MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • మోహాన్ బాబు కాలర్ పట్టుకుని, గెట్ అవుట్ అన్న సీనియర్ హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?

మోహాన్ బాబు కాలర్ పట్టుకుని, గెట్ అవుట్ అన్న సీనియర్ హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?

ఫిల్మ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలు, గొడవలు, కొట్లాటలు కామన్. స్టార్స్ మధ్య అభిప్రాయభేదాలు వస్తుంటాయి. అయితే అందులో కొన్ని గొడవలు మర్చిపోయి కలిసిపోతుంటారు. మరికొన్ని మాత్రం జీవితాంతం గుర్తు పెట్టుకుని మాట్లాడకుండా ఉన్నవారు కూడా ఉన్నారు. టాలీవుడ్ లో కాంట్రవర్సీ స్టార్ అంటే మోహన్ బాబు పేరు ముందుగా వినిపిస్తుంది. మోహన్ బాబు సరదాగా కొంత మందితో, సీరియస్ గా మిరికొంత మందితో గొడవలుపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. ఈక్రమంలో ఓ సారి చిన్న గొడవ జరిగి, స్టార్ హీరో మోహన్ బాబు కాలర్ పట్టుకుని గెట్ అవుట్ అన్నాడట ఇంతకీ ఎవరా స్టార్ హీరో, ఎందుకు గొడవ జరిగింది.? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 19 2025, 04:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

టాలీవుడ్ లో కాంట్రవర్సీ స్టార్ అంటే వెంటనే మోహన్ బాబు గుర్తుకు వస్తారు. మోహన్ బాబు మాత్రమే కాదు ఆయన ఫ్యామిలీకి కూడా వివాదాలు కొత్త కాదు. ట్రోలర్స్ ఎక్కువగా టార్గెట్ చేసేది కూడా మోహన్ బాబు అండ్ ఫ్యామిలీనే. ఈ కుటుంబంలో మంచు మనోజు తప్పించి మిగతా ముగ్గురు స్టార్స్ పై విపరీతమైన ట్రోల్స్ రావడం అందరికి తెలిసిందే. వారు ఏం మాట్లాడినా.. అందులో పాయింట్స్ తీసుకుని మీమ్స్ చేస్తుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మంచు ఫ్యామిలీ మీమ్స్  విషయంలో కేసులు కూడా పెట్టారు . ఇక రీసెంట్ గా మంచు మనోజ్, విష్ణు మధ్య ఆస్తి గొడవలు, పోలీస్ కేసులు, చూస్తునే ఉన్నాం.  ఇలా మంచు ఫ్యామిలీ అంటే టాలీవుడ్ లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్నారు. మొదటి నుంచి మోహన్ బాబుకి కోపం ఎక్కువ అని టాలీవుడ్ అంత తెలుసు. కొన్ని విషయాలు ముఖం మీదనే చెప్పెయ్యడం, ఆవేశంతో ఊగిపోవడం, చిరంజీవితో గొడవలు ఇలా చెప్పడానికి ఆయన గురించి చాలా ఉన్నాయి. 

35

అయితే మోహన్ బాబు ఓ సారి టాలీవుడ్ లో సౌమ్యుడిగా పేరున్న సీనియర్ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ మురళీ మోహన్ తో కూడా గొడవపడ్డాడని మీకు తెలుసా? మురళీమోహన్, మోహన్ బాబు చాలా క్లోజ్ గా ఉంటారు, బావా.. బావా అని పిలుచుకుంటుంటారు. అయితే ఓ సందర్భంలో మాత్రం మాట మాట పెరిగి కాలర్ పట్టుకునే వరకూ వచ్చిందట. ఓ సారి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ జరపాలని నిర్ణయించుకున్నారట మా టీమ. అప్పుడు మా అధ్యక్షుడిగా మురళీ మోహన్ ఉన్నారు. అప్పటికి మోహన్ బాబు వారసులు విష్ణు, మనోజు ఇండస్ట్రీకి రాలేదు. 
 

45

అయితే ఈ మ్యాచ్ లో విష్ణు, మనోజ్ లు కూడా ఆడాలని మోహన్ బాబు అన్నారట. కాని దానికి మురళీ మోహన్ ఒప్పుకోలేదు. ఇది ఇండస్ట్రీలో ఉన్నవారు ఆడేది. మీఇద్దరు కొడుకులు ఇండస్ట్రీలోకి రాలేదు కదా అని అన్నారట. మోహన్ బాబు వెంటనే కుదరు ఆడాల్సిందే. అవన్నీ నాకు తెలియవు అని సీరియస్ అయ్యారు. సౌమ్యుడిగా పేరున్నమురళీమోహన్ కు కూడా కోపం వచ్చింది. ఇద్దరు  మాట మాట అనుకుని కాలర్ పట్టుకునేవరకూ వెళ్లిందట విషయం. మోహన్ బాబు చొక్క పట్టుకుని గెట్ అవుట్ అన్నారట మురళీ మోహన్.  
 

55

ఈ విషయాన్ని మురళీ మోహన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆతరువాత కొన్ని రోజులకు దాసరి నారాయణ రావు కూతురు పెళ్ళికి వెళ్ళి వస్తూ..ప్లైట్ లో ఇద్దరి మధ్య మాలలు కలిశాయని ఆయన అన్నారు. మోహన్ బాబు నా దగ్గరకు వచ్చి సారి బావ.. అని చేయి పట్టుకుని అడిగారు. నేను కూడా సారి చెప్పి.. ఇవ్ననీ మామూలే అని నవ్వుకుంటూ మాట్లాడాము అని మురళీ మోహన్ అన్నారు. మోహన్ బాబు కోపిష్టి అని అంతా అంటారు కాని.. మనసు మాత్రం చాలా మంచిది అన్నారు మురళీమోహన్.  

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మంచు మోహన్ బాబు
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan Net Worth: మెగా హీరో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆస్తి ఎంతో తెలుసా? పవర్ స్టార్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Recommended image2
Jabardasth: సుధీర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.. బోరున ఏడ్చిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ లో ఎమోషనల్ సీన్..
Recommended image3
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved