తియ్యని మామిడి పండ్లు తినాలని ఎవరికి ఉండదు చెప్పండి. కాని కొని టేస్ట్ చేసినప్పుడు కదా.. అది తియ్యగా ఉందో, పుల్లగా ఉందో తెలిసేది. కాని కొన్ని చిట్కాలతో మామిడి పండును కట్ చేయకుండానే దాని టేస్ట్ తెలుసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

మామిడి పండ్ల సీజన్ మొదలైపోయింది. మార్కెట్లో రకరకాల మామిడి పండ్లు లభిస్తాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగినపల్లి, రసాలు, ఉలవపాడు మామిడి, పాయకరావుపేట పండ్లు ఇలా రకరకాల ప్రాంతాలకు చెందిన మామిడి పండ్లు చాలా ఫేమస్. వీటిల్లో కట్ చేయకుండా, టేస్ట్ చేయకుండా తియ్యగా ఉండే పండ్లు గుర్తించాలంటే ఈ టెక్నిక్స్ పాటించండి.

వాసన చూడండి

ఏ రకమైన మామిడి పండైనా అడుగు భాగంలో లేదా కాడ దగ్గర వాసన చూడండి. తీపి, పండు, తేలికపాటి పులుపు కలిసిన వాసన ఉంటే, అది తియ్యగా ఉంటుంది. కెమికల్ వాసన లేదా పులుపు వాసన ఉంటే అది పండినది కాదని అర్థం. లేదా పాడైపోయి కూడా ఉండవచ్చు.

తేలికగా నొక్కి చూడండి

మామిడి పండును చేతిలో పట్టుకుని తేలికగా నొక్కి చూడండి. మెత్తగా కానీ గట్టిగా కానీ ఉండాలి. రాయిలా గట్టిగా ఉంటే అది పచ్చిదని అర్థం. చాలా మెత్తగా, గుజ్జులా ఉంటే, అది ఎక్కువగా పండి పాడైపోయి ఉండవచ్చు.

రంగు చూడండి

మామిడి రంగు రకరకాలుగా ఉంటుంది. కొన్ని పసుపు, కొన్ని ఎరుపు కలిసిన పసుపు రంగులో ఉంటాయి. ప్రకాశవంతంగా, ఒకే రంగులో ఉన్నాయంటే అవి పండినవని అర్థం. పచ్చ రంగు ఎక్కువగా ఉంటే అది ఇంకా పండలేదు. కానీ కొన్ని రకాలు పండినా కూడా తేలికపాటి పచ్చ రంగులోనే ఉంటాయి. ఉదాహరణకు, "కిలి మూకు మాంగో" పండినా పచ్చగానే ఉంటుంది.

తొక్క చూడండి

మామిడి పండు తొక్క మెరుస్తూ, ముడతలు లేకుండా ఉండాలి. ముడతలు పడిన తొక్క, నీరు తగ్గిన లేదా ఎక్కువగా పండిందని అర్థం. మచ్చలు లేదా లోపాలు ఉంటే అవి పాడైనవి, పురుగులు పట్టినవి కావచ్చు.

బరువు చూడండి

మామిడి పండును చేతిలో పట్టుకుని చూడండి. దాని సైజుకి తగ్గ బరువు ఉండాలి. బరువైన పండ్లు ఎక్కువ రసం, తీపితో ఉంటాయి. తేలికైనవి ఎండిపోయి ఉండవచ్చు. రసం తక్కువగా ఉండవచ్చు.

మామిడి పండ్లు కొన్న తర్వాత పండకపోతే గది ఉష్ణోగ్రత వద్ద ఉంచినా పండిపోతాయి. పండిన వాటిని ఫ్రిజ్‌లో రెండు రోజుల వరకు ఉంచవచ్చు.