MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • మహేష్ బాబు సినిమాలో ఐశ్వర్యారాయ్, ఏపాత్ర చేయబోతోంది...? డైరెక్టర్ ఎవరు....?

మహేష్ బాబు సినిమాలో ఐశ్వర్యారాయ్, ఏపాత్ర చేయబోతోంది...? డైరెక్టర్ ఎవరు....?

కొన్ని కాంబినేషన్లు వింటానికి విచిత్రంగా ఉంటాయి. కానీ క్రేజీగా ఉంటాయి. అసలు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా అన్నట్టు ఉంటాయి. ప్రస్తుతం అలాంటి కాంబినేషన్ పై సోషల్ మీడియాలో గట్టిగా చర్చ జరుగుతోంది. అదే సూపర్ స్టార్ మహేష్, ఐశ్వర్యరాయ్. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 12 2022, 12:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

అవును వింటానికి విచిత్రంగా ఉన్నా.. ప్రస్తుతం ప్రచారం ఉన్న క్రేజీ న్యూస్ ఇదే. సూపర్ స్టార్ మహేష్ సినిమాలో ఐశ్వర్యారాయ్ నటించబోతోందట. అది కూడా టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ రాజమౌళి సినిమాలో ఐష్ కనిపించబోతుందట. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న రూమర్ ఇదే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

కొన్ని వార్తలు విపరీతంగా వైరల్ అవుతుంటాయి. ఇందులో ఎంత నిజం ఉంది? ఇది వాస్తవమేనా? అనే విషయాలతో సంబంధం లేకుండా...  వీటిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటుంటుంది. ఇప్పుడు మహేష,ఐశ్వర్య, రాజమౌళి కాంబినేషన్ సినిమా కూడా అలాంటిదే.

38

దర్శక దిగ్గజం రాజమౌళి నెక్స్ట్ మూవీలో ఐశ్వర్య లీడ్ రోల్ పోషిస్తుందని ఫిలింనగర్ టాక్. ఐశ్వర్యకు సంబంధించి మరో వార్త కూడా వైరల్ అవుతోంది. ఇప్పటికే ఐశ్వర్యారాయ్ గురించి మరో వార్త ప్రచారంలో ఉంది. రజనీకాంత్, దిలీప్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాలో కూడా  ఐశ్వర్య నటించబోతోందని సమాచారం.  

48

రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని మహేశ్ బాబుతో తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్ థ్రిల్లర్ గా చిత్రం తెరకెక్కబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ఐశ్యర్య  నటించబోతోందని ప్రచారం జరుగుతోంది.  అయితే ఆమె పాత్ర ఏంటీ అన్నవిషయంలో మాత్రం ఎటువంటి రూమర్స్ లేవు. 

58

అయితే ఐశ్వర్య రాయ్ తెలుగులో ఇంత వరకూ ఒక్క సినిమా కూడా చేయలేదు. ఆమెకు టాలీవుడ్ లో సినిమా చేయడ ఇష్టం ఉండదూ అని ప్రచారం ఉంది. ఆ మధ్య ఆచార్యలో చిరుకు జోడీగా నటించమని అడిగినా కూడా ఆమె చేయనని చెప్పిందట. మరి ఇప్పుడు ఈ సినిమాకు ఒప్పుకుంటుందా..? 

68

గతంలో కూడా ఐష్ చేత తెలుగు సినిమా చేయించాలి అని చాలా మంది ట్రై చేశారు. కాని ఆమె రిజక్ట్ చేసింది. తమిళ సినిమాల్లో మాత్రం నటిస్తుంది ఐశ్వర్య. తెలుగు సినిమాలంటే చేయదు. గతంలో టాలీవుడ్ అంటే చిన్న చూపు ఉండేది. కాని ఇప్పుడు బాలీవుడ్ ను పక్కకు నెట్టి ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ అని అనిపించుకుంది. 

78

ఇక రాజమౌళి సినిమాలో పాత్ర అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి జక్కన్న అడిగితే.. బాలీవుడ్ లో స్టార్స్ కూడా క్యూ కడతారు. మరి ఈ సినిమాలో నిజంగా ఐష్ ను అనుకుంటున్నారా..? రాజమౌళి అడిగితే ఐశ్వర్యారాయ్ కాదంటుందా..? ఆమెను జక్కన్న ఎలా ఒప్పిస్తాడో చూడాలి. 

88

ఇక పోతే.. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో నటించేందుకు మహేష్ బాబు రెడీ అవుతున్నారు. వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ సినిమా తరువాత మహేష్.. రాజమౌళి సినిమాలో జాయిన్ కాబోతున్నాడు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Veta Movie: చిరంజీవి పవర్‌ఫుల్‌ మూవీ టైటిల్‌తో కొత్త సినిమా.. 40 ఏళ్ల తర్వాత మరోసారి వేట షురూ
Recommended image2
Agnipariksha: అగ్నిపరీక్ష కంటెస్టెంట్లు ఫైనల్‌.. బిగ్‌ బాస్‌ హౌజ్‌కి వెళ్లే కామనర్స్ వీళ్లే?
Recommended image3
Horror Movies: ఈ 5 సినిమాలు చూస్తే రాత్రి ఒంటరిగా నిద్రపోవడం కష్టమే.. ఒక్కో సీన్‌కి వణుకు పక్కా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved