Best Diesel Cars : రూ.10 లక్షల బడ్జెట్‌లో బెస్ట్ డీజిల్ కార్లు ఇవే
ఇప్పుడు పెట్రోల్, ఈవీ కార్ల హవా నడుస్తున్నా.. లాంగ్ జర్నీలు చేసేవాళ్లకు డీజిల్ కార్లే బెస్ట్ ఆప్షన్. అందుకే రూ.10 లక్షల బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ డీజిల్ కార్ల లిస్ట్ మీకోసమే.

తక్కువ ధరలో డీజిల్ కార్లు
మార్కెట్ లో పెట్రోల్, ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతుంటే డీజిల్ కార్ల సంఖ్య తగ్గుతోంది. అయితే రోజూ ఎక్కువ దూరం ప్రయాణించేవాళ్లు, హైవేలపై ఎక్కువగా డ్రైవ్ చేసేవాళ్లు, ఎక్కువ టార్క్ కోరుకునేవాళ్లకు డీజిల్ కార్లపై ఆసక్తి తగ్గలేదు. ఈ నేపథ్యంలో రూ.10 లక్షల లోపు డీజిల్ కారు కొనాలనుకునే వాళ్లకు కొన్ని మంచి ఆప్షన్లు ఉన్నాయి. వాటిలో టాటా ఆల్ట్రోజ్, మహీంద్రా బొలెరో, టాటా నెక్సాన్, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ముఖ్యమైనవి.
టాటా ఆల్ట్రోజ్
తక్కువ బడ్జెట్‌లో డీజిల్ కారు కావాలంటే టాటా ఆల్ట్రోజ్ బెస్ట్ ఆప్షన్. ఇది చిన్న కారు కాబట్టి సిటీ ట్రాఫిక్‌లో నడపడం సులభం. అదే సమయంలో ఫ్యామిలీతో లాంగ్ ట్రిప్స్‌కు కూడా బాగుంటుంది. ఐదుగురు కూర్చునే వీలున్న ఈ కారు, రూ.10 లక్షల లోపు డీజిల్ కారు కోసం చూసేవాళ్లను బాగా ఆకర్షిస్తుంది.
ఎక్కువ స్పేస్, దృఢమైన నిర్మాణం కావాలనుకుంటే మహీంద్రా బొలెరోను చూడొచ్చు. కొత్త బొలెరో ధర రూ.7.99 లక్షల నుంచి రూ.9.69 లక్షల మధ్యలో ఉంది. ఇందులో ఏడుగురు కూర్చోవచ్చు.
టాటా నెక్సాన్
చిన్న సైజులో మంచి SUV కావాలనుకునే వారికి టాటా నెక్సాన్ మరో ముఖ్యమైన ఆప్షన్. ఫ్యామిలీ వాడకానికి, సిటీ ప్రయాణాలకు, లాంగ్ జర్నీలకు.. ఇలా అన్ని రకాల అవసరాలకు ఇది సరిగ్గా సరిపోతుంది.
ఇక మంచి ఫీచర్లతో పాటు డీజిల్ ఇంజిన్ కావాలనుకునే వారికి కియా సోనెట్ సరైనది. దీని 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 250 న్యూటన్ మీటర్ల టార్క్‌ను అందిస్తుంది. ఇందులో డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, పవర్‌ఫుల్ డీజిల్ ఇంజిన్ కోరుకునే వారిని ఆకర్షించే మరో మోడల్. ముఖ్యంగా హైవేలపై ఎక్కువ దూరం ప్రయాణించే వారికి దీని అధిక టార్క్ ఇంజిన్ బాగా ఉపయోగపడుతుంది.
అయితే రూ.10 లక్షలు అనేది కేవలం ఎక్స్-షోరూమ్ ధర మాత్రమేనని కస్టమర్లు గుర్తుంచుకోవాలి. రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ఇతర ఛార్జీలు రాష్ట్రాలను బట్టి మారతాయి. కాబట్టి, కొనే ముందు షోరూమ్‌లో కరెక్ట్ ధరను నిర్ధారించుకోవడం ముఖ్యం.
ఉత్తమ డీజిల్ కార్లు
మొత్తంగా చూస్తే తక్కువ ధరలో చిన్న డీజిల్ కారు కోసం చూసేవాళ్లు ఆల్ట్రోజ్‌ను పరిశీలించవచ్చు. ఏడుగురు ప్రయాణించటానికి, రఫ్ వాడకానికి బొలెరో సరైనది. మంచి ఫీచర్లతో కూడిన కాంపాక్ట్ SUV కావాలంటే నెక్సాన్ లేదా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓలను పోల్చి చూడొచ్చు. డీజిల్ ఆటోమేటిక్ కారు కావాలంటే సోనెట్ బెస్ట్ ఆప్షన్. అయితే, డీజిల్ కారును ఎంచుకునే ముందు మీ నెలవారీ ప్రయాణ దూరం, సిటీ, హైవే వాడకాన్ని లెక్కలోకి తీసుకోవడం మంచిది.

