MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Krishnam Raju Favorite Hero: కృష్ణంరాజుకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? ఆయన సినిమా వస్తుందంటే టీవీకి అతుక్కుపోతాడు

Krishnam Raju Favorite Hero: కృష్ణంరాజుకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? ఆయన సినిమా వస్తుందంటే టీవీకి అతుక్కుపోతాడు

Krishnam Raju Favorite Hero: రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజుకి లక్షలమంది అభిమానులు ఉన్నారు. మరి ఆయన ఇష్టపడే నటుడు ఎవరో తెలుసా? ఆయన సినిమా వస్తుందంటే టీవీ నుంచి కదలరట. ఆ కథేంటో చూస్తే 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 16 2026, 04:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
యాక్షన్‌ సినిమాలతో రెబల్‌ స్టార్‌గా ఎదిగిన కృష్ణంరాజు
Image Credit : Asianet News

యాక్షన్‌ సినిమాలతో రెబల్‌ స్టార్‌గా ఎదిగిన కృష్ణంరాజు

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు టాలీవుడ్‌లో తనకంటూ ఒక గుర్తింపుని, ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల తర్వాత ఆ స్థాయిలో దిగ్గజ నటుడిగా ఎదిగారు. మర్యాదల విషయంలో తనకు తానే సాటి. అది సినిమా సెట్‌ అయినా, ఇళ్లు అయినా టాలీవుడ్‌ లో ఆయనది గొప్ప మనసు. యాక్షన్‌ సినిమాలతో హీరోగా రాణించారు. రెబల్‌ పాత్రల్లో కనిపించి రెబల్‌ స్టార్‌ అనే గుర్తింపు తెచ్చుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కృష్ణంరాజుకి ఇష్టమైన హీరో
Image Credit : our own

కృష్ణంరాజుకి ఇష్టమైన హీరో

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు ఎంతో మందికి ఆయన స్ఫూర్తి. ఆయన్ని చూసి సినిమాల్లోకి వచ్చిన వాళ్లు చాలా మందే ఉన్నారు. మరి ఆయనకు ఇష్టమైన హీరో ఎవరు? ఆయన్న ఎవరిని ఎవరుగా ఆరాధిస్తారు అనేది చూస్తే, ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. రెబల్‌ స్టార్‌ స్వయంగా తనకు ఇష్టమైన నటుడు ఎవరో వెల్లడించారు. ఆయన సినిమాలు టీవీలో వస్తున్నాయంటే ఎంత అర్జెంట్‌ పని ఉన్నా, అలానే టీవీకి అతుక్కుపోతారు. సినిమా చూశాకే కదులుతారు. అంతగా ఇష్టపడతారు. కాకపోతే ఆ హీరో మన తెలుగు హీరో కాకపోవడం గమనార్హం.

34
దిలీప్‌ కుమార్‌.. కృష్ణంరాజుకి ఇష్టమైన హీరో
Image Credit : our own

దిలీప్‌ కుమార్‌.. కృష్ణంరాజుకి ఇష్టమైన హీరో

కృష్ణంరాజు అంతగా ఇష్టపడే నటుడు దిలీప్‌ కుమార్‌. ఆయనంటే ఎంతో ఇష్టం. టీవీలో ఆయన సినిమా వస్తుందంటే ఆగిపోయి సినిమా చూస్తానని తెలిపారు రెబల్‌ స్టార్‌. అంతేకాదు ఆయన్ని ఏకంగా తన సినిమాలో తీసుకున్నారు. కృష్ణంరాజు నటించిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల్లో `బొబ్బిలి బ్రహ్మన్న` ఒకటి. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయాలనుకున్నారు. అందరు ధర్మేంద్రతో చేయాలనుకున్నారు.

44
దిలీప్‌ కుమార్‌తో `బొబ్బిలి బ్రహ్మన్న` రీమేక్‌
Image Credit : Rotten Tomatoes

దిలీప్‌ కుమార్‌తో `బొబ్బిలి బ్రహ్మన్న` రీమేక్‌

కానీ కృష్ణంరాజుకి మాత్రం దిలీప్‌ తో చేయాలనుకున్నారు. ఆయనకు సినిమా చూపించారు. పాత్ర, నటన నచ్చి ఆయన చేయడానికి ఓకే చెప్పారు. ఇంకా చెప్పాలంటే కృష్ణంరాజు ఒప్పించారు. సినిమా బాగా వచ్చింది. దిలీప్‌ కుమార్‌ ఇరగదీశారు. `ధర్మ అధికారి` పేరుతో రూపొందిన ఈ చిత్రం హిందీలో బ్లాక్‌ బస్టర్‌ హిట్ అయ్యింది. ఇందులో దిలీప్‌ కుమార్‌, జితేంద్ర, శ్రీదేవి నటించారు. ఈ మూవీని కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో కృష్ణంరాజు నిర్మించారు. అలా తనకు ఇష్టమైన నటుడితో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు రెబల్‌ స్టార్‌.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
కృష్ణంరాజు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Serial Killer Movies: లాస్ట్ మినిట్ వరకు ఉత్కంఠ రేపే టాప్ 5 సీరియల్ కిల్లర్ మూవీస్ ఇవే!
Recommended image2
సెకనుకు 10 లక్షలు.. 50 సెకన్ల యాడ్ కోసం 5 కోట్లు తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image3
Suman: శంకరాభరణం చేసిన నిర్మాతని, వీడితో సినిమా చేసి తప్పు చేశా.. సుమన్ మూవీపై కామెంట్స్, కట్ చేస్తే
Related Stories
Recommended image1
Oscar Awards Full List: ఆస్కార్‌ అవార్డుల లిస్ట్.. ఉత్తమ నటుడు మైఖేల్‌ బి జోర్డన్‌, ఉత్తమ నటి జెస్సీ బుక్లే.. బెస్ట్ మూవీ ఏంటంటే
Recommended image2
NTR డైరెక్షన్ లో చిరంజీవి నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved