- Home
- Entertainment
- Sree Mukhi Latest Pics : లెహంగా వోణీలో బుల్లితెర బ్యూటీ ఫోజులు.. ఒంపుసొంపులతో టెంపరేచర్ పెంచుతున్న శ్రీముఖి..
Sree Mukhi Latest Pics : లెహంగా వోణీలో బుల్లితెర బ్యూటీ ఫోజులు.. ఒంపుసొంపులతో టెంపరేచర్ పెంచుతున్న శ్రీముఖి..
స్మాల్ స్క్రీన్ బ్యూటీ, యాంకర్ శ్రీముఖి (Sree Mukhi) వరుస ఫొటోషూట్లతో నెటిజన్లకు ఊపిరాడకుండా చేస్తోంది. తాజాగా ట్రెడిషనల్ వేర్ లో మతిపోయే ఫోజులతో కుర్రకారుకు రాములమ్మ అందాల విందు చేస్తోంది.

సెలబ్రెటీ యాంకర్ శ్రీముఖి టెలివిజన్ ప్రేక్షకులకు ఎంతగానో పరిచయం. ఈటీవీ, జీ తెలుగు, జెమినీ టీవీ వంటి టాప్ రేటింగ్ ఛానళ్లలో ప్రసారమయ్యే రియాలిటీ షోలల్లో మెరుస్తూ తన క్రేజ్ పెంచుకుంటోంది.
ఉగాది సందర్భంగా ఈ బుల్లితెర బ్యూటీ ఒకింత బాగా బిజీ అయ్యిందనే చెప్పాలి. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రసారం చేస్తున్న ‘ఉగాది స్పెషల్ ఈవెంట్స్’కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ బుల్లితెరపై సందడి చేస్తోంది.
ఈ సుందరి.. ఉగాది సెలబ్రేషన్స్ పేరిట వరుస ఫొటోషూట్లతో తన ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తోంది. లేటెస్ట్ అవుట్ ఫిట్ లో తన అందాలను విందుచేస్తోందీ బ్యూటీ. తాజాగా శ్రీముఖ ఈ రోజు జెమినిటీవీలో ఐదు గంటలకు ప్రసారం అవుతున్న ‘ఫుల్ కిక్’ ఉగాది సెలబ్రేషన్స్ సందర్భంగా లేటెస్ట్ ఫొటోషూట్ చేసింది.
ఈ ఫొటోల్లో శ్రీముఖి లెహంగా, ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ ధరించి ఆకట్టుకుంటోంది. మ్యాచింగ్ దుప్పట్టా ఒంటిపై కప్పుకొని మతిపోయే ఫోజులు ఇచ్చింది. ఈ రాములమ్మ స్టిల్స్ కు కుర్రాకారు సైతం మైమరిచిపోతున్నారు.
అప్పటికే గ్లామర్ తన సొంతం చేసుకున్న శ్రీముఖి ట్రెడిషినల్ వేర్ లో మత్తెక్కించే చూపులతో నెటిజన్ల గుండెల్ని కొల్లగొడుతోంది. మతిపోయే ఫోజులిస్తూ హోయలు పోయిందీ బ్యూటీ.
అయితే ఈ ఫొటోలను పోస్ట్ చేస్తూ శ్రీముఖి ఇలా క్యాప్షన్ ఇచ్చింది. ‘శుభకృతు నామ సంవత్సర శుభాకాంక్షలు’ అంటూ తన అభిమానులకు శుభాకాంక్షలు తెలిపింది. రాములమ్మ విషెస్ కు నెటిజన్లు కూడ స్పందించారు. తనకు కూడా విషెస్ తెలిపారు.
ఇటు బుల్లితెరపై మెరుస్తూనే శ్రీముఖి సినిమాల్లోనూ నటించేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తుంది. అయితే ప్రతిసారి సినిమాల్లో అవకాశాలు వస్తున్నా.. అంతగా గుర్తింపులేని పాత్రలు దక్కడంతో వెండితెరపై తన మార్క్ చూపెట్టలేకపోతోంది.
గతంలో జులాయి, నేను శైలజా, 30 రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా? లాంటి చిత్రాల్లో పలు పాత్రల్లో నటించింది. కానీ పెద్దగా పాపులారిటీని సొంతం చేసుకోలేదు. ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న తాజాగా చిత్రం ‘భోళా శంకర్’లో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాతోనైనా శ్రీముఖి కేరీర్ మలుపు తిరగాలని ఆమె అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.