MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • International
  • Fake Doctors : పాకిస్థాన్ మొత్తం శంకర్ దాదా ఎంబిబిఎస్ లే.. ఎంతమంది నకిలీ డాక్టర్లున్నారో తెలుసా?

Fake Doctors : పాకిస్థాన్ మొత్తం శంకర్ దాదా ఎంబిబిఎస్ లే.. ఎంతమంది నకిలీ డాక్టర్లున్నారో తెలుసా?

Fake Doctors in Pakistan : మన దాయాది దేశం పాకిస్థాన్ లో MBBS చదివిన డాక్టర్ల కంటే అడ్డదారిలో డాక్టర్లుగా మారిన శంకర్ దాదా ఎంబిబిఎస్ లే ఎక్కువగా ఉన్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశ అధికారులే వెల్లడిస్తున్నారు. 

2 Min read
Author : Arun Kumar P
Published : Jan 23 2026, 08:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పాకిస్థాన్ లో ఇదీ పరిస్థితి..
Image Credit : Gemini AI

పాకిస్థాన్ లో ఇదీ పరిస్థితి..

Fake Doctors : 'యదా రాజ తదా ప్రజ'... అంటే పాలించేవారు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారని పెద్దతు చెబుతుంటారు. మన పక్కదేశం పాకిస్థాన్ లో సేమ్ ఇలాంటి పరిస్థితే నెలకొంది.. అసమర్ధ పాలన కారణంగా ఫేక్ డాక్టర్లు విచ్చలవిడిగా పుట్టుకువస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ చివరకు దేశ ఆరోగ్య వ్యవస్థనే సంక్షోభంలోకి నెట్టారు ఈ నకిలీ డాక్టర్లు. చెతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు జరగాల్సిన నష్టం జరిగిపోయాక ఇప్పుడు పాక్ పాలకులు నష్టనివారణ చర్యలు చేపట్టారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పాకిస్థాన్ కు నకిలీ డాక్టర్ల బెడద
Image Credit : Getty

పాకిస్థాన్ కు నకిలీ డాక్టర్ల బెడద

పాకిస్థాన్ మెడికల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అబ్దుల్ గఫూర్ షోరో ప్రకారం... వందలు వేలలో కాదు ఏకంగా లక్షల్లో నకిలీ డాక్టర్లు ఉన్నారట. పాకిస్థాన్ వ్యాప్తంగా దాదాపు 6 లక్షల మందికి పైగా ఫేక్ డాక్టర్లు ప్రజలకు తెలిసీతెలియని వైద్యం అందిస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తెలిపారు. సింద్ హెల్త్ కేర్ కమీషన్ (SHCC), పాకిస్థాన్ మెడికల్ ఆండ్ డెంటల్ కౌన్సిల్ కూడా నకిలీ డాక్టర్ల వ్యవహారాన్ని ధృవీకరిస్తున్నాయి.

35
పాకిస్థాన్ లో సెల్ఫ్ మేడ్ డాక్టర్లు
Image Credit : Getty

పాకిస్థాన్ లో సెల్ఫ్ మేడ్ డాక్టర్లు

''కొన్నిరోజులు హాస్పిటల్స్, మరికొన్నిరోజులు మెడికల్స్ లో పనిచేసి బేసిక్ ట్రీట్మెంట్, మెడిసిన్స్ గురించి తెలుసుకుంటున్నారు. తర్వాత ఎలాంటి మెడికల్ డిగ్రీ లేకపోయినా సొంతంగా క్లినిక్స్ ఓపెన్ చేసి సొంతగా వైద్యం చేయడం ప్రారంభిస్తున్నారు. ట్రీట్మెంట్, ఇచ్చే మందులవల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్ గురించి వారికి ఏమాత్రం తెలియదు. వైద్యపరికరాలను శుభ్రం చేయకుండా వాడటమే కాదు ఒకరికి ఇంజెక్ట్ చేసిన సిరంజీలనే మరొకరికి వాడుతున్నారు. దీనివల్ల హెపటైటిస్ తో పాటు AIDS వ్యాప్తి చెందుతోంది'' అని అబ్దుల్ గఫూర్ ఆందోళన వ్యక్తం చేశారు.

45
బలహీన చట్టాలతో పుట్టగొడుగుల్లా నకిలీ క్లినిక్స్
Image Credit : Getty

బలహీన చట్టాలతో పుట్టగొడుగుల్లా నకిలీ క్లినిక్స్

నకిలీ డాక్టర్ల వ్యవహారాన్ని పాక్ పాలకులు సీరియస్ గా తీసుకోవడంలేదు. అందుకే అక్రమ ఆసుపత్రులను మూసివేసిన మరుసటి రోజే కొత్తవి తెరుస్తున్నారు. బలహీనమైన చట్టాల వల్ల నిందితులు సులభంగా బెయిల్‌పై బయటకు వస్తున్నారు. తనిఖీ బృందాలకు బెదిరింపులు కూడా వస్తున్నాయి. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు ప్రధాన నగరాల్లో కూడా నకిలీ డాక్టర్లు, కనీస సౌకర్యాలు లేని క్లినిక్ లు కనిపిస్తాయట.

55
పాకిస్థాన్ లో పెరిగిన ఎయిడ్స్ కేసులు
Image Credit : Freepik

పాకిస్థాన్ లో పెరిగిన ఎయిడ్స్ కేసులు

పాకిస్థాన్ లో ప్రస్తుతం HIV, AIDS కేసులు భారీగా పెరిగాయి.. ఇందుకు నకిలీ డాక్టర్లే కారణంగా తెలుస్తోంది. సరిగ్గా శుభ్రంచేయని వైద్యపరికరాలు, శానిటైజ్ చేయని ఇంజెక్షన్స్. సరైన వైద్యపద్దతులు పాటించకపోవడం వల్లే ఎయిడ్స్ కేసులు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా అంతర్జాతీయ బృందాలు దర్యాప్తులో తేలింది. కాసులకోసం కక్కుర్తితో వైద్యులుగా మారిన కేటుగాళ్లు వళ్ల అభంశుభం తెలియని చిన్నారులు కూడా ఎయిడ్స్ బారిన పడుతున్నారట. కాబట్టి పాకిస్థాన్ ప్రభుత్వం వెంటనే వైద్యారోగ్య వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
పాకిస్తాన్
ప్రపంచం
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్
ఆరోగ్యం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?
Recommended image2
అమెరికాలో ఇళ్ల బయట జనం ఎందుకు కనిపించరు.? ఇంతకీ వాళ్లేం చేస్తుంటారు.?
Recommended image3
Trump Tariffs: రష్యా ఆయిల్ కొంటే భారత్‌పై 100% టారిఫ్? ట్రంప్ చేతికి డెడ్లీ వెపన్ ఇచ్చిన అమెరికా పార్లమెంట్
Related Stories
Recommended image1
Pakistan : సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం.. అమెరికాలో పాక్ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
Recommended image2
Pakistan: పాకిస్థాన్‌లో మైక్రోసాఫ్ట్ ఉందని తెలుసా.? ఇప్పుడు ఆ కంపెనీ ప‌రిస్థితి ఏంటంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved