Asianet News TeluguAsianet News Telugu

108ఎంపీ కెమెరాతో రిలీజ్ కానున్న షియోమి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్...ధర ఎంతో తెలుసా ?

 షియోమి బ్రాండ్ ఎం‌ఐ ఒక కొత్త లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయాలనుకుంటుంది. చాలా రోజుల నుంచి స్మార్ట్ ఫోన్ ప్రియులకు ఎంతగానో ఉరిస్తున్న ఈ ఫోన్ ని జనవరిలో లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. 

xiaomi set to launch  new 108mp camera smart phone in january
Author
Hyderabad, First Published Jan 6, 2020, 11:09 AM IST

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీ షియోషి ఇండియాలో అతి తక్కువ సమయంలో స్మార్ట్ ఫోన్స్ రంగంలో మంచి గుర్తింపు పొందింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం షియోమి బ్రాండ్ ఎం‌ఐ ఒక కొత్త లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయాలనుకుంటుంది. చాలా రోజుల నుంచి స్మార్ట్ ఫోన్ ప్రియులకు ఎంతగానో ఉరిస్తున్న ఈ ఫోన్ ని జనవరిలో లాంచ్ చేయనున్నట్లు తెలిపింది.

షియోమి ఎం‌ఐ నోట్ 10 జనవరిలో విడుదలవుతున్నట్లు స్మార్ట్ ఫోన్ టెక్ నిపుణులు కూడా చెబుతున్నారు. నవంబర్ నెలలో  చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం షావోమి ఎం‌ఐ నోట్ 10 స్మార్ట్‌ ఫోన్ ను  ప్రపంచవ్యాప్తంగా  సుమారు రూ. 43,205 ప్రైస్ తో  విడుదల చేసింది. నవంబర్ నెలలో ఇండియాలో విడుదల కావాల్సి ఉన్నా కానీ విడుదల చేయలేదు. అయితే తాజాగా ఈ ఫోన్ ను న్యూఇయర్ సందర్భంగా జనవరి నెలలో విడుదల చేస్తున్నారనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

also read ఆపిల్ నుండి రెండు కొత్త మోడళ్ స్మార్ట్ ఫోన్లు

కంటికి కనిపించే దృశ్యాల్ని నోట్ 10తో  ఎప్పుడెప్పుడు క్యాప్చర్ చేయాలా అని ఎదురు చూసేంతాలా ఫోన్ వెనుకభాగంలో 108మెగా ఫిక్సల్ క్వాలిటీతో పెంటా కెమెరా సెటప్ తో ఉన్న ఈ ఫోన్ త్వరలో విడుదలవుతున్నట్లు షియోమి ఇండియా సంస్థ ట్వీట్ చేసింది. అంతేకాదు 108ఎంపీ ఈజ్ కమింగ్ అని ట్వీట్ చేయడంతో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు  ఎం‌ఐ నోట్10 గురించి తెలుసుకునేందుకు చాలా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. 

షియోమి ఎం‌ఐ డిజైన్ - స్పెసిఫికేషన్ల విషయానికొస్తే  స్మార్ట్‌ఫోన్ 6.47-అంగుళాలు, ఎఫ్‌హెచ్‌డి అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంది. దీని పై భాగంలో వాటర్‌డ్రాప్ నాచ్ ఉంది.  32 ఎంపీ సెల్ఫీ కెమెరా.  ప్రీమియం గ్లాస్ బాడీని గొరిల్లా గ్లాస్ - 5 తో డిజైన్ చేసి ఉంది.  16ఎం కలర్స్ తో అమోలెడ్ డిస్ ప్లే టచ్ స్క్రీన్ తో డిజైన్ చేసి ఉంటుంది.

 స్క్రీన్ టు బాడీ రేషియో 87.8%, డిస్ ప్లే రెజెల్యూషన్ 1080 x 2340 పిక్సెల్స్,  యాస్పెక్ట్ రేషియో 19.5: 9,  ఫోన్ పిక్సెల్ డెన్సిటీ 398 పిపిఐ కలిగి ఉంది.  కార్నింగ్ గొరిల్లా గ్లాస్ - 5  ఫోన్ పై ఎటువంటి గీతలుపడకుండా కాపాడుతుంది. ఫోన్  డిస్ ప్లే  600 బ్రైట్ నెస్ తో పాటు   అరోరా గ్రీన్, వైట్,  మిడ్ నైట్  బ్లాక్ రంగులలో లభిస్తుంది. ఫోన్ 157.8 x 74.2 x 9.7ఎం‌ఎం కొలతలు కలిగి ఉండి  208 గ్రాముల బరువు ఉంటుంది.

xiaomi set to launch  new 108mp camera smart phone in january

కెమెరా - ఫోన్ వెనుక వైపు పెంటా కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీనిలో 108 ఎంపీ  కెమెరాతో పాటు 20ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 12ఎంపీ టెలిఫోటో సెన్సార్, సెకండరీ 5 ఎంపీ  టెలిఫోటో సెన్సార్, 52ఎంపీ మ్యాక్రో కెమెరాతో డిజైన్ చేసి ఉంటుంది.  షియోమి 108 ఎంపీ  శాంసంగ్   ఐసోసెల్ హెచ్‌ఎమ్‌ఎక్స్ బ్రైట్ సెన్సార్‌ను ఉపయోగించింది. ఇది ఇతర సెన్సార్ల కంటే ఫుల్ హెచ్‌డి క్వాలిటీ ఫోటోలు తీయోచ్చని  సంస్థ ప్రతినిధులు తెలిపారు.

