- Home
- Entertainment
- ఐశ్వర్య రాయ్ - సల్మాన్ ఖాన్ సీక్రేట్ గా పెళ్లి చేసుకున్నారా ? సంచలన వార్త వెనుక నిజం ఏంటి?
ఐశ్వర్య రాయ్ - సల్మాన్ ఖాన్ సీక్రేట్ గా పెళ్లి చేసుకున్నారా ? సంచలన వార్త వెనుక నిజం ఏంటి?
ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ల వివాహం జరిగి 18 ఏళ్ళు అవుతుంది. అయితే అభిషేక్ కంటే ముందు ఐశ్వర్యరాయ్ సల్మాన్ ఖాన్ ను పెళ్ళి చేసుకుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. మరి ఈ విషయంలో నిజం ఎంత?

ఐశ్వర్య, సల్మాన్ ల ప్రేమాయణం అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.. దాదాపు మూడేళ్ళు నడిచిన ఈ ప్రేమకథ చివరికి విఫలమైంది. వీరు ఎందుకు విడిపోయారో ఎవరికి తెలియదు.
Also Read: 20 కేజీలు బరువు తగ్గడానికి ఖుష్బూ ఇంజెక్షన్ తీసుకున్నారా?
సల్మాన్ తో ప్రేమాయణం సాగిస్తున్న సమయంలోనే ఐశ్వర్య ఇస్లాం మతం స్వీకరించి సల్మాన్ ని రహస్యంగా వివాహం చేసుకుందనే వార్తలు షాక్ కు గురిచేశాయి.
Also Read: 40 సినిమాలు ప్లాప్.. 33 రిలీజ్ కాలేదు.. అయినా ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరో ఎవరు?
లోనావాలాలోని ఓ బంగ్లాలో ముంబైకి చెందిన ఓ కాజీ సమక్షంలో ఈ నిఖా జరిగిందని, అందులో కేవలం సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారని వార్తలు వచ్చాయి.
Also Read: మోహాన్ బాబు కాలర్ పట్టుకుని, గెట్ అవుట్ అన్న సీనియర్ హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?
నిఖా వార్తల తర్వాత ముంబైలో ఇద్దరూ కలిసి కనిపించడం, న్యూయార్క్ హనీమూన్ నుంచి తిరిగి వచ్చారనే వార్తలు మరింత సంచలనం రేపాయి. ఐశ్వర్య తల్లిదండ్రులకు ఈ సంబంధం ఇష్టం లేదని. దాంతో గొడవలు జరిగినట్టు రూమర్లు వైరల్ అయ్యాయి.
Also Read: 40,000 కు ఇంటిని తాకట్టు పెట్టి, ఎన్టీఆర్ తో సినిమా చేసిన స్టార్ కమెడియన్ ఎవరో తెలుసా?
ఇక తన సీక్రేట్ పెళ్లి వార్తలపై స్పందించిన ఐశ్వర్య, నిఖా వార్తలను ఖండించింది. ఇలాంటిదేదైనా జరిగితే ఇండస్ట్రీ అంతా తెలుసుకునేదని చెప్పింది. అవన్ని గాలివార్తలంటూ కొట్టిపారేసింది.
Also Read: మగవారికి పీరియడ్స్ వస్తే అణుయుద్ధం తప్పదు, జాన్వీ కపూర్ కామెంట్స్
వివాహం లాంటి విషయాన్ని దాచాల్సిన అవసరం లేదని, అలా జరిగితే తానే స్వయంగా ప్రకటిస్తానని, ప్రస్తుతం తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నందున పెళ్లి గురించి ఆలోచించడం లేదని గతంలో ఐశ్వర్య స్పష్టం చేసింది.
Also Read: 5 సార్లు రీ రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమా ఏదో తెలుసా? మరీ ఇంత తక్కువ కలెక్ట్ చేసిందా?
1999లో విడుదలైన 'హమ్ దిల్ దే చుకే సనమ్' సినిమా సెట్స్ లో ఐశ్వర్య, సల్మాన్ ల ప్రేమ చిగురించింది. 2002లో వీరిద్దరూ విడిపోయారు. తర్వాత ఐశ్వర్య, వివేక్ ఒబెరాయ్ తో కొంతకాలం ప్రేమలో మునిగింది.
Also Read:Bigg Boss: బిగ్ బాస్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్, ఈసారి సీజన్ లేనట్టే, కారణం ఏంటో తెలుసా?
చివరికి 2007 ఏప్రిల్ 20న అభిషేక్ బచ్చన్ ని ఐశ్వర్య రాయ్ వివాహం చేసుకుంది. వీరికి ఆరాధ్య అనే కుమార్తె ఉంది. ఈమధ్య కాలంలో వీరి విడాకుల రూమర్స్ గట్టిగా వినిపించాయి. మనస్పర్ధలు కారణంగా విడిగా ఉంటున్నారని, త్వరలో విడాకులంటూ బాలీవుడ్ కోడై కూసింది.