ధనుష్ ఇడ్లీ కడై సెట్టులో అగ్ని ప్రమాదం, మంటలు చెలరేగడంతో భారీ నష్టం
ధనుష్ దర్శకత్వం వహించి నటిస్తున్న 'ఇడ్లీ కడ' సినిమా షూటింగ్ సెట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆండిపట్టి సమీపంలో ఏర్పాటు చేసిన సెట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

ప్రముఖ నటుడు ధనుష్ రీసెంట్ గా 'రాయన్' అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత 'నిలవుక్కు ఎన్ మేలే ఎన్నడి కోపం' అనే సినిమాకి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం డాన్ పిక్చర్స్ నిర్మాణంలో ధనుష్ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్నారు.
ఈ సినిమాకి 'ఇడ్లీ కడ' అని టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. సత్యరాజ్, రాజ్‌కిరణ్, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దక్షిణ జిల్లాలలోని పలు ప్రాంతాలలో జరుగుతోంది.
Also Read: 20 కేజీలు బరువు తగ్గడానికి ఖుష్బూ ఇంజెక్షన్ తీసుకున్నారా? నెటిజన్ ప్రశ్నకు నటి ఘాటు రిప్లై
ఇడ్లీ కడ
వడివడిగా షూటింగ్
ఇక ఈ సినిమా షూటింగ్ తమిళనాడు థేని జిల్లా ఆండిపట్టి సమీపంలోని అనుప్పపట్టి గ్రామంలో షూటింగ్ జరుగుతోంది. అనుప్పపట్టి గ్రామంలో ఒక వీధిలాంటి సెట్‌లో దుకాణాలు, ఇళ్ళు నిర్మించారు. ఇక్కడే ధనుష్ నటించిన సన్నివేశాలను చిత్రీకరించారు.
గత 20 రోజులుగా జరుగుతున్న షూటింగ్ నుంచి కొన్ని రోజుల క్రితం వేరే ప్రాంతానికి షూటింగ్ మార్చారు. మళ్ళీ అనుప్పపట్టి గ్రామంలో షూటింగ్ నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించింది. అందుకే సెట్‌ను అలాగే ఉంచారు.
Also Read:మగవారికి పీరియడ్స్ వస్తే అణుయుద్ధం తప్పదు, జాన్వీ కపూర్ కామెంట్స్
ఇడ్లీ కడ ధనుష్ నిత్యామీనన్
ఈ నేపథ్యంలో అనుప్పపట్టి గ్రామంలో ఏర్పాటు చేసిన సెట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇడ్లీ కడ సినిమా కోసం చెక్క, ప్లైవుడ్‌తో నిర్మించిన సెట్‌లో మంటలు వేగంగా వ్యాపించాయి. గాలి వేగంగా వీస్తుండటంతో మంటలు ప్రజ్వరిల్లాయి.
ఈ ప్రమాదం గురించి స్థానికులు ఆండిపట్టి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.
Also Read: 40 సినిమాలు ప్లాప్.. 33 రిలీజ్ కాలేదు.. అయినా ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరో ఎవరు?
ఇడ్లీ కడ సెట్ మంటలు
పూర్తిగా కాలిపోయిన సెట్
గంటకు పైగా శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఆండిపట్టి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షూటింగ్ జరగని సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాని ఆర్ధికంగా పెద్ద నష్టమే జరిగినట్టు తెలుస్తోంది.
Also Read: మోహాన్ బాబు కాలర్ పట్టుకుని, గెట్ అవుట్ అన్న సీనియర్ హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?
Also Read: 5 సార్లు రీ రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమా ఏదో తెలుసా? మరీ ఇంత తక్కువ కలెక్ట్ చేసిందా?
Also Read: 40,000 కు ఇంటిని తాకట్టు పెట్టి, ఎన్టీఆర్ తో సినిమా చేసిన స్టార్ కమెడియన్ ఎవరో తెలుసా?