MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నిన్నటి దాకా టీవీ నటి...ఇప్పుడు 820 కోట్లకి అథిపతి, సంపద వెనక సీక్రెట్ ఏంటి?

నిన్నటి దాకా టీవీ నటి...ఇప్పుడు 820 కోట్లకి అథిపతి, సంపద వెనక సీక్రెట్ ఏంటి?

తన  టీవి రంగంలో నటిగా కెరీర్‌లో  టాప్ పొజీషన్ లో  ఉన్నప్పుడు నటనను విడిచిపెట్టింది. 20 సంవత్సరాలకు పైగా టీవీ పరిశ్రమలో భాగమైన ఆష్కా ..

4 Min read
Surya Prakash
Published : May 05 2024, 02:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
116


మనస్సు ఉండాలే మార్గం ఉంటుంది అనేది కొందరే నమ్ముతారు. తాము ఎంచుకున్న రంగంలో నెంబర్ వన్ కు ఎదుగుతారు. లేకపోతే టీవీ సీరియల్ నటిగా పాపులర్ అయ్యాక ఆ రంగాన్ని విడిచిపెట్టి మహిళా పారిశ్రామిక వేత్తగా కెరీర్ మొదలెట్టి  820 కోట్ల సమ్రాజ్యం స్దాపించటం అంటే మాటలు కాదు. అవి ఇది ఓ మహిళ విజయ గాధే.
 

216

 
ఆష్కా గోరాడియా.. ఆమె కొద్ది కాలం వరకూ ప్రముఖ బుల్లితెర నటి, మోడల్. పియా కా ఘర్, కుకుసమ్, సింధూర్ తేరా నామ్, లాగి తుజ్ సే లగాన్ వంటి పలు హిట్ హిందీ సీరియల్స్ లో నటించి..పేరు ప్రఖ్యాతులు సంపాందించింది ఆష్కా.మోడలింగ్ ను కెరీర్ గా ఎంచుకుని..ఆ తర్వాత బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకుంది ఆష్కా. 

316
aashka goradia

aashka goradia


  తన  టీవి రంగంలో నటిగా కెరీర్‌లో  టాప్ పొజీషన్ లో  ఉన్నప్పుడు నటనను విడిచిపెట్టింది. 20 సంవత్సరాలకు పైగా టీవీ పరిశ్రమలో భాగమైన ఆష్కా ఏప్రిల్ 2021లో తన నటనా వృత్తికి వీడ్కోలు పలికింది. ఆష్కా గొరాడియా అకాల నిష్క్రమణ ఎవరూ ఊహించలేదు. ఆమె నటనను వదిలేస్తున్నాను అన్నప్పుడు కేవలం టీవి ప్రపంచమే కాకుండా ఆమె భారీ అభిమానులు కూడా ఒప్పుకోలేదు. అయితే వ్యాపార ప్రపంచం ఆమెకు ముక్తకంఠంతో స్వాగతం పలికింది. కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలో, ఆమె ఫల్గుణి నాయర్ (నైకా), వినీతా సింగ్ (షుగర్ కాస్మెటిక్స్) మరియు మరెన్నో ప్రముఖ వ్యాపారవేత్తలతో పోటీ పడగలిగింది.
 

416


2002లో అచానక్ 37 సాల్ బాద్ షోతో   ఆష్కా గోరాడియా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.  అయితే కుకుసమ్ లో చేసిన  'కుముద్' పాత్రతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది. ఆ సీరియల్ లో ఆమె నటనకు పూర్తి గుర్తింపు వచ్చింది. అంతే ఆఫర్స్ వచ్చి పడ్డాయి. క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ, సిందూర్ తేరే నామ్ కా, అదాలత్, బాల్ వీర్, నాగిన్, దయాన్ వరస సీరియల్స్ చేసింది. 

516


కేవలం టీవి సీరియల్  నటిగానే కాకుండా, ఆష్కా గొరాడియా వరుసపెట్టి రియాలిటీ షోలలో కూడా నటించింది. మాజీ నటి జెట్ సెట్ గో, కభీ కభీ ప్యార్ కభీ కభీ యార్, మిస్టర్ & మిసెస్ టీవీ, ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 4, బిగ్ బాస్ 6, నాచ్ బలియే 8, కిచెన్ ఛాంపియన్ 5 మరియు ది వంటి షోలలో  పాల్గొంది. 
 

616


ఇక ఆష్కా గోరాడియా టెలివిజన్‌లో చివరిసారిగా 2019 సంవత్సరంలో కనిపించింది. బిజినెస్ ప్రపంచంలోకి వెళ్లిపోయింది. అయితే  ఆమె 2021లో నటన నుండి రిటైర్మెంట్‌ను అధికారికంగా ప్రకటించింది. అప్పటి దాకా ఆమెకు ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. 
 

716

 2020లో ఆష్కా తన మేకప్, బ్యూటీ బ్రాండ్ రెనీ కాస్మటిక్స్‌ని ప్రారంభించింది. నటిగా మారిన వ్యాపారవేత్త గా ఎదుగుదల మొదలైంది. తన కాలేజి స్నేహితులైన ప్రియాంక్ షా , అశుతోష్ వలానితో ఆమె చేతులు కలిపారు.  వారు ముగ్గురూ కలిసి రెనీ కాస్మోటిక్స్ ని ప్రారంభించారు..

816

 ఆష్కా గొరాడియా యొక్క బిజినెస్ పార్టనర్స్ , ప్రియాంక్ షా, అశుతోష్ వలాని కూడా తక్కువ వాళ్లేం కాదు. ప్రసిద్ధ పురుషుల వస్త్రధారణ బ్రాండ్ అయిన  Beardo తో పాపులర్ అయ్యిన వాళ్లే. ప్రియాంక్ షా బియర్డో సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ కాగా, అశుతోష్ బియర్డో సహ వ్యవస్థాపకుడు మరియు CEO.

