MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • The Ghost Movie : ‘ది గోస్ట్’మూవీ లోకేషన్ లో ప్రమాదం.! గాల్లోకి లేసిన నాగార్జున కారు.. ఏం జరిగిందంటే?

The Ghost Movie : ‘ది గోస్ట్’మూవీ లోకేషన్ లో ప్రమాదం.! గాల్లోకి లేసిన నాగార్జున కారు.. ఏం జరిగిందంటే?

కింగ్ నాగార్జున (Nagarjuna) తాజాగా నటిస్తున్న చిత్రం ‘ది గోస్ట్’. ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తి కావస్తోంది. అయితే తాజాగా ఈ చిత్ర షూటింగ్ లో చిన్నపాటి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నాగార్జునకు చెందిన కారు గాల్లోకి లేసి కిందపడటంతో నుజ్జునుజ్జు అయ్యింది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 06 2022, 02:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

అక్కినేని నాగార్జున వరుస చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ను అలరిస్తున్నారు.  అటు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాల్లో నటిస్తూనే ఇటు యాక్షన్ థ్రిల్లర్ మూవీల్లోనూ తన  సత్తా చూపిస్తున్నారు. భారీ యాక్షన్ సీక్వెన్స్ లకు కూడా రెడీ అవుతూ.. కెమెరా ముందు సాహసాలు చేస్తున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

గతేడాది అక్కినేని నాగార్జున, యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaithanya) నటించిన ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ డ్రామా ‘బంగార్రాజు’ మూవీతో సక్రాంతి హిట్ చిత్రంగా నిలిచింది. ఇటు ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూనే యాక్షన్ మూవీలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు నాగార్జున. 
 

38

గతేడాది యాక్షన్ థ్రిల్లర్ ‘వైల్డ్ డాగ్’ Wild Dog చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఇదే జోష్ ను కొనసాగిస్తూ మరో యాక్షన్ చిత్రం ‘ది గోస్ట్’లో నటిస్తున్నాడు. వైల్డ్ డాగ్ చిత్రంతో ఫ్యాన్స్ ను  ఫిదా చేసిన కింగ్.. ప్రస్తుతం The Ghost మూవీ కోసం భారీ విన్యాసాలు చేస్తున్నారు. 

48

అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ తో అభిమానుల్లో జోష్ నింపనున్నాడు. ఇందుకు నాగార్జున ప్రత్యేకమైన ఎక్సర్ సైజులు చేస్తున్న విషయం తెలిసిందే. బాడీని ఫిట్ గా ఉంచుకునేందుకు నాగార్జున చాలా శ్రద్ధ వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం ది గోస్ట్ చిత్రీకరణ లో బిజీగా ఉన్నారు. 

58

ఈ చిత్రంలోని భారీ యాక్షన్ సీక్వెన్స్ లను గత నెలలో దుబాయ్ (Dubai)లోని ఎడారిలో చిత్రీకరించారు. ఇందుకు థాయ్ లాండ్ కు చెందిన స్టంట్ డైరెక్టర్ సీలుమ్ ఆధ్వర్యంలో మూము బారీ యాక్షన్ సీన్స్ ను షూట్ చేశారు దర్శకుడు ప్రవీణ్ సత్తార్. 
 

68

అయితే మార్చి 31 వరకు దుబాయిలో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ది గోస్ట్ టీం.. ప్రసుతం ఊటీలోని కొన్ని లోకేషన్లలో షూట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా చిన్నపాటి యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ షూటింగ్ లో భాగంగా కారును బ్లాస్ట్ చేసే సీన్ ను తాజాగా చిత్రీకరించారు. ఈ క్రమంలో కారు గాల్లోకి ఎగరాల్సిన దానికంటే 151 అడుగులు పైకి లేసి కింద పడింది. అయినా కారు అనుకున్న చోట పడలేదు. 
 

78

దీంతో వెహికిల్ నుజ్జునుజ్జు అయ్యింది. అయితే ఊటీలోని ప్రజా నివాస ప్రాంతాలకు దగ్గరల్లో ఈ షూట్ చేయడంతో  అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇలాంటి సన్నివేశాలు మరోచోట చేయాల్సిందని భావించారు. ఈ స్టంట్ లో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. 

88

యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దర్శకుడు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Agnipariksha: అగ్నిపరీక్ష కంటెస్టెంట్లు ఫైనల్‌.. బిగ్‌ బాస్‌ హౌజ్‌కి వెళ్లే కామనర్స్ వీళ్లే?
Recommended image2
Horror Movies: ఈ 5 సినిమాలు చూస్తే రాత్రి ఒంటరిగా నిద్రపోవడం కష్టమే.. ఒక్కో సీన్‌కి వణుకు పక్కా
Recommended image3
Toxic 5 Days Collections: విజయ్ సినిమా రికార్డు బ్రేక్ చేసిన యశ్‌.. 'టాక్సిక్' కలెక్షన్ల సునామీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved