బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున సూపర్ సక్సెస్. మంచి వాక్చాతుర్యంతో పాటు టైమింగ్ తో అదరగొడుతున్నారు. వారాంతంలో వచ్చే నాగార్జున షో టీఆర్పీ అమాంతంగా పెంచేస్తున్నారు. కాగా నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా సీజన్ మధ్యలోనే తప్పుకోనున్నారని ఓ షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. బిగ్ బాస్ చివరి ఎపిసోడ్స్ నుండి నాగార్జున తప్పుకొని అవకాశం కలదట. దానికి కారణం వైల్డ్ మూవీ అని తెలుస్తుంది. 

కింగ్ నాగార్జున దర్శకుడు సోలోమన్ దర్శకత్వంలో వైల్డ్ డాగ్ అనే ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. నాగార్జున ఈ చిత్రంలో ఎన్ ఐ ఏ అధికారి రోల్ చేస్తున్నారు. ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపిస్తారని సమాచారం. సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి చేసుకుంది. కరోనా వైరస్ కారణంగా విదేశాలలో జరపాల్సిన చిత్రీకరణ మిగిలిపోయింది. 

దీనితో ఓ లాంగ్ షెడ్యూల్ కోసం నాగార్జున థాయిలాండ్ వెళ్లాల్సి ఉందట. అక్కడే ఆయన నెలరోజులకు పైగా గడపాల్సి ఉండగా బిగ్ బాస్ షోకి హోస్ట్ గా చేసే అవకాశం లేదు అంటున్నారు. ఈ విషయమై షో నిర్వాహకులతో చర్చలు జరుపుతున్నారట. మరి ఇదే జరిగితే నాగార్జున బిగ్ బాస్ ని మధ్యలో వదిలేయడం ఖాయం. అంటే బిగ్ బాస్ షోకి ఇది నష్టం చేకూర్చే అంశమే.