Sreeja Post Hot Topic: చిరంజీవి కూతురు శ్రీజ పోస్ట్ వైరల్.. ఆమె టార్గెట్ ఎవరు?
మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ.. కొంత కాలంగా వార్తల్లో నిలుస్తుంది. ఆమె వైవాహిక జీవితానికి పలు రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఇప్పుడు ఆమె పెట్టిన ఓ పోస్ట్ మరింతగా హాట్ టాపిక్ అవుతుంది.

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ. ఆమె మొదట లవ్ మ్యారేజ్ చేసుకుని, దుమారం రేపింది. అప్పట్లో ఇది వైరల్ అయ్యింది. అయితే కొన్నాళ్లకే తన తొలి భర్త నుంచి విడాకులు తీసుకుంది శ్రీజ. విడిపోవడానికి బలమైన కారణాలు మాత్రంవెల్లడించలేదు. ఆ తర్వాత అమెరికాలో సెట్ అయిన తెలుగు ఫ్యామిలీకి చెందిన కళ్యాణ్‌దేవ్‌తో వివాహం జరిగింది. వీరిద్దరు తమ వైవాహిక జీవితానికి సంబంధించి ఇటీవల రూమర్స్ స్టార్ట్ అయ్యాయి.
శ్రీజ, కళ్యాణ్ దేవ్ కలిసి ఉండటం లేదని, విడిగా ఉంటున్నారని, కళ్యాణ్ దేవ్ అమెరికాలోనే ఉంటున్నారనే వార్తలు వినిపించాయి. ఆ మధ్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేరులో `కళ్యాణ్`ని తొలగించి కొణిదెల అని యాడ్ చేసింది శ్రీజ. దీంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే రూమర్స్ కి బలం చేకూరినట్టయ్యింది. దీనికితోడు ఈ మధ్య రామ్‌చరణ్‌తో కలిసి శ్రీజ వెకేషన్‌కి వెల్లింది. ఇందులో కళ్యాణ్‌గానీ, అటు ఉపాసన గానీ లేరు. ఇదికూడా శ్రీజ-కళ్యాణ్‌ల మధ్య విభేదాలను ప్రతిబింబిస్తుంది.
మరోవైపు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్నారు. ఆ మధ్య ఆయన నటించిన `సూపర్‌మచ్చి` చిత్రం విడుదలైంది. ఆ ప్రమోషన్‌లోనూ పాల్గొనలేదు. మరోవైపు ఆయన నటించిన మరో చిత్రం రిలీజ్‌కి రెడీ అవుతుంది. కానీ కళ్యాణ్ దేవ్ ఎక్కడా కనిపించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. ఆయన ఇక్కడ అన్నీ వదిలేసుకుని అమెరికాలో తన జాబ్ చేసుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా శ్రీజ చేసిన పోస్ట్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఆమె తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ కొటేషన్‌ని పంచుకుంది. మనం అవతలి వ్యక్తి మనస్ఫూర్తిగా ఏదైతే ఇస్తామో, అదే వంద రెట్లు మనకు తిరిగి వస్తుంది అని పేర్కొంది. ఉన్నట్టుంది శ్రీజ ఈ పోస్ట్ చేయడం వెనకాల అర్థం ఏంటనేది, శ్రీజ టార్గెట్ ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా, సస్పెన్స్ గా మారింది. టాలీవుడ్‌లో, సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ అవుతుంది.
ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం మేరకు శ్రీజ, కళ్యాణ్ దేవ్ మధ్య విభేదాలు తలెత్తాయని, వీరిద్దరు విడిపోతున్నారనే పుకారు షికార్ చేస్తుంది. కానీ ఇప్పటి వరకు తన భర్త కళ్యాణ్ దేవ్‌తో దిగిన ఫోటోలను డిలీజ్ చేయలేదు శ్రీజ. దీంతో చిన్న చిన్న విభేదాలు అయి ఉంటాయని, భవిష్యత్‌లో కలిసే అవకాశం ఉందని నెటిజన్ల నుంచి వినిపిస్తున్న టాక్. ఏదేమైనా స్వయంకృషితో మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి ఫ్యామిలీలో ఇలాంటి సమస్యలు తలెత్తడం అందరిని బాధకి గురి చేస్తుంది.