- Home
- Entertainment
- Alia - Ranbir Marriage: ఘనంగా జరిగిన ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ పెళ్ళి, ఫోటోల కోసం ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్
Alia - Ranbir Marriage: ఘనంగా జరిగిన ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ పెళ్ళి, ఫోటోల కోసం ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్
బాలీవుడ్ ప్రేమ జంట అలియా భట్-రణబీర్ కపూర్ ఎట్టకేలకు పెళ్లిపీటలు ఎక్కారు. ఎన్నో సార్లు వాయిదాపడుతూ వచ్చిన వీరి పెళ్లి వేడుక ఈరోజు (14 ఏప్రిల్ ) ఘనగంగా జరిగింది.

చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చిన బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆలియా భట్, రణ్ భీర్ కపూర్ పెళ్లి ఘనంగా జరిగింది. అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో, కపూర్ ఫ్యామిలీ సాంప్రదాయాలు పాటిస్తూ.. పెళ్లి వేడుకను నిర్వహించినట్టు తెలుస్తోంది. అత్యంత గోప్యంగా ఈ వివాహవేడుకను నిర్వహించారు.
అధికారికంగా ఎక్కడా కూడా పెళ్లి గురించి గానీ, ముహూర్తం గురించి గానీ ప్రకటించేదు ఈ బాలీవుడ్ జంట. అంతే కాదు బయట వారికి ఎవ్వరికి ఇన్విటేషన్లు కూడా పంపించలేదు. చాలా సీక్రేట్ గా పెళ్ళి చేసుకుంది ఈ జంట. కేవలం అతికొద్ది మంది అతిథులతో కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ ఇద్దరి పెళ్లి జరుగింది.
పెళ్లికి సంబంధించి ముందే అన్నీ సెట్ చేసుకున్నారు ఫ్యామీ మెంబర్స్. ఒక్క ఫోటో కాని.. చిన్న వీడియో కాని బయట కు రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఫోటో టీమ్ తో కూడా ఇలానే కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారట కూడా. అయితే ఇంత సీక్రేట్ గా పెళ్ళి చేసుకున్న వీరు. రిసెప్షన్ మాత్రం స్టార్ సెలబ్రిటీల మధ్య ఘనంగా చేసుకోనుంది అని సమాచారం.
పెళ్లిలో కార్యక్రమాలలో భాగంగా ముంబైలోని రణ్‌బీర్ నివాసం వాస్తు లో ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో మెహందీ, సంగీత్ ఈవెంట్ ఘనంగా జరిగాయి. దీనికి బాలీవుడ్ బ్యూటీస్ కరీష్మా కపూర్, కరీనా కపూర్ సహా ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, స్నేహితులు, ఇతర బాలీవుడ్ ప్రముఖులు హాజరై సందడి చేశారు.
ఈ పెళ్లి వేడుకలో మరో విశేషం కూడా ఉంది. అదేంటంటే.. 43 ఏళ్ల క్రితం రణ్‌బీర్ తల్లిదండ్రులు నీతూ కపూర్, రిషి కపూర్‌ల నిశ్చితార్థం జరిగిన రోజునే వీరి మెహందీ వేడుక జరిగింది. ఈ సందర్భంగా తన నిశ్చితార్థం ఫోటోను నీతూ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఇక, రణ్‌బీర్-అలియా పెళ్లి కోసం బాలీవుడ్ అంతా వెయ్యి కళ్ళతో ఎ దురు చూసింది. ఇక అభిమానులైతే వీరి పెళ్ళిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.ఈ క్రమంలో వీరి పెళి వేడుకు ముగియడంతో ఫ్యాస్ పండగ చేసుకుంటున్నారు. అయితే వీరి పెళ్ళికి సంబంధించి ఇద్దరు మాట్లాడితే బాగుండి అని కోరకుంటున్నారు.
అంతే కాదు వీరి పెళ్లి కి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ దోరికితే బాగుండు అని తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే ఈ పెళ్ళి వేడుకకు బాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రిటీలు వచ్చినట్టు తెలుస్తోంది. . పెళ్లి నేపథ్యంలో అభిమానులు కూడా తమ స్టార్స్ కోసం ప్రత్యేకమైన గిఫ్ట్స్ కూడా పంపుతున్నారు.
ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ల పెళ్ళి గురించి ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇక పెళ్ళి గురించి కరెక్ట్ డేట్ చెప్పకుండా కన్ ఫ్యూజన్ లో కూడా పెట్టారు రణ్ బీర్ టీమ్. ఒక దశలో పెళ్ళి మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యిందని వార్తలు కూడా స్ప్రెడ్ అయ్యాయి.