916


రెనీ కాస్మెటిక్స్‌ యజమానిరాలుగా  ఆమె నటి కన్నా ఎక్కువ యాక్టివ్ గా ఉంటారు.  అశుతోష్ ,  ప్రియాంక్ సహ వ్యవస్థాపకులు కాగా, ఆష్కా సహ వ్యవస్థాపకురాలు, మరియు డైరెక్టర్. కేవలం రెండేళ్ల వ్యవధిలో ఆమె కాస్మెటిక్ బ్రాండ్ రెనీ కాస్మటిక్స్ రూ. 820 కోట్లు.

1016

గ్లామర్ ప్రపంచాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా, ఆష్కా గోరాడియా ఇప్పటికీ పాపులారిటీ చెక్కు చెదరలేదు.  ఆష్కా  బిజినెస్ పార్టనర్స్ ప్రియాంక్ షా , అశుతోష్ వలాని వల్లే ఈ బిజినెస్ వరల్డ్ స్దాపించగలిగాను అంటుంది. వారు కాస్మోటిక్  బ్రాండ్‌ను నిర్మించడంలో నైపుణ్యం కూడా వారి కంపెనీ విజయానికి ఎంతో దోహదపడింది.
 

1116

 బిజినెస్ రిపోర్ట్ ల ప్రకారం, రెనీ కాస్మటిక్స్ దాని సైట్‌లో దాదాపు 200 ఉత్పత్తులను లిస్ట్ చేసింది మరియు Amazon, Nykaa, Flipkart మరియు Myntra వంటి వాటితో కూడా అశోశియేట్ అయ్యింది. ఇది కాకుండా, రెనీ కాస్మెటిక్స్ భారతదేశం అంతటా 650 స్టోర్లను కలిగి ఉంది. ఈ లెక్కలు చాలు  ఈ కాస్మెటిక్ బ్రాండ్ ఎలా పెరుగుతుందో స్పష్టంగా తెలియటానికి. 

1216


మహిళలకు ఆర్థిక స్థిరత్వం చేకూరినప్పుడే వారు తమ హక్కులు, సౌకర్యాలను సాధించుకోగలరు అనేది మనం ఎప్పుడూ చెప్పే మాటే. మహిళలకు సమానావకాశాలు లభిస్తే 2025కల్లా భారత జీడీపీకి అదనంగా రూ.63.8లక్షల కోట్ల సంపద చేకూరుతుందంటున్నాయి మన నివేదకలు. మెంటార్‌షిప్‌, లీడర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లను నిర్వహించడం, నెట్‌వర్కింగ్‌, సపోర్టింగ్‌ గ్రూపుల ఏర్పాటు, ఫ్లెక్సిబుల్‌ వర్క్‌పాలసీలను అమలుచేయడం వంటివాటి ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో స్త్రీల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుతున్నారు.

1316


మహారాణిలా ఆలోచించండి. ఆమె ఎప్పుడూ అపజయాలకు భయపడదు. ఓటమిని కూడా విజయానికి సోపానంగా చేసుకుంటుంది. అంటూ సుప్రసిద్ధ అమెరికన్‌ టీవీ వ్యాఖ్యాత ఓప్రా విన్‌ఫ్రే మాటలను ఎప్పుడూ గుర్తు చేస్తుంటారు ఆమె. అదే ఆమె సక్సెస్ కు కారణం అంటుంది.
 

1416
Image: Aashka Goradia/Instagram

Image: Aashka Goradia/Instagram


ఆష్కా గొరాడియా పర్శనల్ విషయానికి వస్తే ... ప్రేమించిన  బ్రెంట్ గోబుల్‌ నే  వివాహం చేసుకుని  సంతోషంగా ఉంది. , అతను ఒక అమెరికన్ వ్యాపారవేత్త. వీరిద్దరూ 2016లో కలుసుకున్నారని , పెళ్లికి ముందు ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం డేటింగ్ చేశారని తెలిసింది. ఆష్కా మరియు బ్రెంట్ డిసెంబర్ 1, 2017న క్రైస్తవ వివాహ వేడుకలో వివాహం చేసుకున్నారు.

1516
Image: Aashka Goradia/Instagram

Image: Aashka Goradia/Instagram


ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట, ఆష్కా గోరాడియా,  బ్రెంట్ గోబ్లే, డిసెంబర్ 3, 2017న సాంప్రదాయ హిందూ వివాహాన్ని కూడా చేసుకున్నారు. వారి సంతోషకరమైన వైవాహిక జీవితం కొన్ని సంవత్సరాల తర్వాత, ఆష్కా వారి మొదటి బిడ్డతో గర్భవతి అయింది. మే 2023లో ఆష్కా తాను ప్రెగ్నెంట్ గా ఉన్నానని ప్రకటించినప్పుడు అభిమానులు ఆనందంతో విషెష్ తెలిపారు.

1616
Image: Aashka Goradia/Instagram

Image: Aashka Goradia/Instagram

ఆష్కా గోరాడియా,  బ్రెంట్ గోబుల్ భారతదేశంలోని హాటెస్ట్ జంటలలో ఒకరు. లవ్‌బర్డ్‌లు .  ఈ భామ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది.  వారి సంబంధిత ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లను ఒక్కసారి చూడండి, మరియు వారి లవ్ లీ ఫొటోలతో  ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటం గమనించవచ్చు.  ఈ జంటతో మీరు ప్రేమలో పడతారు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved