ఓట్స్ లో ఉండే బీటా-గ్లూకన్ లివర్ ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఉదయం టిఫిన్ లో ఓట్స్ తీసుకోవడం ఉత్తమం.
రకరకాల గింజలు, తృణధాన్యాలు తినడం వల్ల లివర్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
బ్లూబెర్రీలో ఉండే ఆంథోసైనిన్ లివర్ వాపు తగ్గించడంలో సహాయపడుతాయి.
క్యాబేజీలో ఇండోల్-3 కార్బోనైల్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది లివర్ సమస్యలను తగ్గిస్తుంది.
చిలగడదుంపలో విటమిన్ సి, ఎ, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి లివర్ పనితీరును మెరుగుపరుస్తాయి. లివర్ సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.
బ్రోకలీ తినడం వల్ల లివర్ కు చాలా మేలు జరుగుతుంది. క్రమం తప్పకుండా బ్రోకలీని తింటే కాలేయంలో కొవ్వు పేరుకోవడం తగ్గుతుంది. ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ వంటి కాలేయ సమస్యల నివారణకు గ్రీన్ టీ సహాయపడుతుంది. గ్రీన్ టీ లోని యాంటీఆక్సిడెంట్లు కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి.
ఆలివ్ ఆయిల్‌లో ఉండే ఒలేయిక్ యాసిడ్ కాలేయానికి మేలు చేస్తూ, కొవ్వు కాలేయ వ్యాధిని నివారించడంలో సహాయపడుతుంది.