MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • చాహాల్, పాండ్యా పక్కా! ఉమ్రాన్ మాలిక్‌కి ఛాన్స్, దినేశ్ కార్తీక్ డౌట్! టీ20 వరల్డ్ కప్ జట్టు ఎలా ఉండనుంది..

చాహాల్, పాండ్యా పక్కా! ఉమ్రాన్ మాలిక్‌కి ఛాన్స్, దినేశ్ కార్తీక్ డౌట్! టీ20 వరల్డ్ కప్ జట్టు ఎలా ఉండనుంది..

ఐపీఎల్ 2022 సీజన్‌ దాదాపు సగానికి చేరుకుంది. టీఆర్పీ రికార్డులు బ్రేక్ కాకపోయినా, ఫ్యాన్ బేస్ భారీగా ఉన్న ఫ్రాంఛైజీలు విజయాల బాట పట్టకున్నా... క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ టన్నుల్లో అందిస్తోంది ఐపీఎల్. అక్టోబర్‌లో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడే జట్టును నిర్ణయించనుంది ఐపీఎల్ 2022 సీజన్...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Apr 19 2022, 06:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114

కారణం ఏమైనా యజ్వేంద్ర చాహాల్ లేకుండా టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఆడి భారీ మూల్యం చెల్లించుకుంది టీమిండియా. భారీ ఆశలు, అంచనాలు పెట్టుకున్న వరుణ్ చక్రవర్తి, అట్టర్ ఫ్లాప్ అయ్యాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214

ఐపీఎల్ 2022 సీజన్‌లో పర్పుల్ క్యాప్ రేసులో దూసుకుపోతున్న యజ్వేంద్ర చాహాల్, ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో చోటు ఖాయం చేసుకున్నాడు. గాయం, లేదా మరేదైనా వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటే తప్ప, చాహాల్... టీ20 వరల్డ్ కప్‌ ఆడడం గ్యారెంటీ...

314

గత సీజన్‌లలో కేకేఆర్‌ రిజర్వు బెంచ్‌లో మగ్గిపోయిన కుల్దీప్ యాదవ్, ఈ సీజన్‌లో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చాడు. తన చైనామెన్ యాక్షన్‌తో అదరగొడుతున్న కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహాల్‌తో కలిసి బరిలో దిగే అవకాశం ఉంది... అయితే జడేజా కాకుండా ఇద్దరు స్పిన్నర్లతో ఆడాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తేనే కుల్దీప్ బరిలో దిగుతాడు...

414

గాయం నుంచి పూర్తిగా కోలుకోకముందే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఆడాడు ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా. వరల్డ్ కప్‌ తర్వాత పూర్తిగా నాలుగు నెలల పాటు విశ్రాంతి తీసుకున్న హార్దిక్ పాండ్యా, ఐపీఎల్ 2022 సీజన్‌లో అదరగొడుతున్నాడు...

514

అటు బాల్‌తో, ఇటు బ్యాటింగ్‌తో, మరోపక్క ఫీల్డింగ్, ఇంకో పక్క కెప్టెన్సీలోనూ తనదైన మార్కు చూపిస్తున్న హార్ధిక్ పాండ్యా... టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడడం గ్యారెంటీ. అయితే అతను పూర్తి ఫిట్‌ ఉంటేనే ఇది వీలవుతుంది...

614

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆర్‌సీబీకి ఫినిషర్‌గా మారాడు సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్. 37 ఏళ్ల వయసులో భారీ షాట్లతో మ్యాచ్‌లను మలుపు తిప్పుతున్న దినేశ్ కార్తీక్‌పై సెలక్టర్లు ఎంత నమ్మకం ఉంచుతారనేది హాట్ టాపిక్‌గా మారింది..

714

ఇప్పటికే ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, సంజూ శాంసన్ వంటి యంగ్ వికెట్ కీపింగ్ బ్యాటర్లు టీమిండియాలో ఉన్నారు. వీరితో పాటు దినేశ్ కార్తీక్‌కి టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో చోటు దక్కడం అనుమానమే...

814

అయితే ఐపీఎల్ 2022 సీజన్ ఆసాంతం దినేశ్ కార్తీక్ ఇదే రకమైన పర్ఫామెన్స్ ఇస్తే మాత్రం, సెలక్టర్లు... ఈ సూపర్ సీనియర్‌పై కరుణ చూపించవచ్చు...

914

ఉమ్రాన్ మాలిక్... ఐపీఎల్ 2022 సీజన్‌లో సెన్సేషన్‌గా మారాడు. సగటున 150+ కి.మీ.ల వేగంతో బుల్లెట్ బంతులు వేస్తున్న ఉమ్రాన్ మాలిక్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడతాడని చెప్పడం కష్టమే...
 

1014

ఎందుకంటే ఇప్పటికే భారత జట్టులో జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్ వంటి సీనియర్ బౌలర్లు ఉన్నారు. వీరితో పాటు దీపక్ చాహార్ కూడా వరల్డ్ కప్ సమయానికి అందుబాటులోకి రావచ్చు...

1114

ఐపీఎల్ 2022 సీజన్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్న టీ నటరాజన్ కూడా ఉమ్రాన్ మాలిక్‌కి పోటీగా రావచ్చు. ఇంతమంది పేస్ బౌలింగ్ ఆప్షన్లలో ఉమ్రాన్ మాలిక్, తుదిజట్టులో చోటు దక్కించుకోవాలంటే... అతని నుంచి నిలకడైన ప్రదర్శన రావాల్సిందే...

1214

హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడతాడని భావించారు కొందరు క్రికెట్ విశ్లేషకులు. అయితే ఐపీఎల్ 2022 టోర్నీలో అతని పర్ఫామెన్స్ ఏ మాత్రం ఆశాజనకంగా లేదు...  కాబట్టి సిరాజ్ మియ్యా, టీ20 వరల్డ్ కప్ ఆడాలంటే ఇకపై బంతితో ఫైరింగ్ పర్ఫామెన్స్ ఇవ్వాలి...

1314

ప్రసిద్ధ్ కృష్ణ... ఐపీఎల్ ద్వారా టీమిండియాలోకి వచ్చిన యంగ్ పేసర్, పరుగులు ఎక్కువే ఇస్తాడు, వికెట్లు ఎక్కువే తీస్తాడు. ప్రసిద్ధ్ కృష్ణ కూడా సెలక్టర్ల దృష్టిలో ఉన్నాడు. అయితే సీనియర్లతో పోటీపడి వరల్డ్ కప్ ఆడే ఫ్లైట్ ఎక్కాలంటే ప్రసిద్ధ్ కృష్ణ నుంచి కొన్ని బెస్ట్ స్పెల్స్ రావాలి... 

1414

గాయం కారణంగా జట్టుకి దూరమై, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఆడలేకపోయిన శ్రేయాస్ అయ్యర్... బ్లూ జెర్సీలో ఆకట్టుకున్నాడు. కేకేఆర్ కెప్టెన్‌గానూ నిలకడైన పర్ఫామెన్స్ ఇస్తున్నాడు... సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ ఆస్ట్రేలియా ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Recommended image2
IND vs SL: 5వ రోజు క్లైమాక్స్ మామూలుగా ఉండదు.. శ్రీలంక 16 రన్స్ లీడ్, భారత్‌కు 4 వికెట్లే బాకీ
Recommended image3
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved