MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • జూనియర్ ఎన్టీఆర్ మామ కి హైడ్రా షాక్, పిల్లాడి లేఖతో నార్నె గుట్టు రట్టు?

జూనియర్ ఎన్టీఆర్ మామ కి హైడ్రా షాక్, పిల్లాడి లేఖతో నార్నె గుట్టు రట్టు?

టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మామకు హైడ్రా షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లో ఆక్రమిత భూముల విషయంలో కొరడా జుళిపిస్తున్న హైడ్రాకు.. ఓ బాలుడు రాసిన లేఖతో డొంక అంతా కదిలింది. ప్రభుత్వ భూములను అమ్ముతున్నారన్న విషయం బయటకు వచ్చింది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 20 2025, 10:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఆక్రమిత చెరువులు, ప్రభుత్వ భూముల విషయంలో హైడ్రా చేస్తున్న ఆపరేషన్లు అందరికి తెలుసు. ఈ విషయంలో ఎంత పెద్దవారు ఉన్నా హైడ్రా వదిలిపెట్టడంలేదు. ఇక తాజాగా హైడ్రా వలలో పెద్ద చేప పడింది. ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మామ, వ్యాపారవేత్త అయిన నార్నె శ్రీనివాస్ ఆధీనంలో ఉన్న భూమిపై హైడ్రా ఆపరేషన్ నిర్వహించింది.  

హైదరాబాద్  లాంగర్ హౌజ్ కు చెందిన  ఒక బాలుడు చేసిన కంప్లైట్ ఓ పెద్ద డొంక కదిలేలా చేసింది. భారీగా ప్రభుత్వ ఆస్తులు కబ్జాకు గురి కాకుండా చేసింది. ఆ బాలుడు రాసిన లేఖ వల్ల జూబ్లీహిల్స్ లాంటి కాస్ట్లీ ప్లేస్ లో  39 ఎకరాల ప్రధాన ప్రభుత్వ భూమిని తిరిగి పొందేందుకు కారణం అయింది. దీని విలువ రూ.3,900 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

Also Read: 40 సినిమాలు ప్లాప్.. 33 రిలీజ్ కాలేదు.. అయినా ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరో ఎవరు?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

అసలు విషయం ఏంటంటే.. హైడ్రాకు ఓ చిన్న బాబు  లేఖరాశాడు. ఆ బాబు JRC కన్వెన్షన్ సెంటర్ సమీపంలోని బహిరంగ స్థలంలో క్రికెట్ ఆడుతూ ఉంటాడు. అయితే సడెన్ గా ఆ గ్రౌండ్ కు కంచెలు వేసేశారు. ఆ ప్లేస్ లో ఏవో కన్ స్ట్రక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. దాంతో ఆ బాబుకు హైడ్రా విషయంలో ఐడియా ఉండటంతో.. ఈ నిర్మాణాలపై కమిషనర్ ఎ.వి. రంగనాథ్ కు లెటర్ రాశాడు.

వెంటనే హైడ్రా టీమ్ ఆ భూమి రికార్డులను పరిశీలించారు. ఆ భూమి రాష్ట్ర ప్రభుత్వానికి చెందినదని, ప్రస్తుతం చట్టపరమైన వివాదంలో ఉందని గుర్తించారు. HYDRAA ఆ స్థలాన్ని పరిశీలించి, భూమిని అమ్మడానికి, అభివృద్ధి చేయడానికి  ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుసుకుని.. ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలు  కూల్చివేసింది.

Also Read: 40,000 కు ఇంటిని తాకట్టు పెట్టి, ఎన్టీఆర్ తో సినిమా చేసిన స్టార్ కమెడియన్ ఎవరో తెలుసా?

34

నిషేధ జాబితాలో ఉన్న భూమిని నార్నే ఎస్టేట్స్ నిశ్శబ్దంగా అమ్మేస్తోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. చట్టపరమైన వివాదం సమయంలో ఏదైనా అభివృద్ధి లేదా అమ్మకం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్లోని అత్యంత ఖరీదైన జోన్లలో ఎకరానికి రూ. 100 కోట్లకు పైగా మార్కెట్ రేటు ఉంటుంది. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సంబంధించి వివిధ కోర్టులలో కేసులున్నప్పటికీ చుట్టూ ప్రహరీ నిర్మించి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. అలాగే  39 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్టు ఆయన తెలిపారు. 

Also Read: 5 సార్లు రీ రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమా ఏదో తెలుసా? మరీ ఇంత తక్కువ కలెక్ట్ చేసిందా?

44

ల్యాండ్ గ్రాబింగ్ కేసున్నట్టు అక్కడ బోర్డులుంటుండగానే.. మరోవైపు అక్కడ ప్లాట్ల కొనుగోలుకు సంప్రదించాల్సిన ఫోను నంబర్లతో బోర్డులు ఏర్పాటు చేసింది నార్నే ఎస్టేట్స్ సంస్థ. అనుమతిలేని లే ఔట్తో రహదారులు నిర్మిస్తూ.. ప్లాట్లు అమ్మకాలు చేపట్టినట్లు తెలుస్తోంది.  

హాఫీజ్ పేట్, రాయదుర్గం ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించి ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ బోర్డు లు పెట్టారు హైడ్రా అధికారులు. ఆక్రమించుకున్న వారిపై కేసులు కూడా నమోదు చేశారు. నార్నె ఎస్టేట్స్ కు యజమాని నార్నే శ్రీనివాసరావు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ సతీమణి ప్రణతీ తండ్రి. ఆయనకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థనే భూముల్ని కబ్జా చేసినట్లుగా హైడ్రా చెబుతోంది.

రాయదుర్గం ఏరియాలో నార్నే పేరుతో ఓ రోడ్ ఉంటుంది. ఆ ఏరియాలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేశారు. అయితే ఇప్పుడు ఆ భూములు కబ్జాలని హైడ్రా చెబుతోంది. ఈ కూల్చివేతలపై నార్నే గ్రూపు నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు.

Also Read: మోహాన్ బాబు కాలర్ పట్టుకుని, గెట్ అవుట్ అన్న సీనియర్ హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
చిరంజీవిని పేరు పెట్టి పిలిచే ఏకైక కమెడియన్, పవన్ కళ్యాణ్ 'అన్నయ్య' అని పిలుచుకునే నటుడు ఎవరో తెలుసా?
Recommended image2
Irumudi Day 7 Collections: టాక్సిక్‌ సునామీ ముందు గట్టిగా నిలబడ్డ రవితేజ.. ఇరుముడికి ఊహించని వసూళ్లు
Recommended image3
Rajasekhar: టాలీవుడ్ ని షేక్ చేసిన మూవీ, ఓవర్ యాక్షన్ అంటూ స్టార్ హీరో పరువు తీసిన కూతుళ్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved