- Home
- Entertainment
- Bigg Boss: బిగ్ బాస్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్, ఈసారి సీజన్ లేనట్టే, కారణం ఏంటో తెలుసా?
Bigg Boss: బిగ్ బాస్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్, ఈసారి సీజన్ లేనట్టే, కారణం ఏంటో తెలుసా?
Bad News for Bigg Boss Fans: బిగ్ బాస్ ప్రేమికులకు బ్యాడ్ న్యూస్.. ఈసారి బిగ్ బాస్ షో ఉంటుందో లేదో కాస్త డౌటే. ఈ సీజిన్ ముందుకు వెళ్లేలా కనిపించడంలేదు. చాలా ఏళ్ళుగా ఆడియన్స్ ను అలరిస్తున్న ఈ రియాల్టీషోకు బ్రేక్ లు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకీ బిగ్ బాస్ ఎందుకు ఆగిపోబోతోంది. కారణం ఏంటి? అసలు బిగ్ బాస్ ఆగిపోతుందన్న వార్తల్లో నిజం ఎంత?

Bad News for Bigg Boss Fans: ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరైన రియాల్టీషో బిగ్ బాస్. హాలీవుడ్ లో బిగ్ బ్రదర్ గా స్టార్ట్ అయ్యి.. ఇండియాలో బిగ్ బాస్ గా కంటీన్యూ అవుతోన్న ఈ షో.. మన దేశంలో కూడా అన్ని భాషల్లో పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ హిందీలో ఇప్పటికే 18 సీజన్లు కంప్లీట్ చేసుకోగా.. కన్నడాలో 11 సీజన్లు కంప్లీట్ చేసుకుంది.
ఆతరువాత తెలుగు, తమిళ భాషల్లలో 8 సీజన్లు కంప్లీట్ అయ్యాయి. ప్రతీ భాషలో బిగ్ బాస్ సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో కూడా కింగ్ నాగార్జున హోస్టింగ్ లో బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో సూపర్ సక్సెస్ సాధించింది. అయితే తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ కు బ్రేక్స్ పడబోతున్నట్టు తెలుస్తోంది.
Also Read: మోహాన్ బాబు కాలర్ పట్టుకుని, గెట్ అవుట్ అన్న సీనియర్ హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?
అయితే ఆగిపోబోతున్నట్టు ప్రచారం జరుగుతున్నది తెలుగు బిగ్ బాస్ కాదు, హిందీ బిగ్ బాస్. హిందీ బిగ్ బాస్ ను అన్ని సీజన్లు సల్మాన్ ఖాన్ హోస్టింగ్ చేశారు. బిగ్ బాస్ కు వెళ్ళిన చాలామంది బాలీవుడ్ లో మంచి కెరీర్ ను కొనసాగిస్తున్నవారు ఉన్నారు.ఇంత సక్సెస్ అయిన బిగ్ బాస్ హిందీ ఎందుకు ప్రాబ్లమ్స్ లో పడిందంటే.
ఈ షోకు సబంధించిన బినిజయ్ ఆసియా, ఎండేమోల్ సంస్థలతో కలర్స్ టీవీ కి గత రెండు నెలల నుండి విబేధాలు వచ్చినట్టు తెలుస్తోంది. దాంతో బిగ్ బాస్ షోతో పాటు ఈ సంస్థల నుండి ప్రసారమయ్యే ‘ఖత్రోమ్ కి ఖిలాడీ’ ప్రోగ్రామ్ కూడా రద్దు చేసే ఆలోచనలో ఉన్నారట టీమ్.
Also Read: కొత్త కారు కొన్న ఏ.ఆర్.రెహమాన్ , కాస్ట్ ఎంతో తెలుసా?
అయితే ఈ విషయంలో అఫీషియల్ ఇన్ ఫర్మేషన్ లేదు, ఈ సంస్థల నుంచి అధికారిక ప్రకటన కూడా రాలేదు. అయితే ఇండస్ట్రీలో మరో కొత్త వాదన వినిపిస్తోంది. ఈ షోలు కంప్లీట్ గా రద్దు కావడంలేదు, ఇప్పుడు కాస్త బ్రేక్స్ పడ్డాయి అంతే.. ఈ షోల డేట్స్ వాయిదా పడుతున్నాయని కొంతమంది అంటున్నారు.
మరి ఈ విషయంలో వినిపిస్తున్న వార్తల్లో ఎంత నిజముందో చూడాలి. బిగ్ బాస్ రియాలిటీ షో ని ఇండియా వైడ్ అన్ని భాషల్లో నిర్వహిస్తున్నది ఎండేమోల్ సంస్థనే. ప్రతీ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ముంబై నుండి వచ్చే ఎండేమోల్ సంస్థ ఇచ్చే ఫలితాలు ఆధారంగానే జరుగుతుంది.
bigg boss logo
మరి హిందీ ఈ షోకి ఇలా ప్రాబ్లమ్ వస్తే.. మిగిలిన భాషలన్నింటిలో షో లేట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఆ ప్రభావం పడితే మటకు తెలుగులో కూడా బిగ్ బాస్ మరింత లేట్ అయ్యే అవకాశం ఉంది. ముందు నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈసారి త్వరగా స్టార్ట్ అవుతుంది అన్న ప్రచారం జరుగుతూ వస్తోంది.
ఈసారి ఆగస్టు నెల నుండే షో మొదలు అవుతుందని న్యూస్ వినిపించింది. మరి ఈ ఏడాది బిగ్ బాస్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. ఈసారి కూడా బిగ్ బాస్ తెలుగు షోను నాగార్జునే హోస్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. మధ్యలో బాలయ్య, విజయ్ దేవరకొండ పేర్లు కూడా వినిపించాయి.