షియోమి ఎం‌ఐ నోట్ 10లో 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.  స్క్రీన్ పైభాగంలో వాటర్‌డ్రాప్ నాచ్ ను కలిగి ఉంటుంది.  షియోమి ఎం‌ఐ నోట్ 10 ధర ఐరోపాలో సుమారు రూ .42000,  వన్‌ప్లస్ 7 టీతో పాటు ఇతర గేమింగ్ ఫోన్‌లతో  పోటీ పడుతూ భారత్ లో ఈ ఫోన్ ను తక్కువ ధరకే అమ్మే అవకాశం ఉందని తెలుస్తోంది.

బ్యాటరీ, స్టోరేజ్: ఈ ఫోన్ బ్యాటరీ  5,260ఎంఏహెచ్ తో  30డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అందిస్తుంది. కేవలం 30 నిమిషాల్లో ఫోన్‌ను 58%, 65 నిమిషాల్లో 100% ఛార్జింగ్ కంప్లీట్ అవుతుంది.   128 జీబీ  ఇంటర్నల్ స్టోరేజ్ , 30డబ్ల్యూ అడాప్టర్‌తో క్యారీచేసేందుకు వీలుగా ఉంటుంది.


కనెక్టివిటీ: ఎం‌ఐ నోట్ 10 కింది భాగంలో  హెడ్‌ఫోన్ జాక్ ఉంటుంది.  జీపీఎస్,  బ్లూటూత్ 5.0,  వై ఫై, యూ‌ఎస్‌బి కనెక్టివిటీతో అందుబాటులోకి రానుంది.  ప్రయాణాల్లో యూ‌ఎస్‌బిని క్యారీ చేసుకోవచ్చు. ఫోన్ నియర్ ఫీల్డ్ టెక్నాలజీతో డెబిట్, క్రెడిట్ తో పాటుు ఇతర ట్రాన్సాక్షన్లకు సహకరిస్తుంది.  

కాన్ఫిగరేషన్ : ఈ ఫోన్ మిడ్ రేంజ్ స్నాప్‌డ్రాగన్ 730 జీ చిప్‌ను కలిగి ఉంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో  ఉండగా మెమొరి కార్డ్ ను ఎక్స్ ప్యాండ్ చేసే అవకాశం లేకుండా పోయింది.  ప్రాసెసర్ 8 ఎన్ఎమ్  ప్రాసెస్‌తో డిజైన్ చేయగా అడ్రినో 618 జీపీయూ కు యాడ్ చేసిన  ఆక్టా-కోర్ (2x2.2 గిగాహెర్ట్జ్, క్రియో 470, గోల్డ్   6x1.8 గిగాహెర్ట్జ్ ,క్రియో 470 సిల్వర్  కోర్లను కలిగి ఉంది. షియోమి ఎంఐ నోట్ 10 ఆండ్రాయిడ్ 9.0 పై కంపెనీ యాజమాన్య ఎంఐయూఐ 11 OS తో నడుస్తుంది. ఇంటర్ స్పేస్ గేమ్ ప్లే మోడ్, స్కానర్ తో పాటు కొన్ని అడిషనల్ ఫీచర్స్ ను కలిగి ఉంది.

also read సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్.... 48MP ట్రిపుల్ రియర్ కెమెరాతో..
 
ఫ్లాట్ ఫామ్:  షియోమి ఎంఐ యూఐ 11 అండ్రాయిడ్ స్కీన్ తో పాటు ఆపరేటింగ్ సిస్టమ్ 9.0 ఉంటుంది. స్క్రీన్ రికార్డర్ ద్వారా ఇన్ స్టాల్ చేసిన యాప్ లను స్కాన్ చేయడంతో పాటు, నోటిఫికేషన్ లను సైతం భద్రపరుస్తుంది. పలు ఆన్ లైన్ గేమ్ లను రికార్డ్ చేసే గేమిండ్ సౌకర్యం ఉంది. క్వాక్కామ్ స్నాప్ డ్రాగన్ 730చిప్ ను కలిగి ఉంటుంది.  స్నాప్‌డ్రాగన్ 730 జి గేమింగ్ కోసం రూపొందించబడింది. గేమ్‌ప్లేలో సహాయపడే  స్పెషల్ అడిషన్స్ తో విడుదల కానుందని కంపెనీ తెలిపింది.  

టెక్నాలజీ: 15% గ్రాఫిక్స్, లాంగ్ టర్మ్ ఎవల్యూషన్  ఫ్రీక్వెన్సీ డివిజన్ డీలక్స్, లాంగ్ టర్మ్ వైఫై ఎఫ్ ఐ డిస్ ప్లే,  బ్లూటూత్ 5.0 లకు సపోర్ట్ చేస్తుంది.  

సెన్సార్స్ : ఫోన్‌ డిస్ ప్లే  లో ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్, పిక్చర్ క్వాలిటీ కోసం ఫేస్ అన్‌లాక్ సిస్టమ్ తో పాటు సెన్సార్, ఇన్-స్క్రీన్ యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, ఎలక్ట్రానిక్ కంపాస్, వైబ్రేషన్ మోటర్, ఐఆర్ బ్లాస్టర్‌ వస్తుంది.
 
ఫోన్ ధర: ఎం‌ఐ నోట్ 10 ధర ఇండియాలో రూ .31467 నుండి ప్రారంభమవుతుందని టెక్ నిపుణులు  భావిస్తున్నారు. ఈ మొబైల్ ఫోన్లు 256 జీబీ వేరియంట్ (ల) లో లభిస్తాయని భావిస్తున్నారు . ఎం‌ఐ నోట్ 10 ఆక్వా బ్లూ కలర్ తో వివిధ ఆన్‌లైన్ స్టోర్లలో లభిస్తుంది  

Follow Us:
Download App:
  • android
  • ios