MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హాట్ క్లీవేజ్ షోతో మైండ్ బ్లాక్ చేస్తున్న బలగం బ్యూటీ... ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య బోల్డ్ పిక్స్ వైరల్!

హాట్ క్లీవేజ్ షోతో మైండ్ బ్లాక్ చేస్తున్న బలగం బ్యూటీ... ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య బోల్డ్ పిక్స్ వైరల్!


కావ్య కళ్యాణ్ రామ్ సైతం గ్లామరస్ ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తుంది. ఒకప్పటి ఈ చైల్డ్ ఆర్టిస్ట్ బోల్డ్ యాంగిల్ కాకరేపుతుంది. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

Sambi Reddy | Published : Sep 10 2023, 11:43 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Kavya Kalyanram

Kavya Kalyanram

గ్లామర్ ఫీల్డ్ లో స్కిన్ షో తప్పని సరి. అభిమానులను పెంచుకోవాలన్నా, దర్శక నిర్మాతల కంట్లో పడాలన్నా అందాలు ఆరబోయ్యల్సిందే. యంగ్ బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్ అదే చేస్తుంది. ఇంస్టాగ్రామ్ వేదికగా ఉడికించేస్తోంది. తాజాగా పింక్ ఫ్రాక్ లో మైండ్ బ్లాక్ చేసింది. 
 

27
Kavya Kalyanram

Kavya Kalyanram

కావ్య లేటెస్ట్ మూవీ ఉస్తాద్. కీరవాణి చిన్న కొడుకు శ్రీసింహ హీరోగా నటించాడు. ఉస్తాద్ మూవీ ఓ డిఫరెన్స్ సబ్జెక్టుతో తెరకెక్కింది. ఉస్తాద్ మూవీతో హ్యాట్రిక్ పూర్తి చేద్దామనుకున్న కావ్య కళ్యాణ్ రామ్ కి నిరాశే  ఏదురైంది. ఉస్తాద్ ప్లాప్ అయ్యింది. 

 

37
Kavya Kalyanram

Kavya Kalyanram

హీరో శ్రీసింహ మరో ప్రయత్నం విఫలమైంది. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఉస్తాద్ చిత్రాన్ని ప్రేక్షకుల పట్టించుకోలేదు. జైలర్, భోళా శంకర్ వంటి భారీ చిత్రాల మధ్య కొట్టుకుపోయింది. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా గంగోత్రి, బాలు , విజయేంద్ర వర్మ, ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, బన్నీ, పాండురంగడు ఇలా పదికి పైగా చిత్రాల్లో కావ్య నటించింది. 

47
Kavya Kalyanram

Kavya Kalyanram

గత ఏడాది విడుదలైన మాసూద మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. హారర్ జోనర్లో తెరకెక్కిన మసూద హిట్ టాక్ తెచ్చుకుంది. తిరువీర్, సంగీత ప్రధాన పాత్రలు చేసిన ఈ చిత్రంలో కావ్య పాత్ర నిడివి తక్కువే. ఉన్నంతలో మెప్పించే ప్రయత్నం చేసింది. 


 

57
Kavya Kalyanram

Kavya Kalyanram

అయితే ఆమెకు బలగం ఫేమ్ తెచ్చింది. దర్శకుడు వేణు ఎల్దండి అద్భుతం చేశాడు. 2023 సెన్సేషన్స్ లో ఒకటిగా బలగం నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బంపర్ హిట్ కొట్టింది. ఈ సినిమా సంచనాలు గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రియదర్శికి జంటగా కావ్య కళ్యాణ్ రామ్ నటించింది. 

67
Asianet Image

బలగం మూవీలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి కావ్య, ప్రియదర్శిలను హీరో హీరోయిన్ అని కూడా అనలేం. నటులుగా పేరు తెచ్చుకున్నారు. బలగం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. దర్శకుడు వేణుతో పాటు ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ కి కూడా అవార్డులు దక్కాయి. బలగం మూవీతో కావ్య ప్రేక్షకుల మదిలో రిజిస్టర్ అయ్యారు. 
 

77
Asianet Image

ఇటీవల కావ్య కళ్యాణ్ రామ్ పై ఓ రూమర్ చక్కర్లు కొట్టింది. హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో దర్శక నిర్మాతలు బాడీ షేమింగ్ కి పాల్పడ్డారని తాను చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. లావుగా ఉన్నావు, నువ్వు హీరోయిన్ కాలేవని కావ్య స్వయంగా చెప్పారని వార్తలు వచ్చాయి. ఈ కథనాలపై కావ్య స్పందించారు. అవన్నీ నిరాధారమైన కథనాలంటూ కొట్టిపారేశారు. నాపై ఏ దర్శకుడు నిర్మాత బాడీ షేమింగ్ కి పాల్పడలేదు. అలాంటి ఆరోపణలు నేను చేయలేదు. దయచేసి అవాస్తవాలు ప్రచారం చేయకండని సోషల్ మీడియా పోస్ట్ పెట్టింది. 

 

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories