చింత చిగురు తింటే ఇన్ని ప్రయోజనాలా?
చింత చిగురును తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం…
చింతపండు తెలియనివాళ్లు ఎవరూ ఉండరు. మనలో చాలా మంది రెగ్యులర్ గా చేసే చాలా వంటల్లో చింతపండు వాడుతూ ఉంటారు. కానీ.. చింత చిగురు ఎప్పుడైనా తిన్నారా? చింత చిగురుతో కూడా చాలా రకాల వంటలు చేయవచ్చు. మరి.. ఈ చింత చిగురును తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం…
1.మలేరియా నుంచి ఉపశమనం…
ఈ సీజన్ లో డెంగ్యూ, మలేరియాలు చాలా కామన్ గా వచ్చేస్తూ ఉంటాయి. అయితే.. ఆ మలేరియాను చింతిగురుతో తగ్గించవచ్చట.
2.మధుమేహాన్ని నియంత్రించవచ్చు…
చింత చిగురులో యాంటీ డయామెటిక్ చర్యని కలిగి ఉంటుందట. రెగ్యులర్ గా చింత చిగురు తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ ని నియంత్రిస్తుంది. కామెర్లు నయం చేయడంలోనూ ఇవి సహాయపడతాయట.
4. గాయాలను నయం చేస్తుంది
చింతపండు ఆకులు యాంటిసెప్టిసి లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి గాయాలను తగ్గించడంలో సహాయం చేస్తాయి. ఈ ఆకుల రసాన్ని గాయాలపై రాయడం వల్ల ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. గాయాలు కూడా మానిపోతాయి.
5.తల్లిపాలు పెరుగుతాయి..
డెలివరీ తర్వాత పాలు రావాలంటే… మహిళలు.. ఈ చింత చిగురు తిన్నా..దాని ఆకుల రసం తాగినా.. వారిలో పాలు తొందరగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందట. పీరియడ్స్ లో మహిళలు పీరియడ్ క్రాంప్స్ తగ్గించడంలోనూ సహాయం చేస్తాయి.
నోటి ఆరోగ్యం..
నోటి పరిశుభ్రత చాలా ముఖ్యం. నోటి సమస్యలతో వ్యవహరించే ప్రధాన ఫిర్యాదులలో ఒకటి నోటి దుర్వాసన. పంటి నొప్పి కూడా చార్టులో అగ్రస్థానంలో ఉంది. చింతపండు ఆకులను రెండు సమస్యలకు సరైన చికిత్సగా ఉపయోగించవచ్చు.
చింతచిగురులో డైటరీ ఫైబర్ (Dietary fiber) పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా విరేచనం సాఫీగా జరిగేలా చేసి జీర్ణాశయ సమస్యలను తగ్గించడంతో పాటు మలబద్ధకం (Constipation) వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. అలాగే ఫైల్స్ ఉన్నవారికి చింతచిగురు మంచి ఫలితాలను ఇస్తుంది.
అలాగే ఇది నోటి పగుళ్లు, పూతలను కూడా తగ్గిస్తుంది. చింతచిగురును తీసుకుంటే కంటి సమస్యలు (Eye problems) కూడా తగ్గుతాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు వణుకుతూ వచ్చే జ్వరాన్ని కూడా తగ్గిస్తాయి. అలాగే థైరాయిడ్ (Thyroid) సమస్యలతో బాధపడుతున్న వారు చింతచిగురుతో చేసిన ఆహార పదార్థాలను తరచూ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
కడుపులో నులిపురుగులతో (Worms) బాధపడే పిల్లలకు చింతచిగురుతో చేసిన ఆహార పదార్థాలను ఇస్తే మంచి. చింత చిగురు ఉదర భాగాన్ని ఆరోగ్యంగా (Abdominal Health) ఉంచి ఉదర సంబంధిత సమస్యలను కూడ తగ్గిస్తుంది. కనుక వేసవిలో అందుబాటులో ఉండే చింతచిగురును తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.