MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కృష్ణ పేరు చెప్పగానే చిరాకు పడ్డ చిరంజీవి హీరోయిన్.. వేదికపైనే కంటతడి..

కృష్ణ పేరు చెప్పగానే చిరాకు పడ్డ చిరంజీవి హీరోయిన్.. వేదికపైనే కంటతడి..

80, 90 దశకంలో మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ రాధ పెయిర్ కి సూపర్ క్రేజ్ ఉండేది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆల్మోస్ట్ అన్ని చిత్రాలు హిట్స్ గా నిలిచాయి. చిరంజీవి, రాధ డ్యాన్సులకు ఇప్పటికీ అభిమానులు ఉన్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 21 2024, 04:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

80, 90 దశకంలో మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ రాధ పెయిర్ కి సూపర్ క్రేజ్ ఉండేది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆల్మోస్ట్ అన్ని చిత్రాలు హిట్స్ గా నిలిచాయి. చిరంజీవి, రాధ డ్యాన్సులకు ఇప్పటికీ అభిమానులు ఉన్నారు. అంతలా ఈ జోడి అలరించింది. చిరంజీవి లక్కీ హీరోయిన్స్ లో ముందుగా చెప్పే పేరు రాధనే. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

అదే విధంగా రాధ సూపర్ స్టార్ కృష్ణ, బాలకృష్ణ లతో కూడా నటించింది. రాధ కుమార్తె కార్తీక హీరోయిన్ గా పరిచయమై కొన్ని చిత్రాల్లో నటించింది. అయితే కార్తీక ఎక్కువకాలం హీరోయిన్ గా నిలబడలేకపోయింది. ఇటీవల కార్తీక తన ప్రియుడితో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

37

ఇదిలా ఉండగా రాధ తాజాగా అలీతో సరదాగా షోలో పాల్గొంది. కమెడియన్ అలీ హోస్ట్ గా చేస్తున్న ఈ షోకి మంచి క్రేజ్ ఉంది. తాజాగా విడుదలైన ప్రోమో వైరల్ అవుతోంది. ప్రోమో చూస్తుంటే అలీ.. రాధ నుంచి అనేక విషయాలు రాబట్టినట్లు ఉన్నాడు. రాధ కూడా మంచి జోష్ లో కనిపిస్తూ తనదైన శైలిలో నవ్వించింది. 

47

మీలో కూడా ఒక దొంగ ఉన్నాడట కదా అని అలీ అడిగితే రాధ సిగ్గు పడిపోయింది. ఇంటర్వ్యూ ముందు మీరైనా సిబిఐలో పనిచేశారు అని రాధా అలీని అడిగింది. ఆ తర్వాత బాలయ్య ఫోటోని ప్రదర్శించారు. రాధా స్పందిస్తూ.. సూపర్ మాన్, స్పైడర్ మ్యాన్ అన్ని బాలయ్యే అంటూ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది. 

57

అలీ రాధా భర్త గురించి కామెంట్స్ చేశాడు. ఆయన మీకు మొగుడా లేక మీరు ఆయనకి మొగుడా అని అడిగాడు. అదంతా ఇప్పుడు ఎందుకు లేండి అంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చింది. అనంతరం అలీ చిరంజీవితో కాంబినేషన్ గురించి ప్రశ్నించారు. చిరంజీవి చాలా వేగంగా డ్యాన్స్ చేసేవారు. ఆయనతో డ్యాన్స్ చేయాలంటే నేను కూడా స్పీడ్ పెంచాల్సిందే అని అనుకుందట. 

67

చిరంజీవితో డ్యాన్స్ చేసి చేసి ఆ స్పీడ్ వచ్చేసినట్లు చెప్పుకొచ్చింది. ఆ తర్వాత అలీ ఒక సీరియస్ క్వశ్చన్ అంటూ సూపర్ స్టార్ కృష్ణ పేరు చెప్పారు.. ఆయన పేరు వినగానే రాధ చిరాకు పడ్డట్లు హావభావాలు చూపించింది.. నాకు కృష్ణ గారు అంటే.. అంటూ ఏదో గొడవ జరిగినట్లు విసుక్కుంది. నేను చిరంజీవి గారి లాగే డ్యాన్స్ చేస్తాను. కానీ కృష్ణ గారితో షూటింగ్ కి వెళితే అంటూ ప్రోమో కట్ చేశారు. అక్కడ ఏదో గొడవ జరిగినట్లు రాధా రియాక్షన్ చూపించారు. ఒకసినిమాలో నటించి చాలా భాదపడ్డట్లు రాధా అంగీకరించింది. 

77
Karthika Nair

Karthika Nair

ఇక చివర్లో రాధ కంటతడి పెట్టుకుంది. ఒక తల్లి తన కుమార్తెకి పెళ్లి చేసి అత్తగారింటికి పంపే సమయంలో ఎంత బాధని అనుభవిస్తుందో అని అలీ చెబుతుండగా.. రాధ కన్నీళ్లు పెట్టుకుంది. తన కుమర్తె కార్తీక పెళ్లి విజువల్స్ చూస్తూ ఎమోషనల్ అయింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: బాలయ్య జాతకంలో అతి పెద్ద గండం, ఆదివారం ఆయన అస్సలు చేయకూడని పని ఏదో తెలుసా?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: దీపను దారుణంగా అవమానించిన జ్యో- దీప, CEO పోటీ నుంచి తప్పుకుంటుందా?
Recommended image3
Jr NTR House: జూనియర్ ఎన్టీఆర్ ఇంద్రభవనం గురించి తెలుసా.. 25 కోట్లతో డ్రీమ్ హౌస్ నిర్మించుకున్న యంగ్ టైగర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved