Asianet News TeluguAsianet News Telugu

ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన చియాన్ విక్రమ్, కోబ్రా ట్రైలర్ ఎప్పుడంటే..?

ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ న్యూస్ చెప్పాడు సౌత్ స్టార్ సీనియర్ హీరో చియాన్ విక్రమ్. ప్రయోగాలకు పెద్ద పీట వేసే ఈ హీరో.. ఈసారి కూడా అలాంటి సినిమాతోనే రాబోతున్నాడు. ఇక ఈ మూవీ నుంచి ట్రైలర్ డేట్ ను పిక్స్ చేశాడు విక్రమ్.  

Vikram Cobra Movie Trailer date fix
Author
Hyderabad, First Published Aug 22, 2022, 1:35 PM IST

చియన్ విక్రమ్ సౌత్ లో స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్నారు. పేరుకు మాత్రమే ఆయన  తమిళ హీరో కాని తెలుగు, కన్నడ లో కూడా విక్రమ్ కు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన సినిమాలకు క్రేజ్ బాగా ఉంటుంది. విక్రమ్ ప్రయోగాలకు పెద్ద పీట వేస్తారు అందుకే బాషాబేధం లేకుండా ఆయన సినిమాలకోసం ఎగబడతారు జనాలు.  ఇక టాలీవుడ్ విషయానికి వస్తే.. తెలుగు హీరోల‌కు స‌మానంగా ఇక్కడ  క్రేజ్ సంపాదించుకున్న న‌టుడు విక్ర‌మ్‌. సినిమా సినిమాకు వేరియేష‌న్‌ను చూపిస్తూ విల‌క్ష‌ణ‌ న‌టుడుగా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 

ఇక ప్రస్తుతం విక్రమ్ నటించిన కొత్త సినిమా కోబ్రా. ఈ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది.  అజ‌య్ జ్ఞాన‌ముత్తు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విక్రమ్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నారు. ఈ సినిమా చాలా కాలం క్రితం షూటింగ్ పూర్తిచేసుకుంది. కానీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్  వర్క్ లేట్ అయిన కార‌ణంగా. సినిమా  రిలీజ్ లేట్ అవుతూ వస్తోంది. ఇక ఈ మూవీని ఈ నెల అంటే.. అగస్ట్  31న గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు టీమ్. 

ఈ క్ర‌మంలోనే భారీ ప్రమోషన్స్ కు రెడీ అవుతున్నారు కోబ్రా  మేక‌ర్స్. అంతే కాదు అందులో భాగంగా ముందుగా  వ‌రుస అప్‌ డేట్‌ల‌ను రిలీజ్ చేస్తున్నారు. ఇక  తాజాగా మేక‌ర్స్ మ‌రో బిగ్ అప్‌డేట్‌ను  అనౌన్స్ చేశారు. విక్రమ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కోబ్రా ట్రైల‌ర్ డేట్‌ను మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. ఈ మూవీట్రైల‌ర్‌ను ఆగ‌స్టు 25న రిలీజ్  చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా పేజ్ లో విక్రమ్ ప్రకటించారు. ఇక విక్రమ్ కోబ్రాలో ఏడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు. మెయిన్ గా విక్రమ్ సైంటిస్ట్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. 

 

 

ఇప్ప‌టి వరకూ ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతీ అప్ డేట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పోస్ట‌ర్లు, పాట‌లు  కోబ్రాపై విప‌రీత‌మైన క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి.  ఈమూవీలో  విక్ర‌మ్‌కు జోడీగా కెజియఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించింది.మరో విశేషం ఏంటీ అంటే..ఈమూవీలో విలన్ గా స్టార్ క్రికెటర్ ఇర్పాన్ ఖాన్ నటించారు సెవెన్ స్క్రీన్ స్డూడియోస్ ప‌తాకంపై ఎస్‌.ఎస్‌. ల‌లిత్ కుమార్  అత్యంత ప్ర‌తిష్ఠాత్మకంగా సినిమాను నిర్మించాడు. ఎప్పటిలాగానే ఏఆర్‌. రెహ‌మాన్ సంగీతం అందించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios