ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..?
ఒక సైడ్ డాన్సర్.. ఆతరువాతకాలంలో స్టార్ హీరోయిన్ గా మారడం .. వినడానికే విచిత్రంగా ఉంది కదా..? రవితేజ సినిమాలో చూపించినట్టు.. టాలీవుడ్ లో సైడ్ డాన్సర్ గా నటించి టాలీవుడ్ ను ఏలిన ఆ మీరోయిన్ ఎవరో తెలుసా..?
నేనింతే సినిమాలో రవితేజ ప్రేమించిన హీరోయిన్.. సినిమాల్లో సైడ్ డాన్సర్ గా చేస్తుంది.. ఆతరువాత ఆమె స్టార్ హీరోయిన్ గా మారుతుంది. సరిగ్గా అలాగే మన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా జరిగింది. మీరు చూస్తున్న ఈ పాటలో సైడ్ డాన్సర్ గాకనిపించినఈ బ్యూటీ... ఆతరువాత కాలంలో హీరోయిన్ గా మారి.. స్టార్ హీరోల సరసన ఆడిపాడింది.
ఇంతకీ ఈ పాట ఎందులోదో గుర్తుపట్టారా..? ఒకప్పుడు యూత్ లో సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసిన 7/జీ బృందావన్ కాలనీ సినిమాలోది ఈపాట. 7/జీ బృందావన్ కాలనీ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకుంది ఈ సినిమా. పై ఫోటో ఈ సినిమాకు సంబంధించిందే.. 7/జీ బృందావన్ కాలనీ సినిమాలో సైడ్ డాన్సర్ గా కనిపించిన ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
ధనుష్ లేకుండానే ఐశ్వర్య రజినీకాంత్ గృహ ప్రవేశం.. కొత్తిల్లు కొన్న సూపర్ స్టార్ కూతురు..
ఇలా సైడ్ డాన్సర్ గా నటించి.. ఆతరువాత టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా మారింది ఎవరో కాదు.. పంచదార బొమ్మ.. కాజల్ అగర్వాల్. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఏలిన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందు సైడ్ డాన్సర్ గా.. జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా నటించిందట. ఈక్రమంలోనే ఆమె 7/జీ బృందావన్ కాలనీ సినిమాలో ఓ పాటలో అలా కనిపించి ఇలా మాయమయ్యింది కాజల్.
టాలీవుడ్ లో రిచ్చెస్ట్ హీరో ఎవరో తెలుసా..? ఆయన ఆస్తులు అన్ని వేల కోట్లా..? వైరల్ న్యూస్..
kajal aggarwal
ఇలా సైడ్ క్యారెక్టర్లు చేస్తూ.. వచ్చిన కాజల్..చిన్నగా హీరోయిన్ గా అవకాశాల కోసం ట్రై చేసింది. టాలీవుడ్ లో కల్యాణ్ రామ్ జోడీగా లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది బ్యూటీ. ఆతర్వాత చందమామ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఇక వెంట వెంటనే అవకాశాలు రావడంతో.. తిరుగులేని కెరీర్ ను కొనసాగించింది బయూటీ.
స్టార్ హీరోల సరసన వరుసగా ఆఫర్లు సాధించింది కాజల్. రామ్ చరణ్ జోడీగా చేసిన మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది కాజల్. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. టాలీవుడ్ తో పాటు తమిళ పరిశ్రమలో కూడా స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది ఈ చిన్నది. ఇక మూడేళ్ళ కిందట పెళ్లి చేసుకొని సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చింది. వెంటనే ఓ బిడ్డకు జన్మనిచ్చింది.
Prasanna Vadanam Review: `ప్రసన్నవదనం` మూవీ రివ్యూ.. సుహాస్ ఖాతాలో మరో హిట్ పడిందా..?
ప్రస్తుతం సినిమాల్లో మళ్లీ యాక్టీవ్ అవ్వాలని చూస్తోంది కాజల్. ఆమధ్య బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. మరికొన్ని సినిమాలు ఆమె ఖాతాలో ఉననట్టు తెలుస్తోంది.