వెండితెరపై వీరుల పోరు... బెస్ట్ అప్ కమింగ్ దేశభక్తి చిత్రాలు!
సినిమా అనేది గొప్ప మాధ్యమం. అందుకే తెర మరుగున పడిన దేశభక్తులు జీవితాలు వెండితెర మీద ఆవిష్కరిస్తూ జనాలకు మహోన్నత వ్యక్తుల గురించి తెలిసేలా చేస్తున్నారు.
Independence Day
ఇప్పటికే అనేక మంది ఉద్యమ వీరులు, స్వాతంత్య్ర సమరయోధుల జీవితాలను సినిమాల రూపంలో చెప్పడమైంది. త్వరలో మరికొన్ని దేశభక్తుల బయోపిక్స్ సినిమాలుగా రానున్నాయి. అవేమిటో చూద్దాం...
Independence Day
మైదాన్
సయ్యద్ అబ్దుల్ రహీం భారత ఫుట్ బాల్ చరిత్రలో మేటి కోచ్. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం మైదాన్. అజయ్ దేవ్ గణ్ ఫుట్ బాల్ కోచ్ గా నటిస్తున్నారు. దర్శకుడు అమిత్ శర్మ తెరకెక్కిస్తుండగా ప్రియమణి హీరోయిన్. త్వరలో మైదాన్ థియేటర్స్ లో సందడి చేయనుంది.
Independence Day
యోధ
సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ యోధ. దిశా పటానీ, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. డైరెక్టర్స్ డుయో సాగర్ ఆంబ్రే- పుష్కర్ ఓఝాలు తెరకెక్కిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా భారత సైనికుడి సాహసాల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. యోధ డిసెంబర్ 15న విడుదల కానుంది.
Independence Day
పిప్పా
ఇషాన్ ఖట్టర్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పిప్పా . దర్శకుడు రాజా కృష్ణమీనన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 1971 భారత్-పాకిస్థాన్ యుద్ధంలో పోరాట పటిమ చూపించిన బ్రిగేడియర్ బల్‌రామ్ సింగ్ మెహతా జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదల కానుంది.
Independence Day
శ్యామ్ బహదూర్
శత్రుదేశం పాకిస్తాన్ అంటే ప్రతి భారతీయుడు రక్తం మరిగిపోతుంది. పాకిస్తాన్ తో భారత్ కి ఎప్పుడూ వైరమే. ఈ క్రమంలో యుద్ధాలు సంభవించాయి. వాటిలో 1971లో జరిగిన యుద్ధం కీలకమైంది. ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించగా త్రివిధ దళాల అధిపతి శ్యామ్ బహదూర్ మానెక్‌షా కీలక పాత్ర వహిచారు. . ఆయన జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం శ్యామ్ బహదూర్. విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్నారు. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించగా డిసెంబర్ 1న విడుదల కానుంది.
Independence Day
ఏ వతన్ మేరే వతన్
దర్శకుడు కన్నన్ అయ్యర్ పేట్రియాటిక్ మూవీ ఏ వతన్ మేరే వతన్. సారా అలీఖాన్ లీడ్క్వి రోల్ట్ చేస్తుండగా ఇండియా ఉద్యమం సమయంలో జరిగిన ఓ యువతి కథే ఈ చిత్రం. కరణ్ జోహార్, అపూర్వ మెహతాలు నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 30న విడుదలవుతోంది.