MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • ధోనీ అలా చెప్పి నన్ను మోసం చేశాడు, ఏం జరుగుతుందో తెలిసేలోపు... వృద్ధిమాన్ సాహా కామెంట్స్...

ధోనీ అలా చెప్పి నన్ను మోసం చేశాడు, ఏం జరుగుతుందో తెలిసేలోపు... వృద్ధిమాన్ సాహా కామెంట్స్...

ఎమ్మెస్ ధోనీ... టీమిండియా చరిత్ర గురించి చెప్పాలంటే మాహీకి ముందు, మాహీ తర్వాత అని విడదీసి చెప్పాలంటారు ఆయన అభిమానులు. భారత క్రికెట్‌పై అంతలా ప్రభావం చూపించిన ధోనీ కారణంగా దినేశ్ కార్తీక్, వృద్ధిమాన్ సాహా, రాబిన్ ఊతప్ప, షెల్డన్ జాక్సన్, పార్థివ్ పటేల్ వంటి వికెట్ కీపింగ్ బ్యాటర్లు సరైన అవకాశాలు దక్కించుకోలేకపోయారు... 

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Apr 18 2022, 01:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

2004లో ఎంట్రీ ఇచ్చి, పాకిస్తాన్‌పై భారీ సెంచరీతో టీమ్‌లో స్థిరమైన చోటు దక్కించుకున్న మహేంద్ర సింగ్ ధోనీ... 2007లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి మూడు ఐసీసీ టైటిల్స్ సాధించాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

భారత జట్టులో మహేంద్రుడు ఓ మహా వృక్షంలా పాతుకుపోవడంతో మిగిలిన వికెట్ కీపింగ్ బ్యాటర్లు దేశవాళీ క్రికెట్‌లో ఎంతగా రాణించినా, చెప్పుకోదగ్గ అవకాశాలను దక్కించుకోలేకపోయాడు...

310

మాహీ కారణంగా టీమిండియాకి ఎక్కువ కాలం సెకండ్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా మిగిలిపోయిన వృద్ధిమాన్ సాహా, తాజాగా ధోనీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు...

410

‘నా కెరీర్‌ మాహీ వల్ల సరిగ్గా సాగలేదని చాలామంది అంటుంటారు. ఒకవేళ అది నిజం అయినా ధోనీ లాంటి ప్లేయర్‌ వల్ల చోటు కోల్పోవడం కూడా గర్వించదగ్గ విషయమే..

510

మాహీతో ఆడిన ప్రతీ మూమెంట్‌ని నేను ఎంతగానో ఎంజాయ్ చేశాను. ఓ క్లబ్ మ్యాచ్‌ సమయంలో నేను, ధోనీ కలిసి ఓపెనింగ్ చేశాం...

610

నేను 36 పరుగుల వద్ద ఉన్నా, మాహీ 9 పరుగులతో ఉన్నాడు. అప్పుడు తను నా దగ్గరికి వచ్చి ‘సింగిల్ తీసి, నాకు స్ట్రైయిక్ ఇవ్వు...’ అని చెప్పా. నేను అలాగే చేస్తూ పోయా...

710

అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపు నేను ఇంకా 41 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తూనే ఉన్నా... మాహీ సెంచరీ పూర్తి చేసేసుకున్నాడు...
 

810

మాహీ అలా చెప్పి, నన్ను మోసం చేశాడు (నవ్వుతూ...). అయితే ధోనీ గేమ్‌ని ఎలా కంట్రోల్ చేయగలడో చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమే’ అంటూ కామెంట్ చేశాడు వృద్ధిమాన్ సాహా...

910

ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందు భారత క్రికెట్ బోర్డుపై, సెలక్టర్ల తీరుపై అసహనం వ్యక్తం చేసిన వృద్ధిమాన్ సాహా... శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు...

1010

ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరుపున ఆడుతున్న వృద్ధిమాన్ సాహా, చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఓపెనింగ్ చేసి 18 బంతుల్లో 11 పరుగులు చేసి నిరాశపరిచాడు. 

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Recommended image2
IND vs SL: 5వ రోజు క్లైమాక్స్ మామూలుగా ఉండదు.. శ్రీలంక 16 రన్స్ లీడ్, భారత్‌కు 4 వికెట్లే బాకీ
Recommended image3
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved