రష్మికకు ఘాటు ముద్దు పెట్టిన అభిమాని, స్టార్ హీరోయిన్ ఏం చేసిందంటే..?
నార్త్ సౌత్ అన్న తేడా లేకుండా దూసుకుపోతోంది హీరోయిన్ రష్మిక మందన్నా. స్టార్ హీరోయిన్ స్టేటస్ తో వెలిగిపోతున్న కన్నడ బ్యూటీకి ఈమధ్య విచిత్ర అనుభవం ఎదురయ్యింది.
Rashmika Mandanna
ఇటు టాలీవుడ్ లో.. అటు బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది కన్నడ కస్తూరి రష్మిక మందన్న. స్టార్ హీరోల సరసన నటిస్తూ.. స్టార్ ఇమేజ్ ను సాధిస్తోంది బ్యూటీ. ప్రస్తుతం హైదరాబాద్ టు ముంబయ్ కు షిఫ్ట్ ల లెక్కన పనిచేస్తూ.. కష్టపడుతోంది. టాలీవుడ్ లో బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ. హడావిడి చేస్తోంది.
ప్రస్తతం బాలీవుడ్ లో రణ్ బీర్ కపూర్ జోడీగా యానిమల్ సినిమాలో నటిస్తోంది బ్యూటీ. రీసెంట్ గా ఈసినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. అంతే కాదు ఈమూవీలో రణ్ బీర్ తో ఘాటు రొమాన్స్ తో రెచ్చిపోయింది చిన్నది.
ఇక టాలీవుడ్ లో రష్మిక మందన్న అల్లు అర్జున్ జోడీగా నటిస్తోంది. పుష్ప సినిమాతో నేషనల్ ఇమేజ్ సాధించిన ఈబ్యూటీ.. పుష్ప సీక్వెల్ సినిమాలో కూడా సందడి చేస్తోంది. ఇటు ఈ షూటింగ్ తో పాటు.. అటు బాలీవుడ్ సినిమాల షూటింగ్స్ కూడా చేసుకుంటూ బిజీ అయిపోయింది.
ఇక రష్మిక కు తాజాగా ఊహించని సంఘటన ఎదురయ్యింది. ఎప్పుడూ బిజీగా ఉండే ఈబ్యూటీ అప్పుడప్పుడు బయటకు కూడా వెళ్తుంది.. రిలాక్స్ అవుతుంది. తాజాగా ఎయిర్ పోర్ట్ లో రష్మికకు ఒక చిన్నారి అభిమాని ముద్దు పెట్టింది. ఈ ఘటనకు రష్మిక మొదట షాకైనా ఆ తర్వాత అభిమాని చూపించిన ప్రేమకు ఫిదా అయ్యింది..
రష్మిక బుగ్గలను గిల్లిన ఆ చిన్నారి ఆ తర్వాత రష్మికకు ముద్దు పెట్టారు. ఈపరిణామంతో రష్మిక కళ్లు మూసుకుని సిగ్గుపడింది. ప్రస్తుతం ఈ పోటోలు వైరల్ అయ్యాయి. నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. రష్మిక ఇలా పాప ముద్దునురిసీవ్ చేసుకోవడంతో.. అంతా ఆశ్చర్యపోయారు. రష్మిక గ్రేట్ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
రష్మిక సోషల్ మీడియాలో సైతం మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. రష్మిక రెమ్యునరేషన్ 5 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని సమాచారం అందుతోంది. రష్మిక తెలుగులోని మరి కొందరు స్టార్ హీరోలకు సైతం జోడీగా నటిస్తే బాగుంటుందని నెటిజన్లు ఫీలవుతున్నారు.