MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • NTR డైరెక్షన్ లో చిరంజీవి నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా? నిజమెంత?

NTR డైరెక్షన్ లో చిరంజీవి నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా? నిజమెంత?

నటసార్వభౌముడు ఎన్టీఆర్ డైరెక్షన్ లో.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఏకైక సినిమా గురించి మీకు తెలుసా? ఎన్టీఆర్ దర్శకత్వం వహించి.. చిరంజీవి నటించిన సినిమా ఏది? నిజమెంత?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 16 2026, 02:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఫిల్మ్ ఇండస్ట్రీలో అరుదైన ఘటనలు..
Image Credit : Asianet News

ఫిల్మ్ ఇండస్ట్రీలో అరుదైన ఘటనలు..

ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే మాయాలోకం.. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఎప్పుడు ఎవరు కాంబినేషన్స్ కడతారో కూడా చెప్పలేము. తెలుగు సినిమా చరిత్రలో అరుదైన సంఘటనలకు కొదవలేదు. ముఖ్యంగా వేర్వేరు తరాలకు చెందిన అగ్ర హీరోలు ఒకే సినిమాలో కలిసి నటించడం ప్రేక్షకులకు ఎప్పటికీ ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. అలాంటి ఆసక్తికరమైన కాంబినేషన్ ఎన్టీఆర్ ‌- మెగాస్టార్ చిరంజీవిది. ఈ ఇద్దరు స్టార్స్ కలిసి “తిరుగులేని మనిషి” సినిమాలో నటించారు.

25
సీనియర్ హీరోలతో కలిసి నటించిన చిరు.
Image Credit : Asianet News

సీనియర్ హీరోలతో కలిసి నటించిన చిరు.

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ ప్రారంభ దశలోనే అప్పటి అగ్ర హీరోలైన ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి ప్రముఖులతో కలిసి అనేక సినిమాల్లో నటించారు. ఆ కాలంలో ఎన్టీఆర్ కు అప్పట్లో ఎంత ఫాలోయింగ్ ఉండేదో.. ఆతరువాత కాలంలో మెగాస్టార్ చిరంజీవికి కూడా అంతకంటే ఎక్కువే ఇమేజ్ పెరుగుతూ వచ్చింది. తెలుగు ప్రేక్షకుల దృష్టిలో ఈ ఇద్దరు నటులు ప్రత్యేక స్థానం సంపాదించారు.

Related Articles

Related image1
రామ్ చరణ్.. అల్లు అర్జున్ కు పోటీ ఇవ్వబోతున్నాడా? కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్న మెగా పవర్ స్టార్.. ?
Related image2
Trisha Krishnan: వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టిన త్రిష.. ముంబై పెళ్లిలో వైరల్ ఫోటో సంగతేంటి?
35
తిరుగులేని మనిషి సినిమాలో ఎన్టీఆర్ - చిరు
Image Credit : Asianet News

తిరుగులేని మనిషి సినిమాలో ఎన్టీఆర్ - చిరు

ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒక సినిమాలో నటించిన విషయం చాలామంది ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన “తిరుగులేని మనిషి” సినిమాలో చిరంజీవి రెండో హీరోగా కనిపించారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదల సమయంలో మంచి విజయాన్ని సాధించింది. ఇండస్ట్రీ సమాచారం ప్రకారం.. “తిరుగులేని మనిషి” సినిమా 4వ షెడ్యూల్ జరుగుతున్న సమయంలో దర్శకుడు కె రాఘవేంద్రరావు స్వల్పంగా అనారోగ్యానికి గురయ్యనట్లు సమాచారం. వైద్యులు ఆయనకు కనీసం ఒక వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో షూటింగ్‌కు రావడం సాధ్యం కాలేదు.

45
వారం రోజుల కోసం మెగా ఫోన్ పట్టిన ఎన్టీఆర్..
Image Credit : Asianet News

వారం రోజుల కోసం మెగా ఫోన్ పట్టిన ఎన్టీఆర్..

షూటింగ్‌ను ఆపేసే పరిస్థితి వచ్చింది.. షూటింగ్ ఆపితే.. మళ్లీ నటీనటుల డేట్స్‌ తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. అందరి డేట్స్ దొరుకుతాయన్న నమ్మకంలేదు. దాంతో.. ఈ విసయం స్వయంగా ఎన్టీఆర్ ముందుకు వెళ్లింది. ఆయన వెంటనే మెగా ఫోన్ పట్టుకోవడానికి ముందుకు వచ్చాడు. వారం రోజుల షూటింగ్‌ను డైరెక్ట్ చేయడానికి ముందు వచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా చిరంజీవి , విలన్ పాత్రలో నటించిన కైకాల సత్యనారాయణ మధ్య వచ్చే ఒక ఫైట్ సీన్‌ను ఎన్టీఆర్ చిత్రీకరించారని చెబుతున్నారు.

55
ఎన్టీఆర్‌కు దర్శకత్వం కొత్త కాదు
Image Credit : Asianet News

ఎన్టీఆర్‌కు దర్శకత్వం కొత్త కాదు

ఎన్టీఆర్‌కు దర్శకత్వం కొత్త కాదు. “సీత రామ కల్యాణం”, “గుళేబకావలి కథ”, “దాన వీర సూర కర్ణ”, “కుల గౌరవం”, “తాతమ్మ కల”, “వరకట్నం”, “చాణక్య చంద్రగుప్త”, “శ్రీ రామ పట్టాభిషేకం” వంటి పలు సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ సినిమాలో కొంత భాగం దర్శకత్వం వహించారని సమాచారం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Nagarjuna కెరీర్ లో ఇష్టపడి చేయలేకపోయిన పాత్ర ఏదో తెలుసా? కారణం ఏంటి?
Recommended image2
Oscars 2026: ఆస్కార్స్ రెడ్ కార్పెట్‌పై ప్రియాంక చోప్రా.. ఫ్యాషన్‌తో అదరగొట్టిన హాలీవుడ్ తారలు
Recommended image3
Ajith Kumar: 2027 వరకు కార్ రేసింగ్, షూటింగ్ గ్యాప్‌లో ట్రాక్‌పైకి.. స్టార్ హీరో షెడ్యూల్ ఇదే!
Related Stories
Recommended image1
రామ్ చరణ్.. అల్లు అర్జున్ కు పోటీ ఇవ్వబోతున్నాడా? కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్న మెగా పవర్ స్టార్.. ?
Recommended image2
Trisha Krishnan: వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టిన త్రిష.. ముంబై పెళ్లిలో వైరల్ ఫోటో సంగతేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved