MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • IMD Rain Alert : అల్పపీడనం ఎఫెక్ట్ తో హెవీ రెయిన్స్ .. ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్, నేడు అల్లోకల్లోలమే

IMD Rain Alert : అల్పపీడనం ఎఫెక్ట్ తో హెవీ రెయిన్స్ .. ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్, నేడు అల్లోకల్లోలమే

Andhra Pradesh Weather, Telangana Weather : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఏఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయో తెలుసా? 

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 23 2026, 08:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలేే వర్షాలు
Image Credit : X/APSDMA

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలేే వర్షాలు

Rain Alert : ఈ వేసవిలో ఎండల కంటే ముందే వర్షాలు మొదలయ్యాయి... తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు కురుస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో... అటు ఆంధ్ర ప్రదేశ్ లో అనకాపల్లి జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. మరో రెండురోజులు (సోమ, మంగళవారం) కూడా ఇలాగే ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
బంగాళాఖాతంలో అల్పపీడనం
Image Credit : Gemini AI

బంగాళాఖాతంలో అల్పపీడనం

బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. గతవారం ఏకంగా రెండు అల్పపీడనాలు ఏర్పడ్డాయి... ఇందులో ఒకటి బలహీనపడగా ఇంకోటి బలపడుతోంది. ఇలానైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనమే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు కారణం అవుతోంది. ఇది రెండుమూడు రోజులు యాక్టివ్ గా ఉంటుందని... దీని ప్రభావంతో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

37
ఈ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్
Image Credit : X/metcentrehyd

ఈ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్

అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే వర్షాలు మొదలవగా ఇవాళ (ఫిబ్రవరి 23, సోమవారం) తెలంగాణలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

47
హైదరాబాద్ లో వర్షాలు
Image Credit : X/Hyderabad Traffic Police

హైదరాబాద్ లో వర్షాలు

ఇక హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇలా వర్షాలు కురిసే అవకాశాలున్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

57
ఫిబ్రవరి 24న వర్షాలు
Image Credit : Getty

ఫిబ్రవరి 24న వర్షాలు

అల్పపీడనం ప్రభావంతో రేపు (ఫిబ్రవరి 24, మంగళవారం) కూడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట , యాదాద్రి భువనగిరి , నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

67
ఏపీలో వర్షాలు
Image Credit : Getty

ఏపీలో వర్షాలు

ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి... ఇవాళ (ఫిబ్రవరి 23న) కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తోంది ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA). అల్పపీడనం ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇక పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.

77
తెలుగు ప్రజలు తస్మాత్ జాగ్రత్త..
Image Credit : X/APSDMA

తెలుగు ప్రజలు తస్మాత్ జాగ్రత్త..

తెలుగు రాష్ట్రాల్లో కురిసే వర్షాలకు ఈదురుగాలులు, పిడుగులు తోడయి ప్రమాదకరంగా మారే అవకాశాలుంటాయి... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. ముఖ్యంగా వ్యవసాయ పనులు చేపట్టే రైతులు, కూలీలు వర్షాల సమయంలో చెట్లకింద ఉండరాదని సూచిస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిస్తున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
విజయవాడ
విశాఖపట్నం
తిరుపతి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Recommended image2
Farmer ID: రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్, రైతు భరోసా ఆగిపోవద్దంటే వెంటనే ఇలా చేయండి
Recommended image3
Heavy Rains Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో వారం రోజులు వర్షాలే వర్షాలు
Related Stories
Recommended image1
Rain Alert : నేడే బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ తెలుగు జిల్లాల్లో ఇక వర్షబీభత్సమే
Recommended image2
Rain Alert: దూసుకొస్తున్న అల్ప‌పీడ‌నం.. ఈ ప్రాంతాల్లో ఉరుముల‌తో కూడిన‌ భారీ వ‌ర్షాలు, అల్లకల్లోలం ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved