Asianet News TeluguAsianet News Telugu

ఆపిల్ నుండి రెండు కొత్త మోడళ్ స్మార్ట్ ఫోన్లు

2020 కొత్త సంవత్సరంలో రెండు 'ఐఫోన్ ఎస్ఇ 2' మోడళ్లను వేర్వేరు సైజులో విడుదల చేయబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఐఫోన్ ఎస్‌ఈ 2 మోడళ్లకు 3డి టచ్ ఫీచర్ ఉండదు, దీనిని ఐఫోన్ 11 నుండి కంపెనీ తొలగించింది.

apple set to launch new upgrade model phone of se 2 model
Author
Hyderabad, First Published Jan 4, 2020, 4:40 PM IST

కుపెర్టినోకు చెందిన టెక్ దిగ్గజం కంపెనీ ఆపిల్ 2020 కొత్త సంవత్సరంలో రెండు 'ఐఫోన్ ఎస్ఇ 2' మోడళ్లను వేర్వేరు సైజులో విడుదల చేయబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. రాబోయే ఐఫోన్ ఎస్‌ఈ 2 మోడల్స్ 5.5 ఇంకా 6.1-అంగుళాల ఎల్‌సిడి డిస్‌ప్లేను కలిగి ఉంటాయని ఒక వెబ్ సైట్ ఇటీవల తెలిపింది.

also read సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్.... 48MP ట్రిపుల్ రియర్ కెమెరాతో..


ఆపిల్ విశ్లేషకుడు మింగ్-చి కుయో "ఐఫోన్ ఎస్‌ఈ 2" గా పిలువబడే మరో కొత్త మోడల్ "ఐఫోన్ ఎస్‌ఈ 2 ప్లస్"  కూడా ఉండొచ్చని సూచించారు. కాని 2021 మొదటి భాగంలో దీనిని లాంచ్ చెయ్యొచ్చు. ‘ఐఫోన్ ఎస్‌ఈ 2’ అని పిలవబడే స్టార్టింగ్ మోడల్ టచ్ ఐడి, హోమ్ బటన్‌తో సహా ఐఫోన్ 8 ను పోలి ఉంటుంది. అయితే అత్యంత వేగంగా పనిచేసే A13 చిప్ అలాగే 3GB RAM ఇందులో ఉంటుంది.


ఐఫోన్ ఎస్‌ఈ 2 మోడల్స్ దాని మదర్‌బోర్డు కోసం 10-లేయర్ సబ్‌స్ట్రేట్ లాంటి పిసిబి (ఎస్‌ఎల్‌పి) ను ఉపయోగిస్తారు. ఐఫోన్ 11 వెర్షన్ లో ఇదే టెక్నాలజిని ఉపయోగించారు.ఐఫోన్ 11 సిరీస్ డివైజులో ఉపయోగించిన దానికంటే SLP తక్కువ ఖరీదైన భాగం అయినప్పటికీ, పెండింగ్ హోల్డింగ్స్, జిన్క్సింగ్ మరియు AT&S తో సహా ముల్టీ ఐఫోన్ సప్లయర్స్ కి  ఇది ప్రయోజనం చేకూరుస్తుంది.

also read తక్కువ బడ్జెట్ లో దొరికే లేటెస్ట్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏవో తెలుసా...?

ఐఫోన్ ఎస్‌ఈ 2 మోడళ్లకు 3డి టచ్ ఫీచర్ ఉండదు, దీనిని ఐఫోన్ 11 నుండి కంపెనీ తొలగించింది. అలాగే, ఇది ఫేస్ ఐడిని కాకుండా టచ్ ఐడి ఫింగర్ ప్రింట్ రీడర్‌ను ఉపయోగిస్తుంది.ఈ ఫోన్‌లో సిల్వర్, స్పేస్ గ్రే, రెడ్ వంటి మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అంతకుముందు కుయో మాట్లాడుతూ "ఆపిల్ కొత్త ఐప్యాడ్ ప్రో, కొత్త మాక్‌బుక్ ఈ సంవత్సరం మొదటి నెలల్లో ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఎఆర్) హెడ్‌సెట్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios