MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • విరాట్... బాగా అలిసిపోయావ్! ఆరు నెలలు బ్రేక్ తీసుకో... పీటర్సన్ సలహా..

విరాట్... బాగా అలిసిపోయావ్! ఆరు నెలలు బ్రేక్ తీసుకో... పీటర్సన్ సలహా..

‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ తర్వాత క్రికెట్ వరల్డ్‌ని ఏలిన మకుఠం లేని మహారాజు ‘కింగ్’ విరాట్ కోహ్లీ... అయితే దశాబ్దంన్నర పాటు పరుగుల ప్రవాహం పారించిన ఈ రన్‌ మెషిన్‌... ఇప్పుడు కాస్త నెమ్మదించింది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Apr 20 2022, 12:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇప్పటిదాకా 7 మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ, రెండు సార్లు రనౌట్ అయ్యాడు. కేవలం 19.83 సగటుతో 119 పరుగులు మాత్రమే చేయగలిగాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న విరాట్ కోహ్లీ, బ్యాటింగ్‌లో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు విరాట్ కోహ్లీ...

310

విరాట్ బ్యాటు నుంచి భారీ ఇన్నింగ్స్ వస్తుందని, ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. రెండున్నరేళ్లుగా సెంచరీ అందుకోలేకపోయిన విరాట్, తన మార్కు ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేకపోయాడు...

410

కోహ్లీ పరుగుల వరద పారించినప్పుడు ‘కింగ్’ కోహ్లీ, ‘రన్ మెషిన్’ అంటూ పొడిగిన నోళ్లే, ఇప్పుడు విరాట్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఇక రిటైర్మెంట్ తీసుకుంటే బెటర్ అంటూ సలహాలు కూడా ఇస్తున్నాయి...

510

తాజాగా భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ ఫామ్ గురించి స్పందించాడు. ‘విరాట్ కోహ్లీ బాగా అలిసిపోయినట్టు కనిపిస్తున్నాడు. అతనికి విశ్రాంతి అవసరం. విరాట్ బ్రేక్ తీసుకుని, కమ్‌బ్యాక్ ఇవ్వాలి...’ అంటూ కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్...

610

‘అవును, సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్లతో నేను నూరు శాతం అంగీకరిస్తున్నారు. పెళ్లి, పిల్లలు, మీడియా, కెప్టెన్సీ రాజీనామా.. కారణాలేమైతేనేమీ విరాట్ బాగా అలిసిపోయాడు. అతనికి విశ్రాంతి అవసరం...

710

దాదాపు ఆరు నెలల పాటు క్రికెట్ బూట్స్‌ని పక్కనబెట్టేస్తే బెటర్. సోషల్ మీడియాకి దూరంగా వెళ్లి, మళ్లీ కొత్తగా, రెట్టింపు ఉత్సాహంతో రీఎంట్రీ ఇస్తే చూడాలని ఉంది...

810

మళ్లీ స్టేడియాల్లో జనం నిండుగా కనిపిస్తున్నప్పుడు విరాట్ షో చూడాలని అనుకుంటున్నా... విరాట్ ఎప్పుడు తప్పుకున్నా, అతనికి జట్టులో చోటు తప్పకుండా ఉంటుంది...

910

మరో ఏడాది, రెండేళ్లు... మూడేళ్ల తర్వాత విరాట్ కోహ్లీ ఆడాలని అనుకున్నా... టీమిండియా సాదరంగా ఆహ్వానిస్తుంది...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కేవిన్ పీటర్సన్...

1010

ఆర్‌సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్ మాత్రం... విరాట్ కోహ్లీ బ్యాటు నుంచి ఓ భారీ ఇన్నింగ్స్ త్వరలోనే రాబోతుందని, దాన్ని ఎంజాయ్ చేసేందుకు ఆశగా ఎదురుచూస్తున్నానని కామెంట్ చేయడం విశేషం. 

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Recommended image2
IND vs SL: 5వ రోజు క్లైమాక్స్ మామూలుగా ఉండదు.. శ్రీలంక 16 రన్స్ లీడ్, భారత్‌కు 4 వికెట్లే బాకీ
Recommended image3
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved