- Home
- Entertainment
- KGF2: ఎన్టీఆర్ తల్లితో హీరో యష్ కి ఉన్న అనుబంధం తెలుసా, షాకింగ్ డీటెయిల్స్.. తారక్ ఇంట్లో డిన్నర్..
KGF2: ఎన్టీఆర్ తల్లితో హీరో యష్ కి ఉన్న అనుబంధం తెలుసా, షాకింగ్ డీటెయిల్స్.. తారక్ ఇంట్లో డిన్నర్..
కేజిఎఫ్ 2 ప్రమోషన్స్ కోసం హీరో యష్ ఇండియా మొత్తం తిరుగుతున్నాడు. మంగళ వారం రోజు హీరో యష్ హైదరాబాద్ లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

KGF2
కేజీఎఫ్ మొదటి భాగంతో హీరో యష్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఇప్పుడు కేజీఎఫ్ 2 రాబోతోంది. ఏప్రిల్ 14న ఈ చిత్రం విడుదల కానుండగా అన్నీ కార్యక్రమాలు పూర్తి అవుతున్నాయి. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, రవీనా టాండన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు.
KGF2
కేజిఎఫ్ 2 ప్రమోషన్స్ కోసం హీరో యష్ ఇండియా మొత్తం తిరుగుతున్నాడు. మంగళ వారం రోజు హీరో యష్ హైదరాబాద్ లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మీడియా నుంచి యష్ కి అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇటీవల విడుదలై రికార్డులు నెలకొల్పిన ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి కూడా యష్ ని ప్రశ్నించారు.
KGF2
ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడుతూ.. ఎన్టీఆర్, రాంచరణ్ ఇద్దరితో తనకున్న అనుబంధాన్ని యష్ షేర్ చేశాడు. హైదరాబాద్ కి షూటింగ్స్ కి వచ్చినప్పుడు రాంచరణ్ తనకు ఇంటి నుంచి భోజనం పంపుతుంటారు అని తెలిపాడు. ఇక ఎన్టీఆర్ ఇంట్లో స్వయంగా తారక్ తల్లి చేతి వంట తిన్నట్లు యష్ గుర్తు చేసుకున్నారు.
KGF2
ఒకసారి ఎన్టీఆర్ స్వయంగా తనని ఇంటికి డిన్నర్ కి ఆహ్వానించాడు. ఆ సమయంలో ఎన్టీఆర్ తల్లి తనకు భోజనం వడ్డించినట్లు యష్ తెలిపాడు. ఎన్టీఆర్ తల్లి కూడా కన్నడ మహిళనే. కాబట్టి ఆమె నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నట్లు యష్ మీడియాకు వివరించాడు. ఇలా ఎన్టీఆర్ ఫ్యామిలీతో యష్ కి ప్రత్యేక అనుబంధం ఉంది.
KGF2
ఎన్టీఆర్ తల్లి షాలిని సొంత ఊరు కర్ణాటకలోని కుందపురా. ఇది ఉడిపి జిల్లాలో ఉంది. ఎన్టీఆర్ కూడా అప్పుడప్పుడూ ఆ ఊరికి వెళ్లి వస్తుంటాడు. ఎన్టీఆర్ మల్టిపుల్ లాంగ్వేజస్ లో బాగా మాట్లాడగలడు. గమనించినట్లయితే కన్నడపై ఎన్టీఆర్ కి ఇంకా బాగా గ్రిప్ ఉంది. ఆర్ఆర్ఆర్ ప్రచార కార్యక్రమాల్లో ఎన్టీఆర్ కన్నడ అద్భుతంగా మాట్లాడడం చూశాం. అవార్డుల ఫంక్షన్స్ లో కూడా ఎన్టీఆర్ కన్నడ మాట్లాడుతూ ఉంటాడు. పునీత్ రాజ్ కుమార్ కోసం ఎన్టీఆర్ కన్నడలో సాంగ్ కూడా పాడిన సంగతి తెలిసిందే.
KGF2
ఇటీవల కెజిఎఫ్ 2 ప్రమోషన్స్ లో యష్.. రాజమౌళితో సినిమా గురించి కూడా కామెంట్స్ చేశారు. రాజమౌళి సర్ కి ఒక విజన్ ఉంటుంది. ఆయన కథకి నేను సరిపోతానని భావిస్తే.. సినిమా చేయడానికి రెడీగా ఉన్నాను అని యష్ తన మనసులో మాట బయట పెట్టాడు.
KGF2
ప్రస్తుతం అందరి దృష్టి కేజిఎఫ్ 2 పైనే ఉంది. ఈ చిత్రం బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ రికార్డులని అధికమిస్తుంది అంటూ అంచనాలు కూడా ఉన్నాయి. మరి కేజిఎఫ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.