట్స్ పతాకం పై 1964 లో దేవత సినిమాతో పద్మనాభం నిర్మాతగా అడుగు పెట్టారు. దేవత కథ పద్మనాభంకు బాగా నచ్చింది. కాని ఆయన బడ్జెట్ ఎక్కువ అవుతుందన్న కారణంతో, ముందుగా ఈ సినిమా తీసే ధైర్యం చేయలేకపోయారు.
Also Read: Bigg Boss: బిగ్ బాస్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్, ఈసారి సీజన్ లేనట్టే, కారణం ఏంటో తెలుసా?
ఆ సమయంలో పద్మనాభం ఆర్టిస్టిట్ గా బిజీగా ఉన్నారు. నిర్మాతగా మారాలంటే నటుడిగా దెబ్బతింటారేమో అని భయపడ్డారు. కాని తిరిగి తిరిగి ఆకథ పద్మనాభం దగ్గరకే వచ్చింది. దాంతో మరోసారి ఆలోచించి.. చివరకు ధైర్యం చేసి ఈ సినిమా తియ్యాలని నిర్ణయించుకున్నారు. ఈ కథకు హీరోగా రామారావు బాగుంటాడని ఆయన ఇంటికి వెళ్ళి చెప్పారు. ఆయన కూడా పద్మనాభం నిర్మాత అవుతున్నాడని తెలిసి సంతోషించి, డేట్స్ ఇచ్చారు. ఆల్ ది బెస్ట్ బ్రదర్.. అన్నీ భుజం కూడా తట్టారు రామారావు, హీరోయన్ గా సావిత్రి కూడా ఒకే అన్నారు. ఇక ఇల్లాలి చూట్టు తిరిగే కథ కావడంతో, ఈసినిమాకు దేవత టైటిల్ ను పద్మనాభం పెట్టుకున్నారు.
padmanabham
దర్శకుడిగా హేమాంబరధరరావు ను తీసుకున్నారు పద్మనాభం. అయితే ఇక్కడే ఓ చిక్కు వచ్చింది. ముందుగా తాను భయపడ్డట్టే.. సినిమా తీయ్యడానికి పద్మనాభం దగ్గర ఉన్న డబ్బులు సరిపోలేదు. దాంతో చెన్నైలో ఉన్న తన ఇంటిని 40 వేల రూపాయలకు తాకట్టు పెట్టి సినిమా నిర్మాణం స్టార్ట్ చేశారు స్టార్ కమెడియన్.
ఈ సినిమా మధ్యలో ఎన్నో ఇబ్బందులు వచ్చినా పట్టుదలతో పూర్తి చేశారు పద్మనాభం. ఇక సినిమా రిలీజ్ అయ్యి.. అనుకున్నదానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది సినిమాకు.
అంతే కాదు ఈసినిమా కొన్ని రికార్డ్స్ ను కూడా బ్రేక్ చేసింది. టాలీవుడ్ లోనే ఎక్కువ మంది స్టార్స్ నటించిన సినిమాగా దేవత రికార్డ్ సాధించింది. ఈసినిమాలో రంగారావు, గుమ్మడి, రేలంగి, కాంతారావు, రమణ రెడ్డి, అంజలీదేవి, సావుకారు జానకి, జమున వంటి స్టార్స్ ఇళ్ళలకూ వెళ్ళి పద్మనాభం ఆటోగ్రాఫ్స్ తీసుకునే సీన్ ఉంటుంది.
ఆ స్టార్స్ అంతా ఆ కాసేపు కనిపించి పద్మనాభంకు సహాయం చేశారు. ఆ పది నిమిషాల సీన్ సినిమాకే హైలెట్ అయ్యింది. 22 మంది స్టార్స్ కనిపించిన ఏకైక తెలుగు సినిమా దేవత కావడం విశేషం. ఇక ఈసినిమాలో ఎన్టీఆర్ తల్లీ తండ్రులుగా నాగయ్య, నిర్మలమ్మ నటించారు. దేవత షూటింగ్ టైమ్ లోనే నాగయ్యకు పద్మశ్రీ అవార్డునే ప్రకటించింది ప్రభుత్వం. దాంతో సెట్ లోనే ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేశారు.
ఇక ఈసినిమాకు హైలెట్ అంటే పాటలు, అందులో ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి పాట ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే కాదా. అంతే కాదు ఈసినిమాలో ఓ పాట కోసం ఎన్టీఆర్ డేట్స్ దొరకలేదు. దాంతో మూడు రోజులు నైట్ షిప్ట్ చేశారట పెద్దాయన. అందరు అంత కష్టపడటంతో.. దానికి ఫిలితం ఘనంగా వచ్చింది.
దేవత మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 50 రోజుల వేడుకను రాజమండ్రిలో నిర్వహించారు. ఇప్పటికీ ఆ సినిమా ఎవర్ గ్రీన్. ఇక పద్మనాభం ఆతరువాత నటుడిగా , నిర్మాతగా కూడాహిట్లు కొట్టారు. బాగా సంపాదించారు కూడా. కాని చివరి రోజుల్లో ఆస్తులన్నీ పోగొట్టుకుని.. 2010 లో పేదరికం అనుభవిస్తూ మరణించారు.